Boneless Chicken Biryani: బోన్‌లెస్ చికెన్ బిర్యానీని కుక్కర్లో ఇలా సులువుగా వండేయండి
Boneless Chicken Biryani: బిర్యానీ అంటేనే ఒక్కొక్కరికి నోరూరిపోతుంది. కొంతమందికి దీన్ని సరిగా వండడం రాక ఇబ్బంది పడతారు. ప్రెషర్ కుక్కర్లోనే సులువుగా బోన్‌లెస్ చికెన్ బిర్యాని వండొచ్చు.

Boneless Chicken Biryani: ప్రెషర్ కుక్కర్లో బిర్యానీని సులువుగా వండొచ్చు. దీన్ని బ్యాచిలర్స్ బిర్యాని అని కూడా పిలుస్తారు. బ్యాచిలర్స్, వంటరాని వారు... ప్రెషర్ కుక్కర్లో సులువుగా చికెన్ బిర్యాని ఎలా వండాలో తెలుసుకుంటే మంచిది. దీన్ని రుచి అద్భుతంగా ఉంటుంది. పైగా సులువుగా రెడీ అయిపోతుంది. కాబట్టి బోన్‌లెస్ చికెన్ బిర్యాని కుక్కర్లో ఎలా వండాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బోన్ లెస్ చికెన్ బిర్యాని రెసిపీకి కావాల్సిన పదార్థాలు
బోన్ లెస్ చికెన్ ముక్కలు - అరకిలో
జీలకర్ర పొడి - ఒక స్పూను
పసుపు - అర స్పూను
కారం - రెండు స్పూను
కార్న్ ఫ్లోర్ - ఒక స్పూను
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను
నీళ్లు - సరిపడా
నూనె - వేయించడానికి సరిపడా
నిమ్మరసం - ఒక స్పూను
నెయ్యి - ఒక స్పూను
జీలకర్ర - అర స్పూను
పచ్చిమిర్చి - రెండు
వెల్లుల్లి రెబ్బలు - మూడు
ఉల్లిపాయ - రెండు
టమోటో - ఒకటి
కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు
పుదీనా తరుగు - రెండు స్పూన్లు
గరం మసాలా - అర స్పూను
పెరుగు - అరకప్పు
బాస్మతి బియ్యం - ఒకటిన్నర కప్పు
అనాసపువ్వు - మూడు
మరాఠీ మొగ్గ - మూడు
దాల్చిన చెక్క - చిన్న ముక్క
లవంగాలు - ఐదు
యాలకులు - 5
షాజీరా - ఒక స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
జాపత్రి - ఒకటి
కరివేపాకులు - గుప్పెడు
బోన్‌లెస్ చికెన్ బిర్యాని రెసిపీ
1. చికెన్ ముక్కలను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేయాలి. చికెన్ ముక్కలకు ఉప్పును పట్టించి ఒక గంటపాటు నీళ్లలో నానబెట్టాలి.
2. తర్వాత ఆ ముక్కలను తీసి వేరే గిన్నెలో వేసుకోవాలి.
3. కారం, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు వేసి బాగా కలపాలి. అలాగే కార్న్ ఫ్లోర్‌ని వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనెను వేయాలి.
5. నూనెలో ఈ చికెన్ ముక్కలను ఎర్రగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి.
6. ఇప్పుడు మరొక కళాయిన తీసుకొని నూనె వేయాలి.
7. అందులో వెల్లుల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు, జీలకర్ర వేసి వేయించాలి.
8. ఉల్లిపాయ తరుగు, కరివేపాకులను కూడా వేసి వేయించుకోవాలి. చివర్లో టమాట తరుగును వేసి మెత్తబడేదాకా మూత పెట్టాలి.
9. టమాటా మెత్తగా అయ్యి ముద్దలా అయ్యాక, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కారం వేసి బాగా కలుపుకోవాలి.
10. ఇప్పుడు చిన్న మంట మీద పెట్టి పెరుగును వేసి బాగా కలపాలి.
11. ముందుగా వేయించుకున్న చికెన్‌ను ఈ పెరుగు మిశ్రమంలో వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి.
12. కొద్దిగా నీళ్లు వేసి కాసేపు చికెన్‌ను ఆ గ్రేవీలో ఉడకనివ్వాలి.
13. తర్వాత కొత్తిమీర, పుదీనా తరుగును జల్లి స్టవ్ కట్టేసుకోవాలి.
14. పైన నిమ్మ రసాన్ని పిండాలి. ఇప్పుడు బిర్యానీ వండేందుకు సిద్ధమవ్వాలి.
15. ప్రెషర్ కుక్కర్ ను స్టవ్ మీద పెట్టండి. అందులో బియ్యం ఉడకడానికి సరిపడా నీళ్లను వేయండి.
16. నీళ్లలోనే షాజీరా, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, జాపత్రి, పుదీనా, కొత్తిమీర తరుగు వేసి ఆ నీటిని మరిగించండి.
17. చికెన్ లో కూడా ఉప్పు ఉంది కాబట్టి, ఎక్కువ కాకుండా ఈ నీటిలో కాస్త ఉప్పును వేయండి. బిర్యానీ ఆకులను కూడా వేయండి
18. ఇప్పుడు నీళ్లు మరుగుతున్నప్పుడు బాస్మతి బియ్యాన్ని వేసి బాగా కలపండి.
19. మూత పెడితే బాస్మతి బియ్యం త్వరగా ఉడికిపోతుంది. కుక్కర్ మూత కాకుండా సాధారణ మూత పెట్టండి.
20. బియ్యం డబ్బై శాతం ఉడికిపోయాక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ గ్రేవీ, ముక్కలను బిర్యానీ పైన పరచండి.
21. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ వచ్చేదాకా ఉంచండి.
22. తర్వాత మూత తీస్తే బిర్యానీ రెడీ అయిపోతుంది.
23. వేడి వేడి కుక్కర్ మూత తీయగానే ఒక స్పూన్ నెయ్యిని చల్లుకోండి.
24. అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా చల్లుకోండి.
25. ఒకసారి గరిటతో కలిపితే బోన్ లెస్ బిర్యానీ రెడీ అయినట్టే. ఇది చాలా టేస్టీగా ఉంటుంది.
టాపిక్