Green Dosa: కొత్తిమీర, పుదీనాతో గ్రీన్ దోశ చేశారంటే ఎంతో హెల్తీ, రెసిపీ ఇదిగో-green dosa recipe with kothimeera in telugu know how to make this breakfast ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Green Dosa: కొత్తిమీర, పుదీనాతో గ్రీన్ దోశ చేశారంటే ఎంతో హెల్తీ, రెసిపీ ఇదిగో

Green Dosa: కొత్తిమీర, పుదీనాతో గ్రీన్ దోశ చేశారంటే ఎంతో హెల్తీ, రెసిపీ ఇదిగో

Haritha Chappa HT Telugu
May 05, 2024 06:00 AM IST

Green Dosa: బ్రేక్ ఫాస్ట్‌లో హెల్తీగా ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలే తినాలి. ఒకసారి గ్రీన్ దోశ చేసుకుని తినండి. కొత్తిమీర, పుదీనా వేసి చేసే ఈ గ్రీన్ దోశ చాలా టేస్టీగా ఉంటుంది.

గ్రీన్ దోశ రెసిపీ
గ్రీన్ దోశ రెసిపీ

Green Dosa: గ్రీన్ దోశ అంటే పెసరట్టు అనుకోకండి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకులతో చేసే దోశ ఇది. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. హై బీపీతో బాధపడేవారు, డయాబెటిస్‌తో బాధపడేవారు కూడా ఈ దోశ తినవచ్చు. ఒకసారి దీన్ని చేసుకొని తిని చూడండి. ఇంటిల్లిపాదికి నచ్చుతుంది. దీన్ని చేయడం కూడా చాలా సులువు.

గ్రీన్ దోశ రెసిపీకి కావాల్సిన పదార్థాలు

కొత్తిమీర తరుగు - ఒక కప్పు

పుదీనా తరుగు - ఒక కప్పు

కరివేపాకులు తరుగు - అరకప్పు

బియ్యం - ఒక కప్పు

మినప్పప్పు - అర కప్పు

మెంతులు - ఒక స్పూన్

ఉల్లిపాయ - ఒకటి

జీలకర్ర - ఒక స్పూను

పచ్చిమిర్చి - నాలుగు

ఉప్పు - రుచికి సరిపడా

నూనె - తగినంత

గ్రీన్ దోశ రెసిపీ

1. బియ్యం, మినప్పప్పు, మెంతులు నాలుగైదు గంటల పాటు నానబెట్టుకోవాలి.

2. తర్వాత వాటిని గ్రైండర్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి.

3. ఆ మిశ్రమాన్ని తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి.

4. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, కరివేపాకులని మిక్సీ జార్లో వేసి మెత్తగా రుబ్బి... ఆ మిశ్రమాన్ని కూడా అందులో కలిపేయాలి.

5. రుచికి సరిపడా ఉప్పును వేసి బాగా కలపాలి.

6. పచ్చిమిర్చి, ఉల్లిపాయలను సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.

7. దోశ పిండిలో జీలకర్ర వేసి బాగా కలపాలి.

8. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి నూనె రాయాలి.

9. దానిపై దోశలా పోసుకోవాలి. పైన ఉల్లిపాయ, పచ్చిమిర్చి తరుగును చల్లుకోవాలి.

10. అంతే టేస్టీ గ్రీన్‌తో సహా రెడీ అయినట్టే.

11. కొత్తిమీర, పుదీనా, కరివేపాకులు అధికంగా వేసాము. కాబట్టి ఇది ఆకుపచ్చని రంగులో వస్తుంది. ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుంది.

గ్రీన్ దోశను కొబ్బరి చట్నీతో తింటే టేస్టీగా ఉంటుంది. పిల్లలకు ఇది బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ అని చెప్పవచ్చు. దీనిలో కొత్తిమీర, పుదీనా, కరివేపాకులు, బియ్యం, మినప్పప్పు వంటివి వేశాము. ఇవన్నీ ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలే. కాబట్టి ప్రతి ఒక్కరూ వీటిని తినవచ్చు. డయాబెటిస్, హైబీపీ వంటి రోగాలతో బాధపడుతున్న వారికి కూడా ఈ గ్రీన్ దోశ ఎంతో మేలు చేస్తుంది. ఎవరికైనా ఇది బాగా నచ్చుతుంది.

టాపిక్