Summer and Spices : వేసవిలో ఎక్కువగా తినకూడని మసాలాలు ఇవే.. జాగ్రత్త-summer health care tips 5 spices should avoid during summer season ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Summer And Spices : వేసవిలో ఎక్కువగా తినకూడని మసాలాలు ఇవే.. జాగ్రత్త

Summer and Spices : వేసవిలో ఎక్కువగా తినకూడని మసాలాలు ఇవే.. జాగ్రత్త

Anand Sai HT Telugu
Apr 01, 2024 05:31 PM IST

Summer and Spices : వేసవిలో మనం తీసుకునే ఆహారాలు మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. వేసవిలో మసాలాలు తినడం తగ్గిస్తే చాలా మంచిది.

వేసవిలో తినకూడని మసాలాలు
వేసవిలో తినకూడని మసాలాలు (Unsplash)

కొందరికి మసాలాలు లేకుండా తినాలంటే అస్సలు నచ్చదు. మసాలా ఉంటేనే ముద్ద దిగుతుంది. కానీ వేసవి కాలంలో మసాలాలు ఎక్కువగా తింటే మీ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. సుగంధ ద్రవ్యాలు లేకుండా భోజనం పూర్తి కాదు అని వేసవిలో అనుకోవద్దు.

సుగంధ ద్రవ్యాలు ఆహారానికి రుచి, ఆకృతిని జోడిస్తాయి. ఇవి సాధారణ ఆహారాన్ని మంచి రుచి కలిగిన ఆహారంగా మార్చగలవు. సుగంధ ద్రవ్యాలు రుచిని మాత్రమే కాకుండా కొన్ని ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. అయితే వేసవిలో నివారించాల్సిన కొన్ని మసాలాలు ఉన్నాయని మీకు తెలుసా? సుగంధ ద్రవ్యాలు సాధారణంగా వేడిగా ఉంటాయి. అవి శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తాయి.

భారతదేశంలోని చాలా ప్రాంతాలలో వేసవికాలం చాలా దారుణంగా ఉంటుంది. వేడి వాతావరణం వల్ల చాలా మంది ఆకలి లేకపోవడం, అజీర్ణం, డీహైడ్రేషన్, చిరాకు, అలసట, చెమటతో బాధపడుతున్నారు. వేసవి వేడి మీ శక్తి స్థాయిలను తగ్గిస్తుంది. మీ ఆహారంలో కొన్ని మసాలా దినుసులు జోడించడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. వేసవి కాలంలో ఏ మసాలాలు తినడం తగ్గించాలో తెలుసుకుందాం..

కారం పొడి తగ్గించాలి

కారం పొడి మన ఆహారానికి మసాలాగా, రంగును జోడించడానికి ఉపయోగిస్తారు. కానీ దానిని ఎక్కువగా జోడించడం మీ శరీరానికి హానికరం. మిరపకాయ వంటి వేడి, కారంగా ఉండే ఆహారాలు శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి. ఇది కడుపు, ఛాతీలో మంట, అధిక చెమట, చికాకు కలిగిస్తుంది. వేసవిలో అధిక కారంతో కూడిన ఆహారాన్ని నివారించడం లేదా మితంగా తీసుకోవడం మంచిది.

అల్లం మితంగా తీసుకోవాలి

ఆహారానికి గొప్ప రుచిని జోడించడానికి అల్లం ఒక గొప్ప పదార్థం. ఇది మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. దాని యాంటీమైక్రోబయల్ లక్షణాలు రోగనిరోధక వ్యవస్థను బలంగా ఉంచడంలో సహాయపడతాయి. అల్లం వేడి మసాలా, ఇది శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. చెమటను కలిగిస్తుంది. మధుమేహం, రక్తస్రావం సమస్య ఉన్నవారు వేసవిలో అల్లం తినకుండా ఉండాలి.

వెల్లుల్లి

వెల్లుల్లి బరువు తగ్గడానికి, ఆకలిని అణిచివేసేందుకు, జీవక్రియను పెంచడానికి ఉపయోగించబడుతుంది. కానీ వేసవిలో దీనిని మితంగా తీసుకోవాలి. వెల్లుల్లి వల్ల శీతాకాలంలో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కానీ వేసవిలో దీన్ని తినడం మంచిది కాదు. ఎందుకంటే ఇది శరీరంలో వేడిని సృష్టిస్తుంది. ఇది నోటి దుర్వాసన, యాసిడ్ రిఫ్లక్స్, రక్తస్రావం ప్రమాదాన్ని పెంచుతుంది.

మిరియాలతో వేడి

మిరియాలు వేడి మసాలా. ఇది జీవక్రియ రేటును గణనీయంగా పెంచుతుంది. వేసవిలో దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. నల్ల మిరియాలు మీ శరీరానికి హాని కలిగించే కొన్ని మందుల ప్రభావాన్ని కూడా తగ్గిస్తాయి. ఔషధాలతో పరస్పర చర్య కారణంగా ఇది అలెర్జీలకు దారి తీస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని బలపరిచే మసాలా. జీవక్రియ రేటును పెంచుతుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. కానీ వేసవిలో మితంగా తీసుకోవాలి. లేకుంటే అధిక చెమటతోపాటుగా ఇతర సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది.

గరం మసాలా తినొద్దు

కొంతమంది గరం మసాలా లేనిది వెజ్ కర్రీ కూడా తయారు చేయరు. కానీ ఈ గరం మసాలా కూడా వేసవిలో తగ్గించుకోవాలి. లేదంటే మీ ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. గరం మసాలాలో జాపత్రి, లవంగాలు, బిర్యానీ ఆకులు, సోంపులాంటివి కూడా వేస్తారు. ఇది శరీరంలో చెమట ఎక్కువగా వచ్చేలా చేస్తుంది.

Whats_app_banner