Water-based Exercises | నీళ్లలో వ్యాయామం చేస్తే.. కీళ్ల నొప్పులు మాయం అవుతాయి!-do these water based exercises to relieve joint pain ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Do These Water-based Exercises To Relieve Joint Pain

Water-based Exercises | నీళ్లలో వ్యాయామం చేస్తే.. కీళ్ల నొప్పులు మాయం అవుతాయి!

Jun 12, 2022, 09:58 AM IST HT Telugu Desk
Jun 12, 2022, 09:58 AM , IST

  • నీటిలో చేసే వ్యాయామాలు కూడా ఉంటాయి. ఈ రకమైన వ్యాయామాలు కీళ్ల నొప్పులను తగ్గించడంలో, ఆర్థరైటిస్‌ను నివారించడంలో తోడ్పడతాయి. ఇలా నీటి వ్యాయామాలతో ఒళ్లు నొప్పులు తగ్గించడాన్ని హైడ్రోథెరపీ అంటారు. అలాంటి కొన్ని వ్యాయామ పద్ధతులను ఇక్కడ తెలుసుకోండి.

రుమటాయిడ్ ఆర్థరైటిస్ కారణంగా కీళ్లలో నొప్పి, వాపు ఏర్పడుతుంది. ఈ వ్యాధి కారణంగా చేతులు, మణికట్టు, మోచేయి, మోకాలు, చీలమండలు ఎక్కువగా ప్రభావితమవుతాయి. వ్యాధి ముదిరే కొద్దీ కీళ్లలో వైకల్యాలు కూడా కలగవచ్చు. సరైన ఆహారం, వ్యాయామంతో ఆర్థరైటిస్‌ను ఎదుర్కోవాలి. ఆర్థరైటిస్ రోగులకు నీటి ఆధారిత వ్యాయామాలు లేదా హైడ్రోథెరపీ చాలా ప్రయోజనకరంగా ఉంటాయి, అవి కీళ్లపై ఒత్తిడిని తగ్గిస్తాయి. సాధారణ వ్యాయామ అనంతర నొప్పులూ ఉండవు. క్లౌడ్‌నైన్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్, చెన్నైలో ఎగ్జిక్యూటివ్ ఫిజియోథెరపిస్ట్ అయిన ప్రజ్ఞ రవిచంద్రన్ కొన్ని సులభమైన నీటి వ్యాయామాలను సూచించారు.

(1 / 7)

రుమటాయిడ్ ఆర్థరైటిస్ కారణంగా కీళ్లలో నొప్పి, వాపు ఏర్పడుతుంది. ఈ వ్యాధి కారణంగా చేతులు, మణికట్టు, మోచేయి, మోకాలు, చీలమండలు ఎక్కువగా ప్రభావితమవుతాయి. వ్యాధి ముదిరే కొద్దీ కీళ్లలో వైకల్యాలు కూడా కలగవచ్చు. సరైన ఆహారం, వ్యాయామంతో ఆర్థరైటిస్‌ను ఎదుర్కోవాలి. ఆర్థరైటిస్ రోగులకు నీటి ఆధారిత వ్యాయామాలు లేదా హైడ్రోథెరపీ చాలా ప్రయోజనకరంగా ఉంటాయి, అవి కీళ్లపై ఒత్తిడిని తగ్గిస్తాయి. సాధారణ వ్యాయామ అనంతర నొప్పులూ ఉండవు. క్లౌడ్‌నైన్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్, చెన్నైలో ఎగ్జిక్యూటివ్ ఫిజియోథెరపిస్ట్ అయిన ప్రజ్ఞ రవిచంద్రన్ కొన్ని సులభమైన నీటి వ్యాయామాలను సూచించారు.(Pinterest)

నీటిలో నడవడం లేదా జాగింగ్ చేయడం చేయాలి. కనీసం మీ నడుము స్థాయి వరకు లేదా దాని పైన కొన్ని అంగుళాల వరకు ఉన్న నీటిలో నిలబడండి. కొన్ని అడుగులు ముందుకు అలాగే కొన్ని అడుగులు వెనుకకు నడవండి లేదా జాగ్ చేయండి. మీ రెసిస్టెన్స్ పెంచడం కోసం నీటిలో మీ నడక వేగాన్ని పెంచండి. మధ్యలో 5 నిమిషాల పాటు విరామాలు తీసుకుంటూ ఈ వ్యాయామాన్ని కొనసాగించాలి.

