Red Wine Benefits : రెడ్ వైన్‌తో ఎన్ని ఉపయోగాలో.. తెలిస్తే మీరు కూడా తాగేస్తారు
Red Wine Benefits : వైన్.. ముఖ్యంగా రెడ్ వైన్ తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉంటాయని పలు పరిశోధనలు నిరూపించాయి. అయితే ఫ్రెండ్లీ గెట్ టూ గెదర్ సమయంలో మీరు దీనిని పరిమితికి తగ్గట్లు తీసుకోవచ్చు అంటున్నారు. కానీ మితంగా తీసుకుంటే అనర్థాలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
Red Wine Benefits : గుండె జబ్బుల నుంచి ఎముకల వరకు.. మితంగా వైన్ తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని పరిశోధనలు నిరూపించాయి. మితంగా వినియోగించినప్పుడు వైన్ మీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుందని.. కానీ అమితంగా తీసుకుంటే నష్టం తప్పదని హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది పరిశోధకులు వైన్‌పై పరిశోధనలు చేసి.. నమ్మలేని నిజాలను బయటపెట్టారు. ఇంతకీ వైన్ మితంగా తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
గుండె ఆరోగ్యం కోసం..
వైన్ గుండె కణాలను.. కణజాలం దెబ్బతినకుండా కాపాడుతుంది. అంతేకాకుండా మీ కరోనరీ ధమనులను కూడా ఇది రిలాక్స్ చేస్తుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ముఖ్యంగా రెస్వెరాట్రాల్, ఎల్‌డిఎల్, "చెడు" కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. అంతే కాదు ఇది రక్తం గడ్డకట్టడం, రక్త నాళాలు దెబ్బతినకుండా నిరోధిస్తుంది. రెస్వెరాట్రాల్ వాపు, రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని పరిశోధనలు కూడా నిరూపించాయి.
క్యాన్సర్ రాకుండా..
గ్రీస్‌లోని క్రీట్ విశ్వవిద్యాలయం నిర్వహించిన పరిశోధన ప్రకారం.. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించే వైన్‌లోని సమ్మేళనాలు.. రొమ్ము క్యాన్సర్ కణాల పెరుగుదలను కూడా నెమ్మదించేలా చేస్తాయని నిరూపించాయి. దీనితో పాటు వైన్‌లో ఫినాల్స్ కూడా ఉన్నాయి. ఇవి ప్రోస్టేట్ క్యాన్సర్ కణాల పెరుగుదలను తగ్గిస్తాయి. వైన్, ముఖ్యంగా రెడ్ వైన్ నోటి క్యాన్సర్‌ను నయం చేయడంలో సహాయపడుతుందని మరొక పరిశోధన నిర్ధారించింది.
మెరుగైన జీర్ణక్రియ
ముఖ్యంగా రెడ్ వైన్ యాంటీ బాక్టీరియల్ లక్షణాలతో నిండి ఉంటుంది. ఇవి కడుపు సంబంధిత సమస్యలు రాకుండా చేస్తాయి. నిజానికి రెడ్ వైన్‌ను మితంగా తాగేవారిలో మంచి జీర్ణక్రియ ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. వైన్ తీసుకోవడం వల్ల హెలికోబాక్టర్ పైలోరీ నుంచి ఇన్ఫెక్షన్ తగ్గుతుందని కూడా నిరూపించారు.
జ్ఞాపకశక్తిని పెంచుకునేందుకు
వైన్ మంచి జ్ఞాపకశక్తిని ఇస్తుందని.. పరిశోధనలు చెప్తున్నాయి. ఈ మిశ్రమంలో ఉండే రెస్వెరాట్రాల్ బీటా-అమిలాయిడ్ ప్రోటీన్ ఏర్పడటాన్ని నిరోధిస్తుంది. ఇది అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న రోగులను నయం చేయడానికి కీలకమైన అంశంగా పనిచేస్తుంది. ఒక గ్లాసు వైన్ నిజానికి ఇన్ఫ్లమేషన్లు, టాక్సిన్స్‌తో పోరాడడం ద్వారా మీ మనసుకు విశ్రాంతినిస్తుందని పరిశోధన తేల్చింది.
ఎముకలను దృఢంగా ఉండాలంటే..
రెడ్ వైన్ బోలు ఎముకల వ్యాధిని అభివృద్ధి చేసే ప్రమాదాన్ని తగ్గించగలదని నిరూపించబడింది. మద్యపానం చేయనివారు లేదా అధికంగా తాగేవారి కంటే ఎముకల సాంద్రత ఎక్కువగా ఉన్నట్లు పరిశోధన ద్వారా కనుగొన్నారు. 500 మంది వయస్సు గల స్త్రీలు పాల్గొన్న మరొక పరిశోధనలో ఎముక ఖనిజ సాంద్రత 12% నుంచి 16% వరకు మితమైన మద్యపానం చేసేవారిలో మాత్రమే ఉందని వెల్లడించింది.
మితంగా తాగండి..
ఏదైనా అతిగా తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. ముఖ్యంగా మద్యం విషయానికి వస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యానికి ఎంత మంచిదైనా.. అతిగా తీసుకుంటే.. మరిన్ని సమస్యలు వస్తాయి. అతిగా తాగడం వల్ల ప్రమాదాలు, పక్షవాతం, గుండె ఆగిపోవడం, కాలేయ వ్యాధులు, అధిక రక్తపోటు, ఊబకాయం వంటి సమస్యలు వస్తాయి. గర్భిణీ స్త్రీలు, పలు సమస్యలకు మందులు వాడే వారు దీనికి దూరంగా ఉండాలి.
సంబంధిత కథనం
టాపిక్