Ghee with Milk: గోరువెచ్చని పాలలో ఒక స్పూను నెయ్యి కలుపుకొని రోజూ తాగి చూడండి, మీలో మార్పును గమనించండి-add a spoonful of ghee to warm milk and drink it daily and see the change in you ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ghee With Milk: గోరువెచ్చని పాలలో ఒక స్పూను నెయ్యి కలుపుకొని రోజూ తాగి చూడండి, మీలో మార్పును గమనించండి

Ghee with Milk: గోరువెచ్చని పాలలో ఒక స్పూను నెయ్యి కలుపుకొని రోజూ తాగి చూడండి, మీలో మార్పును గమనించండి

Haritha Chappa HT Telugu
May 08, 2024 09:32 AM IST

Ghee with Milk: నిద్ర పట్టక ఇబ్బంది పడేవారు ఎంతోమంది. మానసికంగా గందరగోళంగా అనిపించడం వల్ల కూడా చాలామందికి నిద్ర పట్టదు. అలాంటివారు ఈ మ్యాజికల్ పానీయాన్ని తాగి చూడండి. పాలు నెయ్యి కలిపి తాగితే ఎంతో ఆరోగ్యం.

పాలల్లో నెయ్యి కలిపి తాగితే ఉపయోగాలు
పాలల్లో నెయ్యి కలిపి తాగితే ఉపయోగాలు (pexels)

Ghee: చాలామంది వ్యక్తులకు రాత్రిపూట నిద్ర పట్టడం కష్టంగా మారుతుంది. నిద్ర అనేది మెదడుకు, శరీరానికీ విశ్రాంతిని అందించే ప్రక్రియ. కానీ మానసిక గందరగోళాల మధ్య నిద్రపోయే వారి సంఖ్య తక్కువే. అలాంటి వారికి ఒక మ్యాజికల్ పానీయం ఉంది. రాత్రి నిద్ర పోయే ముందు గోరువెచ్చని పాలలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కలుపుకొని తాగండి. ఇలా కొన్ని రోజులు పాటు తాగితే చక్కటి నిద్ర మీ సొంతం అవుతుంది. అంతేకాదు గోరువెచ్చని పాలలో నెయ్యి కలపడం వల్ల ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కీళ్లు, చర్మం, జీవక్రియ, జీర్ణవ్యవస్థ ఇలా ఎన్నో అవయవాల ఆరోగ్యాన్ని ఇది మెరుగుపరుస్తుంది.

నెయ్యిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. నెయ్యి అంటే వెన్న రూపమే. ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అంటే 14 గ్రాములు. ఈ నెయ్యిలో కేలరీలు 112 దాకా ఉంటాయి. కొవ్వు 12 గ్రాములు ఉంటుంది. కొలెస్ట్రాల్ 33 మిల్లీ గ్రాములు. వీటిలో ఏ విటమిన్, ఈ విటమిన్, కె విటమిన్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మన శరీరానికి చేరడం చాలా అవసరం.

ముఖ్యంగా నెయ్యిలో లాక్టోజ్, కేసై న్ వంటి ప్రోటీన్లు ఉండవు. కాబట్టి ఎవరైనా కూడా నెయ్యిని తినవచ్చు. లాక్టోజ్ ఇంటాలరెన్స్ సమస్యతో బాధపడేవారు పాలను, పెరుగును దూరం పెట్టాలి. కానీ నెయ్యిని మాత్రం తినవచ్చు. దీన్ని అధిక స్మోక్ పాయింట్ వద్ద వేడి చేసినా కూడా హానికరమైన సమ్మేళనాలను ఉత్పత్తి చేయదు. కాబట్టి దీన్ని అధిక ఉష్ణోగ్రతల వద్ద వంట చేసేందుకు కూడా ఉపయోగించవచ్చు.

గోరువెచ్చని పాలను నెయ్యితో కలిపి తాగడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. నెయ్యిలో బ్యూట్రిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థకు సహాయపడుతుంది. ఈ బ్యూట్రిక్ ఆసిడ్ జీర్ణవ్యవస్థలో మంటను తగ్గించడానికి, మంచి బ్యాక్టీరియాని పెంచడానికి ఉపయోగపడుతుంది. అలాగే జీవక్రియను పెంచడానికి సహాయపడుతుంది. జీర్ణం చేయడానికి ఇది మేలు చేస్తుంది. కాలేయం ద్వారా శక్తిగా మార్చుతుంది. కీళ్ల నొప్పులతో బాధపడేవారు ప్రతిరోజూ గోరువెచ్చని పాలలో స్పూను నెయ్యి వేసుకుని తాగడం అలవాటు చేసుకోండి.

మెరిసే చర్మం కోసం

పచ్చని పాలలో నెయ్యిని వేసుకుని తాగడం వల్ల చర్మం ఆరోగ్యంగా మెరుపు సంతరించుకుంటుంది. నెయ్యిలో విటమిన్ ఏ, విటమిన్ బి వంటి కొవ్వులో కరిగే విటమిన్లు ఉంటాయి. ఇవి ఆరోగ్యమైన చర్మానికి సహాయపడతాయి. చర్మం లోపల నుండి పోషణ, తేమను అందిస్తాయి. ఇవి రేడియేషన్ వల్ల కలిగే నష్టం నుండి చర్మాన్ని కాపాడతాయి.

మీ ఆహారంలో నెయ్యిని జోడించడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది. రోజుకు ఒక స్పూను నెయ్యి తాగడం వల్ల బరువు తగ్గే అవకాశాలు ఉంటాయి. అంతకన్నా అధికంగా తాగితే బరువు పెరగవచ్చు. కానీ రోజుకు ఒక స్పూను తాగితే మాత్రం కచ్చితంగా బరువు తగ్గే అవకాశం ఉంది.

పడుకునే ముందు గోరువెచ్చని పాలలో నెయ్యి కలిపి తాగడం వల్ల నిద్ర బాగా పడుతుంది. పాలు, నెయ్యి రెండింటిలోనూ ట్రిప్టోఫాన్ ఉంటుంది. ఇది నిద్రను ప్రేరేపిస్తుంది. కాబట్టి ప్రతిరోజూ గోరువెచ్చని పాలలో ఒక స్పూను నెయ్యి వేసి కలుపుకుని తాగితే ఎంతో మంచిది.

Whats_app_banner