Cumin Water Benefits : ఉదయాన్నే ఖాళీ కడుపుతో జీరా నీళ్లు తాగితే.. ఆరోగ్య ప్రయోజనాలు మీవే..-drinking cumin water with empty stomach daily for good health ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Cumin Water Benefits : ఉదయాన్నే ఖాళీ కడుపుతో జీరా నీళ్లు తాగితే.. ఆరోగ్య ప్రయోజనాలు మీవే..

Cumin Water Benefits : ఉదయాన్నే ఖాళీ కడుపుతో జీరా నీళ్లు తాగితే.. ఆరోగ్య ప్రయోజనాలు మీవే..

Geddam Vijaya Madhuri HT Telugu
Nov 12, 2022 12:36 PM IST

Cumin Water Benefits : జీరాలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. దానిలో ఔషద గుణాలు మిమ్మల్ని చలికాలంలోనే కాదు.. ఏ కాలంలోనైనా మిమ్మల్ని అనేక వ్యాధుల నుంచి కాపాడతాయి. అయితే జీలకర్రను నేరుగా కాకుండా.. నీళ్లతో కలిపి తీసుకుంటే.. వాటి ప్రయోజనాలు మీరు నేరుగా పొందవచ్చు.

జీలకర్ర ప్రయోజనాలు
జీలకర్ర ప్రయోజనాలు

Cumin Water Benefits : నేటి బిజీ, చురుకైన జీవితంలో.. చాలా మంది వ్యక్తులు తమకోసం తాము సమయాన్ని కేటాయించుకోలేకపోతున్నారు. దీని కారణంగా మన శరీరం చిన్న వయస్సులోనే.. మనకు మద్దతు ఇవ్వడం మానేస్తుంది. కొన్నిసార్లు మనం పూర్తిగా మెడిసన్ మీద ఆధారపడతాము. మందుల మీద ఎక్కువగా ఆధారపడటం హానికరం.

కానీ మీ వంటగదిలోని చాలా పదార్థాలు.. మిమ్మల్ని అనేక వ్యాధుల నుంచి రక్షించగలవు. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది జీలకర్ర (జీర) గురించి. మన శరీరాన్నీ ఆరోగ్యంగా ఉంచడంలో జీలకర్ర మంచిగా సహాయపడుతుంది. దానిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. మీరు రోజూ ఖాళీ కడుపుతో జీలకర్ర నీటిని తాగడం ప్రారంభిస్తే.. మీరు అనేక వ్యాధుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు.

గర్భధారణ సమయంలో మెరుగైన జీర్ణక్రియకై..

మీరు గర్భధారణ సమయంలో జీలకర్ర నీటిని తాగడం ప్రారంభిస్తే.. మీ జీర్ణవ్యవస్థ చాలా బలంగా మారుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ దశలో జీలకర్ర నీటిని తాగడం కార్బోహైడ్రేట్లు, కొవ్వుల జీర్ణక్రియకు అవసరమైన ఎంజైమ్‌లకు ఉద్దీపనగా పనిచేస్తుంది.

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికై..

జీలకర్రలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మీరు ప్రతిరోజూ జీలకర్ర నీటిని తాగడం ప్రారంభిస్తే.. మీ రోగనిరోధక శక్తి చాలా బలంగా మారుతుంది. అనేక వ్యాధులతో పోరాడటం ద్వారా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు.

మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తుంది

నిపుణుల అభిప్రాయం ప్రకారం… మధుమేహ వ్యాధిగ్రస్తులకు జీలకర్ర నీరు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అటువంటి రోగులు రోజూ ఖాళీ కడుపుతో జీలకర్ర నీటిని తాగితే.. వారి రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. జీలకర్ర శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. దీని కారణంగా రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది.

రక్తపోటును నియంత్రణ

జీలకర్ర నీటిలో చాలా పొటాషియం లభిస్తుంది. మీరు ప్రతిరోజూ జీలకర్ర నీటిని తాగడం ప్రారంభిస్తే.. మీ రక్తపోటు ఎల్లప్పుడూ అదుపులో ఉంటుంది.

శ్వాసకోశ వ్యవస్థకు సహాయం

జీలకర్ర నీరు శ్వాసకోశ వ్యవస్థను బాగా ప్రభావితం చేస్తుంది. మీకు శ్వాస సంబంధిత సమస్య ఏదైనా ఉంటే.. ఉదయాన్నే 1 గ్లాసు జీలకర్ర నీటిని తాగితే ఉపశమనం లభిస్తుంది.

Whats_app_banner

సంబంధిత కథనం