(1 / 7)
రోగనిరోధక శక్తి పెరగాలంటే మన శరీరానికి రోజూవారీగా కొంత మోతాదులో విటమిన్-సి అవసరమవుతుంది. ఒక మనిషికి రోజులో 65-90 మిల్లీగ్రాముల విటమిన్-సి అవసరం. అందుకోసం మనం తినే ఆహారంలో అవసరమయ్యే పండ్లను, కూరగాయలను చేర్చుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తునారు. మరి వేటిలో విటమిన్-సి సమృద్ధిగా లభిస్తుందో చూద్దామా..
(Pixabay)(2 / 7)
Orange: నారింజ, నిమ్మ లాంటి సిట్రస్ జాతి పండ్లలో విటమిన్-సి అవసరమయ్యే మోతాదులో విటమిన్-సి లభిస్తుందని గుర్తింపు ఉంది. ఒక మీడియం సైజు నారింజ పండులో 70 mg విటమిన్- సి లభిస్తుంది. అలాగే ఒక నిమ్మపండులో 50 mg విటమిన్ సి లభిస్తుంది.
వీటితో పాటు ఉసిరి, జామ పండ్లలో కూడా కావాల్సినంత విటమిన్ సి లభిస్తుంది.
(Pixabay)(3 / 7)
స్ట్రాబెర్రీలలో కొలెస్ట్రాల్ ఉండదు. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం మూలానా ఇది తక్కువ కేలరీలు కలిగిన ఆహారంగా చెప్తారు. అంతేకాకుండా ఇందులో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. యాంటీఆక్సిడెంట్‌లు ఎక్కుగా ఉంటాయి. ఒక్క చిన్న గిన్నె పరిమాణంలో స్ట్రాబెర్రీలు తీసుకుంటే సుమారు 98 mg విటమిన్ సి శరీరానికి అందుతుంది.
(Pixabay)(4 / 7)
Kiwi: కివి పండ్లలో కూడా యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి సీజనల్ ఇన్ఫెక్షన్లను నివారించేలా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. డెంగీ జ్వరం వచ్చినపుడు వీటిని తినమని డాక్టర్లు సూచిస్తారు. ఒక కివి పండు తినడం ద్వారా సుమారు 60 mg విటమిన్- సి లభిస్తుంది.
(Pixabay)(5 / 7)
Broccoli: కేవలం పండ్లనే కాకుండా బ్రోకలీ, కాలీఫ్లవర్, మొలకలను కూడా న్యూట్రిషనిస్టులు సిఫార్సు చేస్తున్నారు. వీటిలో కూడా విటమిన్- సి సమృద్ధిగా లభిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుకోడానికి మీ ఆహారంలో వీటిని చేర్చుకోండి.
(Pixabay)(6 / 7)
Green chilly: కూరల్లో కారం పొడికి బదులుగా పచ్చిమిర్చి వాడండి. పిచ్చి మిరపకాయల్లో విటమిన్ సితో పాటు ఐరన్ అధికంగా ఉంటుంది. 1 పచ్చి మిరపకాయలో 109 mg విటమిన్ సి ఉంటుంది. పచ్చిమిరపకాయలు తినేవారి చర్మంలో నిగారింపు పెరుగుతుందని చెబుతున్నారు.
(Pixabay)సంబంధిత కథనం
ఇతర గ్యాలరీలు