Chilli Mutton: చిల్లీ చికెన్‌లాగే చిల్లీ మటన్ ఇలా చేశారంటే నోరూరిపోవడం ఖాయం
Chilli Mutton: చిల్లీ చికెన్ ఎప్పుడూ తింటూ ఉంటారు, ఒకసారి చిల్లీ మటన్ ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది.
Chilli Mutton: నాన్ వెజ్ ప్రియులకు చిల్లీ చికెన్, చిల్లీ ప్రాన్స్ వంటివి ఎంతో ఇష్టం. అయితే మటన్ రెసిపీలను స్నాక్స్ గా తక్కువగా తింటారు. మటన్‌తో ఎక్కువగా బిర్యాని, కర్రీ, వేపుడు రూపంలోనే తినడానికి ఇష్టపడతారు. నిజానికి చిల్లీ మటన్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని తయారు చేయడం సులువే. చిల్లీ మటన్ రెసిపీ ఎలాగో చూద్దాం.
చిల్లీ మటన్ రెసిపీకి కావలసిన పదార్థాలు
మటన్ ముక్కలు - అరకిలో
వెల్లుల్లి తురుము - మూడు స్పూన్లు
యాలకులు - నాలుగు
దాల్చిన చెక్క - చిన్న ముక్క
పచ్చిమిర్చి - ఆరు
పసుపు - అర స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - తగినంత
కరివేపాకు - గుప్పెడు
అల్లం - చిన్న ముక్క
ఉల్లిపాయలు - రెండు
మిరియాల పొడి - ఒక స్పూను
కొత్తిమీర తురుము - మూడు స్పూన్లు
చిల్లీ మటన్ రెసిపీ
1. చిల్లీ మటన్ తయారు చేసేందుకు ఎముకలు లేని మాంసాన్నే తీసుకోవాలి. దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేయించుకోవాలి.
2. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో శుభ్రంగా కడిగిన మటన్ ముక్కలు, కొంత వెల్లుల్లి తురుము, దాల్చిన చెక్క, యాలకులు, నీళ్లు పోసి ఐదు విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టాలి.
3. మటన్ ఎంత మెత్తగా ఉడికితే చిల్లి మటన్ టేస్ట్ అంత బాగుంటుంది.
4. కుక్కర్ మూత తీసి మటన్ ముక్కలను వేరు చేసి బాగా చల్లారనివ్వాలి.
5. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
6. అందులో పచ్చిమిర్చి తరుగు, కరివేపాకులు, వెల్లుల్లి తురుము, అల్లం తురుము వేసి వేయించాలి.
7. ఉల్లిపాయలను సన్నగా తరిగి వేసి రంగు మారేదాకా వేయించాలి.
8. ఉడకబెట్టుకున్న మటన్ ముక్కలను వేసి బాగా కలుపుకోవాలి.
9. ఇప్పుడు మిరియాల పొడిని, రుచికి సరిపడా ఉప్పును వేసి బాగా కలపాలి. చిన్న మంట మీద దీన్ని వండాలి.
10. మటన్ ఉడికించిన నీళ్లను ఒక గ్లాసు పక్కన పెట్టుకోవాలి. ఆ గ్లాసుడు నీళ్లు పోసి మూత పెట్టాలి.
11. ఆ నీళ్లు ఆవిరి అయిపోయేదాకా చిన్న మంట మీద ఉడికించాలి.
12. నీళ్లు ఆవిరి అయిపోయాక మటన్ ఫ్రై లాగా అవుతున్నప్పుడు పైన కొత్తిమీరను చల్లుకోవాలి.
13. అంతే చిల్లి మటన్ రెడీ అయినట్టే. దీన్ని స్నాక్స్ లా తినవచ్చు. మధ్యాహ్న భోజనంలో బిర్యానీకి జోడిగా తినవచ్చు. కారంగా కావాలనుకునేవారు కాస్త కారం పొడిని కలుపుకోవచ్చు. లేదా పచ్చిమిర్చిని ఎక్కువ వేసుకోవచ్చు. సాధారణ కారాన్ని తినేవారు పచ్చిమిర్చిని తగ్గించుకుంటే సరిపోతుంది. కారం వేయాల్సిన అవసరం.