(2 / 7)

నీటిలో నడవడం లేదా జాగింగ్ చేయడం చేయాలి. కనీసం మీ నడుము స్థాయి వరకు లేదా దాని పైన కొన్ని అంగుళాల వరకు ఉన్న నీటిలో నిలబడండి. కొన్ని అడుగులు ముందుకు అలాగే కొన్ని అడుగులు వెనుకకు నడవండి లేదా జాగ్ చేయండి. మీ రెసిస్టెన్స్ పెంచడం కోసం నీటిలో మీ నడక వేగాన్ని పెంచండి. మధ్యలో 5 నిమిషాల పాటు విరామాలు తీసుకుంటూ ఈ వ్యాయామాన్ని కొనసాగించాలి.(Pinterest)

ఫార్వర్డ్ లాంజ్ చేయాలి. నీటిలో ఒక కాలును వీలైనంత వరకు ముందుకు తీసుకెళ్లండి, మరొక పాదం ఎటువంటి లిఫ్ట్‌లు లేకుండా నేలపై ఉండేలా చూసుకోండి. ఇలా నెమ్మదిగా ముందుకు వెనుకకు కాలును కదపండి. ఇలా కనీసం 10 సార్లు చేయాలి. ఆపై కాలును మార్చి మరో వైపు ఇలాగే చేయాలి.

(3 / 7)

ఫార్వర్డ్ లాంజ్ చేయాలి. నీటిలో ఒక కాలును వీలైనంత వరకు ముందుకు తీసుకెళ్లండి, మరొక పాదం ఎటువంటి లిఫ్ట్‌లు లేకుండా నేలపై ఉండేలా చూసుకోండి. ఇలా నెమ్మదిగా ముందుకు వెనుకకు కాలును కదపండి. ఇలా కనీసం 10 సార్లు చేయాలి. ఆపై కాలును మార్చి మరో వైపు ఇలాగే చేయాలి.(Pinterest)

హిప్ అబ్డక్టర్ లేదా సైడ్ కిక్ రైజ్ చేయడం. పూల్ ఒక మూలలో పట్టుకోండి. మోకాలిని నిటారుగా ఉంచుతూ ఛాతీ వంచకుండా సైడ్‌కిక్‌లను ఇవ్వండి. ఇలా నీటిలో సైడ్ కిక్స్ కుడి వైపు 10 సార్లు, ఎడమవైపు 10 సార్లు చేయాలి.

(4 / 7)

హిప్ అబ్డక్టర్ లేదా సైడ్ కిక్ రైజ్ చేయడం. పూల్ ఒక మూలలో పట్టుకోండి. మోకాలిని నిటారుగా ఉంచుతూ ఛాతీ వంచకుండా సైడ్‌కిక్‌లను ఇవ్వండి. ఇలా నీటిలో సైడ్ కిక్స్ కుడి వైపు 10 సార్లు, ఎడమవైపు 10 సార్లు చేయాలి.(Pinterest)

మోకాలిని పైకెత్తుతూ నడవండి అంటే ఇది మార్చ్ పాస్ట్ చేయడం లాంటిది. నీళ్లలో ఒక మోకాళ్లు పెకెత్తుతూ, దించుతూ 5 నిమిషాలు మార్చ్ పాస్ట్ చేయండి.

(5 / 7)

మోకాలిని పైకెత్తుతూ నడవండి అంటే ఇది మార్చ్ పాస్ట్ చేయడం లాంటిది. నీళ్లలో ఒక మోకాళ్లు పెకెత్తుతూ, దించుతూ 5 నిమిషాలు మార్చ్ పాస్ట్ చేయండి.(Pinterest)

ఇది వరకు ముందుకు చేసిన మార్చ్ పాస్టును ఎప్పుడు అదే తరహాలో వెనకకు 5 నిమిషాలు చేయండి.

(6 / 7)

ఇది వరకు ముందుకు చేసిన మార్చ్ పాస్టును ఎప్పుడు అదే తరహాలో వెనకకు 5 నిమిషాలు చేయండి.(Pinterest)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు