Healthy Drinks For Sex Drive : ఈ డ్రింక్స్​ మీలో సెక్స్ స్టామినాను పెంచుతాయట..-these natural and healthy drinks improve your sex stamina and sex drive here is the details ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Healthy Drinks For Sex Drive : ఈ డ్రింక్స్​ మీలో సెక్స్ స్టామినాను పెంచుతాయట..

Healthy Drinks For Sex Drive : ఈ డ్రింక్స్​ మీలో సెక్స్ స్టామినాను పెంచుతాయట..

Geddam Vijaya Madhuri HT Telugu
Nov 18, 2022 07:00 PM IST

Healthy Drinks For Sex Drive : పెరిగే వయసు.. తీసుకుంటున్న ఒత్తిడి ఇలా రకరకాల కారణాలతో శరీరంలో లిబిడో తగ్గుతుంది. దీనివల్ల స్త్రీ, పురుషుల్లో సెక్స్ సామర్థ్యం తగ్గుతుంది. అయితే కొన్ని ఆహారాలు, పానియాలతో సహజంగా లిబిడోను పెంచుకోవచ్చు అంటున్నాయి కొన్ని అధ్యయనాలు. ఇంతకీ వేటిని తీసుకుంటే.. సెక్స్ డ్రైవ్‌ను కొత్త స్థాయికి తీసుకెళ్లవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

సెక్స్ డ్రైవ్ పెంచే పానీయాలు
సెక్స్ డ్రైవ్ పెంచే పానీయాలు

Healthy Drinks For Sex Drive : వృద్ధాప్యం మీ శక్తిని మాత్రమే కాకుండా.. మీ ఆకలిని కూడా మార్చేస్తుంది. ఒక్కోసారి ఒత్తిడి కూడా మీ ఆహారంలో గట్టి మార్పులు తీసుకువస్తుంది. ఇది మీ శారీరక చురుకుదనం, ఆహారంపై ఉన్న కోరికను కూడా హరిస్తుంది. అంతేకాకుండా ఇది మీ సెక్స్ డ్రైవ్‌ను తగ్గించేస్తుంది. కాలక్రమేణా మీ లిబిడోలో తగ్గుదలని మీరు గమనిస్తారు. ఇది మీ భాగస్వామితో మీ ఉద్వేగభరితమైన క్షణాల ఫ్రీక్వెన్సీ, స్వభావాన్ని దెబ్బతీస్తుంది. మీరు ఈ సమస్యను అనుభవిస్తుంటే.. ఇది మీకోసమే. ఎందుకంటే లిబిడో పెంచుకోవడానికి కొన్ని సహజమైన పరిష్కారాలు ఉన్నాయి.

లిబిడో తగ్గితే.. యోని పొడిబారడం, కీళ్ల నొప్పులు, సెక్స్ పట్ల తక్కువ ఆసక్తి, ఇలాంటి మరెన్నో లైంగిక ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి.. మీ సెక్స్ డ్రైవ్‌ను తగ్గిస్తాయి. ఈ సమస్యను అధిగమించాలి అంటే.. మీరు తప్పకుండా వ్యాయామం చేయాలి. అంతేకాకుండా సమతుల్య ఆహారం తీసుకోవాలి. ఇవి సెక్స్ డ్రైవ్, సెక్స్ స్టామినాను పెంచడంలో సహాయం చేస్తాయి. అంతేకాకుండా కొన్ని లిబిడో-బూస్టింగ్ పానీయాలు మీ డైట్లో చేర్చుకోవచ్చు. ఇవి సహజంగా లిబిడో, సెక్స్ డ్రైవ్‌ను పెంచేందుకు సహాయం చేస్తాయి. అవేంటంటే..

గ్రీన్ టీ

గ్రీన్ టీ బరువు తగ్గడానికి ఒక అద్భుత పానీయం మాత్రమే కాదు. దీనితో మీ లైంగిక కోరికను కూడా పునరుద్ధరించవచ్చు. గ్రీన్ టీలో కాటెచిన్స్ అనే రిచ్ కాంపౌండ్స్ ఉంటాయి. ఇవి రక్త ప్రవాహాన్ని ప్రోత్సహిస్తాయి. ఇది సెక్స్ డ్రైవ్‌ను పెంచడానికి సహాయపడుతుంది.

బ్లాక్ కాఫీ

కాఫీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుందని చెప్తారు. కెఫిన్‌తో నిండిన బ్లాక్ కాఫీ పురుషులు, మహిళల్లో కూడా సెక్స్ డ్రైవ్‌కు ప్రయోజనకరంగా ఉంటుందని చెప్తారు. హ్యూస్టన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ హెల్త్ సైన్స్ సెంటర్ (UTHealth) 2015లో జరిపిన అధ్యయనం ప్రకారం.. ప్రతిరోజూ కాఫీ తాగే పురుషుల్లో అంగస్తంభన ప్రమాదం తక్కువగా ఉంటుందని వెల్లడించింది.

రెడ్ వైన్

ది జర్నల్ ఆఫ్ సెక్సువల్ మెడిసిన్.. వైన్ సేవించడం వల్ల పురుషులు, స్త్రీలలో లైంగిక ప్రేరేపణను పెంచుతుందని పేర్కొంది. రెండు గ్లాసుల రెడ్ వైన్ తీసుకోవడం వల్ల మహిళల్లో సెక్స్ డ్రైవ్ పెరుగుతుంది. పురుషులలో రెడ్ వైన్ టెస్టోస్టెరాన్ను పెంచుతుంది. అయితే దీనిని అతిగా సేవించకూడదని హెచ్చరిస్తున్నారు.

బనానా షేక్

ఆరోగ్యకరమైన, రుచికరమైన అరటి షేక్ మిమ్మల్ని ఎప్పుడూ నిరుత్సాహ పరచదు. ఇది మీకు శారీరక బలాన్ని ఇచ్చి.. మీ సెక్స్ డ్రైవ్‌ను కూడా పెంచుతుంది. అరటిపండులో బ్రోమెలైన్ ఎంజైమ్ ఉంటుంది. ఇది పురుషులలో లిబిడో, టెస్టోస్టెరాన్‌లను పెంచుతుంది. తక్కువ లిబిడో చికిత్స కోసం మీ రోజువారీ ఆహారంలో దీన్ని చేర్చుకోవచ్చు.

దానిమ్మ రసం

లైంగిక హార్మోన్లను పెంచడంలో దానిమ్మ ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. యుఎస్‌లోని బెవర్లీ హిల్స్ క్లినిక్‌లో నిర్వహించిన ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఇంపోటెన్స్ రీసెర్చ్‌లో ఇటీవల ప్రచురించిన ఓ అధ్యయనంలో.. దానిమ్మ రసం తీసుకోవడం వల్ల లైంగిక అవయవాలకు రక్త ప్రసరణ పెరుగుతుందని కనుగొన్నారు. కానీ ప్యాక్ చేసిన దానిమ్మ రసానికి దూరంగా ఉండడమే ఉత్తమం.

వీటిని ప్రయత్నించే ముందు.. సెక్స్ డ్రైవ్‌కు చికిత్స గురించి లైంగిక ఆరోగ్య నిపుణుడి సలహాను తీసుకోండి. అవి మీకు మరింత సహాయం చేస్తాయి.

Whats_app_banner

సంబంధిత కథనం