Black Coffee Benefits : ప్రీ-వర్కౌట్ సప్లిమెంట్‌గా బ్లాక్ కాఫీ తీసుకుంటే చాలా మంచిదట.. ఎందుకంటే..
Black Coffee Benefits : ఉదయాన్నే కాఫీ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. అయితే వర్కౌట్‌కి వెళ్లే ముందు.. బ్లాక్ కాఫీ తీసుకోవాలి అంటున్నారు వ్యాయామ నిపుణులు. దానివల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు అంటున్నారు. ఇంతకీ ఆ బెనిఫిట్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
Black Coffee Benefits : వర్కవుట్ చేయడానికి ముందు సరైన మొత్తంలో బ్లాక్ కాఫీని తీసుకుంటే.. అది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. నిజం చెప్పాలంటే.. ఈ రోజుల్లో బ్లాక్ కాఫీ అనేది వర్కవుట్ చేసే వారికి.. ఒక ప్రసిద్ధ ప్రీ-వర్కౌట్ సప్లిమెంట్‌గా మారిపోయింది. చాలా మంది తమ ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి విశ్రాంతి తీసుకోవడానికి లేదా వారి శక్తి స్థాయిలను పెంచుకోవడానికి ఉదయాన్నే కాఫీని తీసుకుంటారు.
బ్లాక్ కాఫీ వినియోగం అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ సరైన మొత్తంలోనే దానిని తీసుకోవాలి. అలా తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించడంలో కాఫీ ప్రభావవంతంగా పనిచేస్తుంది అంటున్నారు నిపుణులు. కాఫీ ఎక్కువగా తీసుకుంటే.. అది శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావాల్ని చూపిస్తుంది. ఇంతకీ వ్యాయామానికి ముందు కాఫీ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
వ్యాయామానికి ముందు కాఫీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలివే..
కొవ్వును కరిగిస్తుంది..
కాఫీ కొవ్వును కరిగించడంలో, శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. కాఫీలో కెఫీన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది వ్యాయామ సమయంలో కొవ్వును కరిగించడంతో పాటు.. వర్కవుట్‌ల సమయంలో మీ శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఉదయం కాఫీ తీసుకోవడం వల్ల ఆకలి తగ్గుతుంది. ఇది బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.
జీవక్రియను పెంచుతుంది..
కాఫీ మెరుగైన జీవక్రియను అందిస్తుంది. కాఫీ వినియోగం శరీర కొవ్వును కాల్చడానికి అవసరమైన జీవక్రియ రేటును పెంచుతుంది. కాఫీలో ఉండే కెఫిన్ ద్వారా శరీరం ప్రతిస్పందిస్తుంది. అయితే మీరు కాఫీ పరిమాణంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎందుకంటే అజాగ్రత్తగా కాఫీ తీసుకోవడం, ఎక్కువగా కాఫీ తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది.
మెరుగైన పనితీరు..
కాఫీ అథ్లెటిక్ పనితీరును మెరుగుపరుస్తుంది. వర్కవుట్ చేయడానికి ముందు సరైన మొత్తంలో కాఫీని తీసుకోవడం అంటే అందులో ఉండే కెఫిన్ అథ్లెటిక్ పనితీరును బాగా ప్రోత్సహిస్తుంది. శక్తిని పెంచడంతో పాటు, శరీరాన్ని ఎక్కువసేపు అలసిపోనివ్వదు. అందుకే వ్యాయామానికి ముందు కాఫీ తాగడం మంచిది.
కండరాల నొప్పి నుంచి ఉపశమనం
వ్యాయామానికి ముందు కాఫీ తీసుకోవడం వల్ల వ్యాయామం తర్వాత కండరాల నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. తీవ్రమైన వ్యాయామం తర్వాత లాక్టిక్ ఆమ్లం శరీరంలో విడుదల అవుతుంది. ఇది కాఫీ ద్వారా తగ్గుతుంది.
(ఈ కంటెంట్ సాధారణ సమాచారాన్ని మాత్రమే అందిస్తుంది. మరింత సమాచారం కోసం మీ వైద్యుడిని సంప్రదించండి. వారి సూచనలతో బ్లాక్ కాఫీని మీ డైట్లో చేర్చుకోండి.)
సంబంధిత కథనం