Anant Ambani Diet: అనంత్ అంబానీ బరువు తగ్గేందుకు ప్రతిరోజూ తినే ఆహారాల జాబితా ఇదే-this is the list of foods anant ambani eats daily to lose weight ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Anant Ambani Diet: అనంత్ అంబానీ బరువు తగ్గేందుకు ప్రతిరోజూ తినే ఆహారాల జాబితా ఇదే

Anant Ambani Diet: అనంత్ అంబానీ బరువు తగ్గేందుకు ప్రతిరోజూ తినే ఆహారాల జాబితా ఇదే

Haritha Chappa HT Telugu
Mar 19, 2024 10:30 AM IST

Anant Ambani Diet: ముఖేష్, నీతా అంబానీల చిన్న కొడుకు అనంత్ అంబానీ. అతను తన బరువును తగ్గించుకోవడం కోసం స్ట్రిక్ట్ డైట్‌ను ఫాలో అవుతున్నారు. ఆ డైట్ లో భాగంగా ఎలాంటి ఆహారాన్ని తింటారో తెలుసుకోండి.

అనంత్ అంబానీ ఏం తింటారు?
అనంత్ అంబానీ ఏం తింటారు? (AP)

Anant Ambani Diet: అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలతో హైలైట్ అయ్యారు. జామ్ నగర్లో జరిగిన ఈ వేడుక ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. ఆయన బరువు చాలా ఎక్కువ. అయితే 2016లో 18 నెలల్లోనే ఆయన 108 కిలోల బరువును తగ్గించాడు. అంతకుముందు ఆయన 200 కిలోల బరువు ఉండేవారు. సంవత్సరన్నరలో 100 కిలోలకు పైగా బరువు తగ్గారు. అప్పట్లో అతడిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. మళ్ళీ స్టెరాయిడ్స్ వాడడం వల్ల బరువు పెరగడం ప్రారంభించారు. బరువు తగ్గేందుకు అతను ఎలాంటి డైట్ ను ఫాలో అవుతున్నారో ఫిట్‌నెస్ నిపుణులు వివరిస్తున్నారు.

సెలబ్రిటీ ట్రైనర్, ఫిట్‌నెస్ కోచ్ అయిన వినోద్ చన్నా అనంత్ అంబానీ బరువు తగ్గేందుకు సహకరించారు. అతను ప్రతిరోజూ తినాల్సిన డైట్‌ను ముందుగానే నిర్ణయించారు. ఎంతసేపు వ్యాయామం చేయాలి? ఎలాంటి వ్యాయామాలు చేయాలి? నడక ఎంత సేపు చేయాలి? అన్నవి కూడా వినోద్ నిర్ణయించారు. అతను అనంత అంబానీ ఎలాంటి ఆహారాన్ని తింటారో వివరించారు.

అంబానీ ఏం తింటారు?

అనంత్ అంబానీ ప్రతిరోజూ 1200 నుంచి 1400 క్యాలరీల మధ్యన ఉన్న ఆహారాన్ని తింటాడు. అతను తినే ఆహారంలో కూరగాయలు, మొలకలు, పప్పు దినుసులు, అర స్పూను నెయ్యి, కాటేజ్ చీజ్ వంటివి అధికంగా ఉంటాయి.

అనంత్ అంబానీకి అతిగా తినే అలవాటు ఉండేది. అలాగే జంక్ ఫుడ్ ను బాగా ఇష్టపడేవారు. ఆ అలవాటను మానిపించి ఇలాంటి ఆహారాన్ని తినేలా చేయడం కోసం కష్టంగానే మారింది. అనంత అంబానీ కోసం తయారు చేసిన డైట్ లో ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి.

బరువు తగ్గేందుకు అనంత్ అంబానీ పూర్తిగా జంక్ ఫుడ్‌ను వదిలేశారు. పూర్తిగా శాకాహారాన్ని ఫాలో అవడం ప్రారంభించారు. ఒకే రోజులో ఒకేసారి ఎక్కువ మొత్తంలో తినకుండా చిన్న చిన్న భోజనాలుగా విభజించుకొని తినడం ప్రారంభించారు. ఎక్కువగా నీటిని తాగేవారు. అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలిని ఫాలో అవడంతో పాటు, సానుకూల మనస్తత్వం ఉండాలని వివరించారు. రోజులో తగినంత నిద్ర కూడా బరువు తగ్గడానికి చాలా అవసరమని ఆయన చెప్పారు.

ప్రతిరోజూ కచ్చితంగా డైట్ రొటీన్‌తో పాటు అనంత అంబానీ ఐదు నుంచి 6 గంటల పాటు వ్యాయామం చేస్తారు. రోజూ 21 కిలోమీటర్లు నడుస్తారు. వ్యాయామంలో భాగంగా కార్డియో, యోగా, స్ట్రెంత్ ట్రైనింగ్, ఫ్లెక్సిబిలిటీ వ్యాయామాలు ఉంటాయి.

ఇలా ఖచ్చితమైన డైట్ ఫాలో అవుతూ, వ్యాయామాలు చేయడం వల్లే అనంత అంబానీ గతంలో బరువు తగ్గారు. ఇప్పుడు ఇదే డైట్ ఫాలో అవుతూ పెరిగిన బరువును మళ్ళీ తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు.

నీతా అంబానీ గతంలో మాట్లాడుతూ అనంత్ అంబానీ ఆరోగ్యం గురించి వివరించారు. అనంత్‌కు ఉబ్బసం తీవ్రస్థాయిలో ఉంటుంది. కాబట్టి ఆయన అధికంగా స్టెరాయిడ్లు వాడాల్సి వచ్చింది. దీనివల్ల బరువు పెరగడం జరుగుతుంది. నీటిని అధికంగా నిలువ చేసేలా చేస్తాయి. అంతేకాదు ఈ స్టెరాయిడ్లు ఆకలిని ఎక్కువగా పెంచుతాయి. దీనివల్ల అవసరమైన దానికంటే ఎక్కువ క్యాలరీల ఆహారాన్ని తీసుకుంటారు. బరువు సులువుగా పెరుగుతారు. శరీరంలో కొవ్వు నిల్వలు అధికంగా నిల్వ ఉండేలా చేస్తాయి. అంతేకాదు కొవ్వుల విచ్చిన్నతను కూడా తగ్గిస్తాయి. దీనివల్ల కొవ్వు పొట్ట, మెడ, ముఖం వంటి భాగాల్లో పేరుకు పోతాయి. దీని ఫలితంగానే బరువు పెరుగుతారు.

Whats_app_banner