Jowar Dosa: డయాబెటిక్ పేషెంట్ల కోసం జొన్న దోశ రెసిపీ, ఎంత తిన్నా మంచిదే-jowar dosa recipe in telugu know how to make this healthy recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Jowar Dosa: డయాబెటిక్ పేషెంట్ల కోసం జొన్న దోశ రెసిపీ, ఎంత తిన్నా మంచిదే

Jowar Dosa: డయాబెటిక్ పేషెంట్ల కోసం జొన్న దోశ రెసిపీ, ఎంత తిన్నా మంచిదే

Haritha Chappa HT Telugu
Apr 28, 2024 06:00 AM IST

Jowar Dosa: జొన్నలు ఆరోగ్యానికి మేలే చేస్తాయి. జొన్న పిండితో చేసే రెసిపీలు చాలా టేస్టీగా ఉంటాయి. డయాబెటిక్ పేషంట్ల కోసం ఇక్కడ జొన్న దోశ రెసిపీ ఇచ్చాను. ఒకసారి ప్రయత్నించండి.

జొన్న దోశ రెసిపీ
జొన్న దోశ రెసిపీ

Jowar Dosa: జొన్న పిండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ ఆధునిక కాలంలో జొన్న పిండితో చేసిన ఆహారాలు తినే వారి సంఖ్య తక్కువగా ఉంది. నిజానికి డయాబెటిస్ బారిన పడినవారు సాధారణ దోశల కంటే జొన్న పిండితో చేసిన దోశలు తినడం చాలా ముఖ్యం. ఈ జొన్న దోశలు క్రిస్పీగా రుచిగా ఉంటాయి. దీన్ని ఎప్పటికప్పుడు ఇన్‌స్టెంట్‌గా తయారు చేసుకోవచ్చు. ఈ జొన్న దోశలకు వేయడానికి పట్టే సమయం కూడా చాలా తక్కువ. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. జొన్న దోశలు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

జొన్న దోశ రెసిపీకి కావలసిన పదార్థాలు

జొన్న పిండి - అరకప్పు

జీలకర్ర - అర స్పూను

బియ్యప్పిండి - పావు కప్పు

కరివేపాకులు - గుప్పెడు

పచ్చిమిర్చి - రెండు

కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు

ఉల్లిపాయ - ఒకటి

ఉప్పు - రుచికి సరిపడా

నీళ్లు - తగినన్ని

జొన్న దోశ రెసిపీ

1. సాధారణ దోశల్లాగే జొన్న దోశలు క్రిస్పీగా వేసుకోవచ్చు.

2. ముందుగా ఒక గిన్నెలో జొన్న పిండిని తీసుకోవాలి.

3. ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. అందులోనే బియ్యప్పిండిని కూడా వేసి బాగా కలపాలి.

4. ఇప్పుడు నీళ్లు పోసుకుని పిండి దోశలు వేయడానికి సరిపడా పలుచగా అయ్యేటట్టు చేసుకోవాలి. ఉండలు లేకుండా చూసుకోవాలి.

5. ఆ మిశ్రమంలోనే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన కొత్తిమీర, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర, కరివేపాకు తరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఒక పది నిమిషాలు పక్కన పెట్టాలి.

6. ఇప్పుడు స్టవ్ మీద పెనాన్ని పెట్టి నూనె వేయాలి.

7. నూనె వేడెక్కాక ఈ పిండిని దోశలాగా పలచగా వేసుకోవాలి.

8. రవ్వ దోశలు ఎలా వేస్తారో అలా పలుచగా వేసుకుంటే ఇవి క్రిస్పీగా వస్తాయి.

9. రెండు వైపులా ఎర్రగా కాలాక కొబ్బరి చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి.

జొన్న దోశలు డయాబెటిస్ పేషెంట్లకు ఎంతో మేలు చేస్తాయి. ఇవి తిన్నాక రక్తంలో చక్కర స్థాయిలో పెరగవు. జొన్నల్లో ఎన్నో సుగుణాలు ఉంటాయి. జొన్నల్లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి బ్రేక్ ఫాస్ట్ లో ఈ జొన్న దోశలను తినడం వల్ల ఆ రోజంతా చురుకుగా, ఉత్సాహంగా ఉంటారు. పొట్ట కూడా ఎక్కువ సేపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి బరువు కూడా పెరగరు. జొన్నల్లో ఐరన్, మెగ్నీషియం, జింక్, విటమిన్ బి3, కాపర్, క్యాల్షియం వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. కాబట్టి ఇవి ఎముకల ఆరోగ్యాన్ని కాపాడతాయి. రక్తహీనత సమస్య ఉన్నవారు జొన్న దోశలను తరచూ తింటే మంచిది. లేదా జొన్నలతో చేసిన రెసిపీలను తినడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడవచ్చు.

టాపిక్