Seeds Benefits : శరీరంలో వేడిని తగ్గించే సీడ్స్.. కచ్చితంగా ఆహారంలో చేర్చుకోవాలి-seeds to beat the heat in body of this summer naturally ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Seeds Benefits : శరీరంలో వేడిని తగ్గించే సీడ్స్.. కచ్చితంగా ఆహారంలో చేర్చుకోవాలి

Seeds Benefits : శరీరంలో వేడిని తగ్గించే సీడ్స్.. కచ్చితంగా ఆహారంలో చేర్చుకోవాలి

Anand Sai HT Telugu
Feb 12, 2024 02:00 PM IST

Seeds For Body Heat : కొన్ని రకాల విత్తనాలు మన శరీరంలో వేడిని తగ్గిస్తాయి. వేసవిలో వాటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వలన వేడి అవ్వకుండా చూసుకోవచ్చు.

వేడి తగ్గించే గింజలు
వేడి తగ్గించే గింజలు (Unsplash)

ఈ ఏడాది ఎండలు బాగా ఉండేలా ఉన్నాయి. ఫిబ్రవరిలోనే దంచికొడుతున్నాయి. బయటకు వెళ్లాలంటే వేడి మాములుగా ఉండటం లేదు. ఎండాకాలం వస్తే శరీరంలో కూడా చాలా మార్పులు వస్తాయి. కొందరికి వేడి అవుతుంది. దీంతో చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. వేసవిలో మంచి ఆహారం తినాలి. శరీరంలో నీటిశాతం ఉండేలా చూసుకోవాలి. బాడీని చల్లగా ఉంచే ఆహారపదార్థాలు తీసుకోవాలి. కొన్ని రకాల విత్తనాలు మీ శరీరాన్ని కూల్ చేస్తాయి. వాటి గురించి తెలుసుకుందాం..

చియా విత్తనాల ప్రయోజనాలు

చియా విత్తనాలు వేసవిలో చాలా మంచివి. ఎందుకంటే వాటిలో ఫైబర్ ఉంటుంది. జీర్ణక్రియకు చాలా సహాయపడుతుంది. చియా గింజలు శరీరంలో నీటి శాతాన్ని నిర్వహించడానికి సహాయపడతాయి. ఈ గింజలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. వేసవిలో చాలా మేలు చేస్తుంది, దీనిని జ్యూస్‌లో వేసి తాగితే శరీరం చల్లగా ఉంటుంది. వేసవిలో తప్పకుండా చియా విత్తనాలు తీసుకోవాలి.

జీలకర్రతో శరీరానికి చల్లదనం

జీలకర్ర శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. వేసవి వంటల్లో తప్పకుండా వాడుకోవాలి. ఇది శరీరంలో ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. వాపు సమస్యను నిరోధిస్తుంది. జీలకర్రలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. జీర్ణక్రియకు చాలా మేలు చేస్తుంది. ఉబ్బరం, పొత్తికడుపు తిమ్మిరి వంటి సాధారణ వేసవి సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. 1 టేబుల్ స్పూన్ జీలకర్రను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తాగాలి.

ఫ్లాక్స్ సీడ్స్ ఉపయోగాలు

ఫ్లాక్స్ సీడ్స్ ఇది చాలా మంచిది. ముఖ్యంగా శాకాహారులు దీనిని తప్పకుండా తీసుకుంటారు. ఒమేగా 3 కొవ్వుల లోపం రాకుండా ఉంటుంది. ఇది జుట్టు, చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది. శరీరంలోని మలినాలను తొలగించి శరీర ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఫ్లాక్స్ సీడ్స్ గుండె ఆరోగ్యానికి కూడా మంచిది.

సోంపుతో ఎన్నో ప్రయోజనాలు

సోంపు శరీరాన్ని చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది. భోజనం చేసిన తర్వాత కాస్త సోంపును నోటిలో వేసుకుంటే జీర్ణక్రియకు చాలా మంచిది. అలాగే శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం కోసం నీటిలో వేసి మరిగించి తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. సోంపుతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

వేసవిలో గసగసాలు

గసగసాలు వేసవిలో తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఇది శరీరం నుండి అధిక వేడిని తొలగిస్తుంది. ఆయుర్వేదం, ఇంటి నివారణలలో ఉపయోగించబడుతుంది. గసగసాలలో ఆల్కలాయిడ్స్ ఉన్నాయి. అధిక శరీర ఉష్ణోగ్రతను తొలగిస్తుంది. కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం కలిగి ఉంటుంది. మీరు దీన్ని స్మూతీస్, సలాడ్స్, డెజర్ట్‌లలో కూడా ఉపయోగించవచ్చు.

ధనియాలతో అద్భుతాలు

ధనియాల గింజలు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. బెల్లంతో ఈ గింజలు కలిపి తాగడం చాలా మంచిది. ఇది శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. వేసవిలో దీన్ని ఎక్కువగా వాడండి. ధనియాలు ఆరోగ్యానికి చాలా మంచిది.

మెంతి గింజల్లో ఔషధ గుణాలు

మెంతి గింజ శరీరాన్ని చల్లబరుస్తుంది. అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఇది తీవ్రమైన వేడిలో వాడితే శరీరానికి చాలా మంచి జరుగుతుంది. మెంతులను రాత్రి నానబెట్టి ఉదయాన్నే తాగడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది. మెంతను వంటలో వాడండి. ఈ మెంతి గింజల వినియోగం ఉష్ణోగ్రత కారణంగా కడుపు నొప్పిని తగ్గిస్తుంది. మూత్ర నాళాల ఇన్ఫెక్షన్‌ను నివారించడంలో సహాయపడుతుంది. వేసవిలో శరీర వేడిని తగ్గించడంలో ఇది ఎంతగానో సాయపడుతుంది.