Raju gari Kodi Pulao: రాజుగారి కోడి పులావ్ ఇలా చేశారంటే బిర్యానీకి మించిన రుచి, రెసిపీ ఎలాగో తెలుసుకోండి
Rajugari Kodi Pulao: నాన్ వెజ్ ప్రియులకు నచ్చే వంటకం రాజుగారి కోడిపులావ్. దీన్ని తింటే బిర్యానీని కూడా మర్చిపోతారు. రెసిపీ చాలా సులువు.
Rajugari Kodi Pulao: రాజు గారి కోడిపులావును రాజుల వంటకంగా చెప్పుకుంటారు. దీన్ని చేయడం చాలా సులువు. ఈ పులావ్ తిన్నాక దమ్ బిర్యాని కూడా మర్చిపోతారు. అంత రుచిగా ఉంటుంది ఈ రాజుగారి కోడిపులావ్. దీన్ని ప్రత్యేకంగా కొన్ని రెస్టారెంట్లలో వండుతారు. దీన్ని చూస్తేనే నోరూరు పోతుంది. ఈ కోడిపులావ్ కోసం రెస్టారెంట్లకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే చాలా సులువుగా వండేసుకోవచ్చు ఇలా చేయాలో ఇప్పుడు తెలుసుకోండి.
రాజు గారి కోడిపులావ్ రెసిపీకి కావలసిన పదార్థాలు
బాస్మతి బియ్యం - రెండు కప్పులు
చికెన్ - అరకిలో
జీడిపప్పులు - 10
ఉల్లిపాయ - 1
నిమ్మరసం - అర స్పూను
నూనె - తగినంత
నెయ్యి - మూడు స్పూన్లు
పెరుగు - పావు కప్పు
యాలకులు - రెండు
లవంగాలు - మూడు
దాల్చిన చెక్క - చిన్న ముక్క
అనాసపువ్వు - చిన్న ముక్క
షాజీరా - అర స్పూను
బిర్యానీ ఆకు - రెండు
జాపత్రి - చిన్న ముక్క
కరివేపాకులు - గుప్పెడు
పచ్చిమిర్చి - ఐదు
పచ్చిమిరపకాయ పేస్ట్ - ఒక స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్టు - అర స్పూను
టమోటో - ఒకటి
పుదీనా ఆకులు - అరకప్పు
కొత్తిమీర తరుగు - అర కప్పు
ఉప్పు - రుచికి సరిపడా
నీరు - సరిపడినంత
గరం మసాలా పొడి - ఒక స్పూను
రాజుగారి కోడి పులావ్ రెసిపీ
1. చికెన్ శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. బాస్మతి బియ్యాన్ని పావుగంట పాటు నానబెట్టుకోవాలి.
2. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి మూడు స్పూన్ల నెయ్యి, రెండు స్పూన్ల నూనె వేయాలి.
3. అందులో జీడిపప్పులను దోరగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
4. అదే కుక్కర్లో నిలువుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించి బంగారు రంగు వచ్చేవరకు ఉంచాలి.
5. ఆ తర్వాత వాటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి.
6. ఇప్పుడు మిక్సీలో వేయించిన ఉల్లిపాయలు, పెరుగు, జీడిపప్పులు వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
7. చికెన్‌ను ఒక గిన్నెలో వేసి ఉప్పు, నిమ్మరసం, గరం మసాలా, పచ్చిమిర్చి, ఉల్లి పెరుగు కలిపి చేసిన పేస్టును వేసి బాగా కలపాలి.
8. ఒక పావుగంట పాటు అలా వదిలేస్తే మ్యారినేట్ అవుతుంది.
9. ఇప్పుడు ముందుగా స్టవ్ మీద పెట్టుకున్న కుక్కర్లో నూనె, నెయ్యి ఇంకా మిగిలే ఉంటుంది.
10. అందులో యాలకులు, లవంగాలు, షాజీరా, దాల్చిన చెక్క, అనాసపువ్వు, జాపత్రి, బిర్యాని ఆకు వేసి వేయించుకోవాలి.
11. అందులోనే ఉల్లిపాయల తరుగు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, పచ్చిమిర్చి పేస్టు, కరివేపాకులు వేసి వేయించుకోవాలి.
12. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేయించాలి.
13. తర్వాత నిలువుగా తరిగిన పుదీనా ఆకులు, కొత్తిమీర తరుగు వేసి బాగా వేయించుకోవాలి.
14. ఇవన్నీ వేగాక ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ ను వేసి బాగా కలుపుకోవాలి.
15. దీన్ని చిన్నమంట మీద ఉడికించుకోవాలి.
16. అందులో గరం మసాలా పొడి, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి బాగా కలుపుకోవాలి.
17. బియ్యం ఉడకడానికి సరిపడా నీటిని కూడా వేయాలి. ముందుగా నానపెట్టుకున్న బియ్యాన్ని అందులో వేసి బాగా కలుపుకోవాలి.
18. పైన ఒక స్పూన్ నెయ్యిని వేయాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మీద మూత పెట్టి విజిల్ పెట్టి మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి.
19. తర్వాత స్టవ్ కట్టేయాలి. కుక్కర్ ఆవిరి పోయాక మూత తీయాలి.
20. టేస్టీ రాజుగారి కోడి పులావ్ ఘుమఘుమలాడుతూ రెడీగా ఉంటుంది. దీన్ని చికెన్ కర్రీతో తింటే రుచి అదిరిపోతుంది.
రాజుగారి కోడిపులావును ఒక్కసారి వండుకొని చూడండి. మీకు చాలా నచ్చుతుంది. దీన్ని చికెన్ కర్రీతో జతగా తింటే రుచి అదిరిపోతుంది. దమ్ బిర్యానితో పోలిస్తే ఈ కోడిపులావ్ చికెన్ బిర్యాని ఇంకా అదిరిపోతుంది.
టాపిక్