High Cholesterol: శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ పెరిగితే వచ్చే మార్పులు ఇవే!-high cholesterol warning signs that tell your cholesterol level is high ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  High Cholesterol: శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ పెరిగితే వచ్చే మార్పులు ఇవే!

High Cholesterol: శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ పెరిగితే వచ్చే మార్పులు ఇవే!

HT Telugu Desk HT Telugu
Jul 30, 2022 04:59 PM IST

శరీరంలో చేడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు చర్మంపై అనేక లక్షణాలు కనిపిస్తాయి. అలాగే కళ్ళపై పసుపు దద్దుర్లు లేదా క్రస్ట్ ఉంటే, ఈ లక్షణాన్ని అస్సలు విస్మరించకూడదు. శరీరంలో పెరిగిన కొలెస్ట్రాల్ ప్రధాన లక్షణాలలో ఇది

<p>High Cholesterol</p>
High Cholesterol

ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటారు. అయితే ఆరోగ్యం పట్ల వహించే అజాగ్రత్త కారణంగా రోగాలు పట్టి పీడిస్తున్నాయి. ప్రస్తుతం చాలా మంది అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నారు. శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే అసంఖ్యాకమైన రోగాలు చుట్టుముడుతాయి. బాడీలో కొవ్వు పెరిగితే ముందుగానే కొన్ని సంకేతాలను ఉంటాయి. అరంభంలోనే కాస్త అప్రమత్తంగా ఉంటే వ్యాధులకు గురికాకుండా ఉండవచ్చు. శరీరం ఇచ్చే సంకేతాలను మనం అర్థం చేసుకుంటే, కొలెస్ట్రాల్ వంటి తీవ్రమైన సమస్యలను నివారించవచ్చు.

సాదరణంగా కొలెస్ట్రాల్ రెండు రకాలు, ఒకటి చెడు కొలెస్ట్రాల్ మరొకటి మంచి కొలెస్ట్రాల్. ఈ రెండింటినీ శరీరంలో సమతుల్యం చేసుకోవడం చాలా ముఖ్యం. అందువల్ల, మీరు మీ శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయికి శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం.

రక్తంలో అధిక కొలెస్ట్రాల్ ఎక్కువగా శరీరంలో చాలా మార్పులు, హెచ్చరికలు ఉంటాయి. ఇది అధిక రక్తపోటు, గుండెపోటు, కరోనరీ ఆర్టరీ వ్యాధి, ట్రిపుల్ నాళాల వ్యాధి వంటి వ్యాధులకు దారి తీస్తుంది. బాడీలో కొలెస్ట్రాల్ స్థాయి పెరిగినప్పుడు శరీరం ఎలాంటి సంకేతాలు ఇస్తుందో తెలుసుకుందాం.

చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు చర్మంపై గుర్తులు కనిపిస్తాయి

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు, చర్మంపై మచ్చలు కనిపిస్తాయి. మీ చర్మంపై నారింజ, పసుపు రంగు గుర్తులు కనిపిస్తే, మీరు తప్పనిసరిగా మీ కొలెస్ట్రాల్ స్థాయిని చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది పెరిగిన కొలెస్ట్రాల్ సంకేతం. ఇది కాకుండా, ఇది గుండె జబ్బులకు సంకేతం కూడా కావచ్చు.

కొలెస్ట్రాల్ పెరగడం వల్ల కళ్లపై పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి

మీ కళ్ళపై పసుపు దద్దుర్లు లేదా క్రస్ట్ ఉంటే, అప్పుడు ఈ లక్షణాన్ని అస్సలు విస్మరించకూడదు. శరీరంలో పెరిగిన కొలెస్ట్రాల్ ప్రధాన లక్షణాలలో ఇది ఒకటి. రక్తంలో కొవ్వు తక్కువగా ఉన్నప్పుడు ఇది జరుగుతుంది. ఇది కాకుండా, కళ్లపై పసుపు రంగు దద్దుర్లు కూడా మధుమేహానికి సంకేతం . కాబట్టి మీకు అలాంటి లక్షణాలు కనిపిస్తే, వెంటనే మీ కొలెస్ట్రాల్ చెక్ చేసుకోండి.

చేతులు మరియు కాళ్ళ చర్మంపై నొప్పి

రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరిగినప్పుడు, చేతులు, కాళ్ళ చర్మంపై జలదరింపు మొదలవుతుంది. అందువల్ల, మీకు మీ చేతులు మరియు కాళ్ళ చర్మంలో కూడా నొప్పి ఉంటే, దానిని విస్మరించవద్దు, మీ కొలెస్ట్రాల్‌ను చెక్ చేసుకోండి.

Whats_app_banner

సంబంధిత కథనం