Ghee Cream: నెయ్యితో ఇలా క్రీమ్ తయారు చేసుకోండి, ఆ క్రీమ్ రాత్రికి రాసుకుంటే ఉదయానికి ముఖం మెరిసిపోతుంది-make this cream with ghee if you apply that cream at night your face will glow in the morning ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ghee Cream: నెయ్యితో ఇలా క్రీమ్ తయారు చేసుకోండి, ఆ క్రీమ్ రాత్రికి రాసుకుంటే ఉదయానికి ముఖం మెరిసిపోతుంది

Ghee Cream: నెయ్యితో ఇలా క్రీమ్ తయారు చేసుకోండి, ఆ క్రీమ్ రాత్రికి రాసుకుంటే ఉదయానికి ముఖం మెరిసిపోతుంది

Haritha Chappa HT Telugu
Apr 14, 2024 02:52 PM IST

Ghee Cream: క్రీములు ఇంట్లోనూ తయారు చేసుకోవచ్చు. బయటకొనే క్రీముల్లో రసాయనాలు ఉంటాయి. సేంద్రీయ పద్ధతిలో ఇంట్లోనే ఫేస్ క్రీమ్ ఇలా తయారు చేసుకోండి.

నెయ్యితో ఫేస్ క్రీమ్
నెయ్యితో ఫేస్ క్రీమ్ (Pixabay)

Ghee Cream: నెయ్యి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రోజుకి ఒక స్పూన్ నెయ్యి తింటే ఎన్నో ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. అలాగే చర్మం కూడా మెరిసిపోయే అవకాశం ఉంది. పాల పదార్థాలలో చర్మాన్ని మెరిపించే గుణాలు ఉంటాయి. అందంగా ఉండాలని అందరికీ ఉంటుంది. అలాంటివారు నెయ్యితోనే క్రీమ్ తయారు చేసుకొని స్టోర్ చేసుకుంటే మంచిది. ఈ క్రీమ్ ను రాత్రిపూట రాసుకొని నిద్రపోవాలి. ఉదయం కల్లా మీ చర్మం సహజంగానే కాంతివంతంగా మారుతుంది.

క్రీముల్లో రసాయనాలు ఉండే అవకాశం ఉంది. ఇంట్లోనే సేంద్రియ పద్ధతిలోనే నెయ్యితో క్రీమ్ తయారు చేసుకుంటే ఈ రసాయనాలు కలిసిన ఫేస్ క్రీమ్‌ను వాడాల్సిన అవసరం లేదు. ఇది అద్భుతంగా పనిచేస్తుంది. మీ చర్మాన్ని మెరిపిస్తుంది. దీన్ని ఇంట్లోనే చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు.

నెయ్యితో క్రీమ్ తయారీ ఇలా

క్రీమ్ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెను తీసుకోవాలి. ఆ గిన్నెలో ఒకటి లేదా రెండు స్పూన్ల నెయ్యిని వేయాలి. ఆ నెయ్యిలోనే మూడు ఐస్ క్యూబ్స్ వేసి బాగా కలపాలి. అలా కలుపుతూ ఉంటే ఇది క్రీమ్ లాగా తయారవుతుంది. ఈ క్రీమ్‌ను ఒక చిన్న డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. ఆ క్రీమ్ రోజూ రాత్రి నిద్రపోయే ముందు ముఖానికి రాసుకోవాలి. ఇలా ముఖానికి రాసుకునే ముందు చర్మాన్ని శుభ్రపరుచుకోవాలి. క్రీమ్‌ను రాసుకున్నాక ముఖాన్ని బాగా మర్దనా చేసుకోవాలి. దాన్ని నీటితో కడగాల్సిన అవసరం లేదు. అలానే నిద్రపోవచ్చు.

ఇలా కొన్ని రోజులు చేశాక మీ చర్మంలోని మార్పును చూడండి. అది కాంతివంతంగా మారుతుంది. చర్మంపై ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. నెయ్యిలో ఉండే యాంటీ ఇన్ ఫ్లమ్మేటరీ గుణాలు చర్మసంరక్షణకు ఉపయోగపడతాయి. చర్మంపై మొటిమలు, వాపు, మచ్చలు వంటివి రాకుండా కాపాడుతాయి. చర్మం మృదువుగా మారుతుంది. అలాగే బిగుతుగా తయారవుతుంది. కాబట్టి ముడతలు వంటివి కనబడవు. నెయ్యిలో యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉంటాయి. కాబట్టి దాంతో ఇలా క్రీమ్ తయారు చేసుకుని రాసుకోవడం వల్ల ఎంతో ఉపయోగం ఉంది. నెయ్యితో ప్రతివారం ఒక్కసారి క్రీమ్ తయారు చేసుకుని రాసుకోండి. అది తాజాగా ఉంటుంది. వారానికి ఒకసారి తయారు చేసుకుంటే చాలు. ఎక్కువ క్రీమ్ ను ఒకేసారి తయారు చేసుకుంటే కొన్నాళ్లకు అది శక్తివంతంగా పనిచేయకపోవచ్చు, కాబట్టి వారానికి ఒక్కసారి ఇలా క్రీమ్ తయారు చేసుకొని వాడుకోండి.

ఈ క్రీమ్ రాశాక మిగతా ఫేస్ క్రీములు వాడాల్సిన అవసరం రాదు. ఉదయాన సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఈ క్రీమ్ లోని పోషకాలు అన్నీ చర్మంలోకి ఇంకిపోతాయి. కొన్నాళ్లకు చర్మంలో మంచి మార్పులు కనిపిస్తాయి.

WhatsApp channel

టాపిక్