Women's Health | ధూమపానం, మద్యపానం అలవాటు ఉన్న స్త్రీలకు ఈ సమస్యలు తప్పవు!-6 ways tobacco and alcohol can play havoc with women s health ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Women's Health | ధూమపానం, మద్యపానం అలవాటు ఉన్న స్త్రీలకు ఈ సమస్యలు తప్పవు!

Women's Health | ధూమపానం, మద్యపానం అలవాటు ఉన్న స్త్రీలకు ఈ సమస్యలు తప్పవు!

Jun 22, 2022, 08:16 PM IST HT Telugu Desk
Jun 22, 2022, 08:15 PM , IST

  • ఈ మధ్య కాలంలో స్త్రీలు మద్యపానం, ధూమపానం వంటి వాటికి ఎక్కువగా అలవాటుపడుతున్నారు. ముఖ్యంగా సిటీలలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. దీనివల్ల స్త్రీలలో నెలసరి సమస్యలు మొదలుకొని, వంధ్యత్వం వరకు అనేక దుష్ప్రభావాలున్నాయని డాక్టర్లు అంటున్నారు.

భారతదేశంలో ప్రతిరోజూ మద్యపానం, ధూమపానం చేసే మహిళలు సుమారు 12.1 మిలియన్ల మంది ఉన్నారని అంచనా. ఈ అలవాట్లు స్త్రీలపై హానికరమైన ప్రభావాలు చూపుతున్నాయి. దీనిపై ఫోర్టిస్ ఎస్కార్ట్ హాస్పిటల్ లోని ప్రసూతి- గైనకాలజీ విభాగంలో సీనియర్ కన్సల్టెంట్ డా. శ్వేతా మెండిరట్ట చర్చించారు.

(1 / 7)

భారతదేశంలో ప్రతిరోజూ మద్యపానం, ధూమపానం చేసే మహిళలు సుమారు 12.1 మిలియన్ల మంది ఉన్నారని అంచనా. ఈ అలవాట్లు స్త్రీలపై హానికరమైన ప్రభావాలు చూపుతున్నాయి. దీనిపై ఫోర్టిస్ ఎస్కార్ట్ హాస్పిటల్ లోని ప్రసూతి- గైనకాలజీ విభాగంలో సీనియర్ కన్సల్టెంట్ డా. శ్వేతా మెండిరట్ట చర్చించారు.(Pixabay)

మెనోపాజ్‌లో ఉంటూ ధూమపానం చేసే అలవాటు కలిగిన స్త్రీలలో ఎముకలు దృఢతం కోల్పోయి పలుచగా తయారవుతున్నాయి.

(2 / 7)

మెనోపాజ్‌లో ఉంటూ ధూమపానం చేసే అలవాటు కలిగిన స్త్రీలలో ఎముకలు దృఢతం కోల్పోయి పలుచగా తయారవుతున్నాయి.(Shutterstock)

పొగాకు వినియోగించే స్త్రీలు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే దీర్ఘకాలికమైన కీళ్ల వ్యాధిని కొనితెచ్చుకుంటున్నారు.

(3 / 7)

పొగాకు వినియోగించే స్త్రీలు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే దీర్ఘకాలికమైన కీళ్ల వ్యాధిని కొనితెచ్చుకుంటున్నారు.(Pixabay)

పొగాకు వాడకం చిగుళ్ల వ్యాధులకు దారి తీస్తుంది, చివరికి ఎముకలు, దంతాల సమస్యలకు దారి తీస్తుంది.

(4 / 7)

పొగాకు వాడకం చిగుళ్ల వ్యాధులకు దారి తీస్తుంది, చివరికి ఎముకలు, దంతాల సమస్యలకు దారి తీస్తుంది.(Shutterstock)

ధూమపానం చేసే మహిళలకు కంటిశుక్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

(5 / 7)

ధూమపానం చేసే మహిళలకు కంటిశుక్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.(Unsplash)

సిగరెట్స్ తాగటం, పొగాకు నమలటం, మద్యం సేవించే అలవాట్లు ఉన్న స్త్రీలు గర్భం దాల్చడంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. లేదా ఇలాంటి వారిలో గర్భస్రావం అవటం, నెలలు నిండకుండానే ప్రసవాలు జరగటం అలాగే తక్కువ బరువున్న పిల్లలు పుట్టం ఎక్కువగా జరుగుతున్నాయి.

(6 / 7)

సిగరెట్స్ తాగటం, పొగాకు నమలటం, మద్యం సేవించే అలవాట్లు ఉన్న స్త్రీలు గర్భం దాల్చడంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. లేదా ఇలాంటి వారిలో గర్భస్రావం అవటం, నెలలు నిండకుండానే ప్రసవాలు జరగటం అలాగే తక్కువ బరువున్న పిల్లలు పుట్టం ఎక్కువగా జరుగుతున్నాయి.(Pixabay)

ధూమపానం చేసే స్త్రీలు చిన్న వయస్సులోనే మెనోపాజ్ స్థితికి చేరుకుంటారు. ఆల్కహాల్ తీసుకోవడం కారణంగా రాత్రి చెమట పట్టడం, రుతుక్రమం అధ్వాన్నంగా మారటం లాంటి లక్షణాలను కలిగి ఉంటున్నారు.

(7 / 7)

ధూమపానం చేసే స్త్రీలు చిన్న వయస్సులోనే మెనోపాజ్ స్థితికి చేరుకుంటారు. ఆల్కహాల్ తీసుకోవడం కారణంగా రాత్రి చెమట పట్టడం, రుతుక్రమం అధ్వాన్నంగా మారటం లాంటి లక్షణాలను కలిగి ఉంటున్నారు.(Shutterstock)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు