Chicken Liver Fry: చికెన్ లివర్ వేపుడు, ఓసారి ఇలా చేసి చూడండి రుచి అదుర్స్
Chicken Liver Fry: చికెన్ లివర్ తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. చికెన్ లివర్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం.
Chicken Liver Fry: చికెన్ లివర్ ను వారానికి ఒక్కసారైనా తినడం వల్ల మన శరీరానికి అవసరమైన కొన్ని పోషకాలు అందుతాయి. చికెన్ లివర్ తినడం వల్ల అందులో ఉండే పోషకాలు రక్తాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే మెదడు పనితీరును మారుస్తాయి. కాబట్టి వారానికి ఒకసారి చికెన్ లివర్ తినడం చాలా ముఖ్యం. చికెన్ లివర్ ఫ్రై రెసిపీ ఇక్కడ ఇచ్చాము. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది. చికెన్ లివర్ నచ్చని వాళ్ళు కూడా దీన్ని ఇష్టంగా తింటారు.
చికెన్ లివర్ ఫ్రై రెసిపీకి కావలసిన పదార్థాలు
చికెన్ లివర్ - అరకిలో
ఉల్లిపాయలు - రెండు
కారం - రెండు స్పూన్లు
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒకటిన్నర స్పూను
ధనియాల పొడి - ఒక స్పూను
పసుపు - అర స్పూను
గరం మసాలా - అర స్పూను
పచ్చిమిర్చి - రెండు
కరివేపాకు - గుప్పెడు
కొత్తిమీర తరుగు - మూడు స్పూన్లు
ఉప్పు- రుచికి సరిపడా
చికెన్ లివర్ ఫ్రై రెసిపీ
1. చికెన్ లివర్ ను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేయాలి.
2. అందులో కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసి బాగా కలిపి పది నిమిషాల పాటు మ్యారినేట్ చేయాలి.
3. ఇప్పుడు ఉల్లిపాయలను సన్నగా తరగాలి.
4. స్టవ్ మీద కళాయి పెట్టి ఉల్లిపాయలను వేయించాలి.
5. తర్వాత నిలువుగా కట్ చేసిన పచ్చిమిర్చి, గుప్పెడు కరివేపాకులు వేసి వేయించాలి.
6. ఉల్లిపాయలు రంగు మారేవరకు వేయించాలి.
7. ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ లివర్ ను అందులో వేసి బాగా కలపాలి.
8. రుచికి సరిపడా ఉప్పును వేయాలి.
9. మీడియం మంట మీద పెట్టి మూత పెట్టాలి.
10. పది నిమిషాలు ఉడికించాలి. తర్వాత తీసి గరం మసాలా చల్లాలి.
11. మళ్లీ మూత పెట్టి చిన్న మంట మీద పావుగంట సేపు ఉడికించాలి.
12. మూత తీసి కొత్తిమీర తరుగును చల్లుకోవాలి. అంతే చికెన్ లివర్ ఫ్రై రెడీ అయినట్టే.
13. దీన్ని అన్నంతో తిన్నా, చపాతీతో తిన్న చాలా టేస్టీగా ఉంటుంది. స్నాక్స్ లాగా తిన్నా కూడా రుచిగా ఉంటుంది. పిల్లలకు కూడా దీన్ని తినిపించడం చాలా ముఖ్యం.
చికెన్ లివర్లో ఫోలేట్ ఉంటుంది. ఇది మన శరీరానికి అవసరమైనది. పురుషులు వీటిని తినడం వల్ల వారి లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. కండరాలు బలంగా మారేందుకు కూడా చికెన్ లివర్ సహాయపడుతుంది. ఇది ఎముకలను బలంగా మారుస్తుంది. కాబట్టి పిల్లలకు తినిపించడం చాలా ముఖ్యం. కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా చికెన్ లివర్ అడ్డుకుంటుంది. దీనిలో కేలరీలు తక్కువే ఉంటాయి, కాబట్టి బరువు పెరుగుతారన్న భయం అవసరం లేదు.
టాపిక్