తెలుగు న్యూస్ / ఫోటో /
Tirumala Tour Package : 3 రోజుల 'తిరుమల' ట్రిప్ - చాలా తక్కువ ధరతో కరీంనగర్ నుంచి టూర్ ప్యాకేజీ, ఇవిగో వివరాలు
- Karimnagar Tirumala Tour : కరీంనగర్ నుంచి తిరుమల టూర్ ప్యాకేజీ ప్రకటించింది IRCTC టూరిజం. 4 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ట్రైన్ జర్నీ ద్వారా ఆపరేట్ చేస్తున్నారు. పూర్తి వివరాలను ఇక్కడ చూడండి…..
- Karimnagar Tirumala Tour : కరీంనగర్ నుంచి తిరుమల టూర్ ప్యాకేజీ ప్రకటించింది IRCTC టూరిజం. 4 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ట్రైన్ జర్నీ ద్వారా ఆపరేట్ చేస్తున్నారు. పూర్తి వివరాలను ఇక్కడ చూడండి…..
(1 / 7)
కరీంనగర్ నుంచి ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాలను చూసేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. 'SAPTHAGIRI' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది.(photo source unsplash.com)
(2 / 7)
ఈ టూర్‌లో కాణిపాకం, తిరుచానూరు, తిరుమల, తిరుపతి ప్రాంతాలు కవర్ అవుతాయి. ప్రస్తుతం ఈ టూర్ జూన్ 13, 2024 తేదీన అందుబాటులో ఉంది. 3 రాత్రులు, 4 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ప్రస్తుత తేదీ మిస్ అయితే మరో తేదీలో వెళ్లొచ్చు.(photo source unsplash.com)
(3 / 7)
కరీంనగర్ నుంచి (Train No. 12762) రాత్రి 07.15 గంటలకు రైలు బయల్దేరుతుంది. పెద్దపల్లి స్టేషన్ వద్ద ఎక్కేవారు రాత్రి 8.05 నిమిషాలకు, వరంగల్ వద్ద రాత్రి 9.15, ఖమ్మం వద్ద 11 గంటలకు రైలు స్టేషన్ కు చేరుకుంటుంది. రాత్రి మొత్తం ప్రయాణం ఉంటుంది.(photo source unsplash.com)
(4 / 7)
ఉదయం 07.50 నిమిషాలకు తిరుపతి రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. హోటల్ లోకి చెకిన్ అయిన తర్వాత.. ఫ్రెష్ అప్ అవుతారు. అక్కడ్నుంచి శ్రీనివాస మంగాపురం, కాణిపాకం ఆలయాలను సందర్శిస్తారు. అనంతరం శ్రీకాళహస్తీ, తిరుచానూరు ఆలయాలకు వెళ్తారు. తిరిగి హోటల్ కు చేరుకుంటారు. రాత్రి తిరుపతిలోనే బస చేస్తారు. మూడో రోజుబ్రేక్ ఫాస్ట్ అయిన తర్వాత..హోటల్ నుంచి చెక్ అవుట్ అవుతారు. ఉదయం 08.30 గంటలకు తిరుమల చేరుకుంటారు. ప్రత్యేక దర్శనం ద్వారా తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం తిరుపతి రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. రాత్రి 08.15 గంటలకు జర్నీ స్టార్ట్ అవుతుంది.(photo source unsplash.com)
(5 / 7)
4వ రోజు తెల్లవారుజామున ఉదయం 03.26 గంటలకు ఖమ్మం, 04.41 గంటలకు వరంగల్, 05.55 గంటలకు పెద్దపల్లి, ఉదయం 08.40 నిమిషాలకు కరీంనగర్ చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.(photo source unsplash.com)
(6 / 7)
కరీంనగర్ - తిరుమల టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే… సింగిల్ షేరింగ్ కు రూ. 9010 ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 7640 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.7560గా ఉంది. ఈ ధరలు కంఫార్ట్ క్లాస్ లో ఈ ధరలు ఉంటాయి. స్టాండర్డ క్లాస్ లో ట్రిపుల్ షేరింగ్ కు రూ. 5660గా నిర్ణయించారు. (photo source unsplash.com)
(7 / 7)
5 నుంచి 11 ఏళ్ల చిన్నారులకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. పూర్తి వివరాలను కింద ఇచ్చిన జాబితాలో చూసుకోవచ్చు. ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవవుతాయి. షరతులు కూడా వర్తిస్తాయి. టూర్ ప్యాకేజీని బుకింగ్ చేసుకునేందుకు www.irctctourism.com వెబ్ సైట్ లోకి వెళ్లాలి.(photo source unsplash.com)
ఇతర గ్యాలరీలు