Nalla Thumma Benefits : నల్ల తుమ్మచెట్టుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు!
Nalla Thumma Benefits : నల్ల తుమ్మచెట్టు గురించి తెలుసు కదా. మన చుట్టూ చాలా కనిపిస్తాయి. ఊర్లలో అయితే.. చెరువు గట్టు వైపు వెళితే చాలానే ఉంటాయి. అయితే వీటి ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
మన చుట్టూ అనేక రకాల ఔషధ మెుక్కలు ఉంటాయి. కానీ వాటిని మనం పట్టించుకోం. చాలా ఔషధ గుణాలను కలిగిన మెుక్కల్లో తుమ్మ చెట్టు(Gum Arabic Tree) కూడా ఒక్కటి. పొలాలు, రోడ్లు, ఇలా ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. నల్లటి బెరడు, పసుపు రంగు పూలు, పొడవాటి కాయలు, చిన్న చిన్న ఆకులు ఉంటాయి. ఈ తుమ్మలో అనేక రకాలు ఉన్నాయి. అయితే అందులో మనం చెప్పుకొనేది నల్ల తుమ్మ గురించి.
తుమ్మ బెరడుతోపాటు దాని జిగురును, కాయలను కలిపి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మూడు పూటలా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని చెబుతారు. దీని ద్వారా వెన్ను నొప్పి(Back Pain) తగ్గుతుంది. అంతేకాదు.. నల్ల తుమ్మ ఆకులు కూడా మనకు ఉపయోగపడతాయి. లేత నల్ల తుమ్మ ఆకులను సేకరించి జ్యూస్(Juice)గా చేసుకుని తాగితే.. స్త్రీలలో నెలసరి సమయంలో వచ్చే నొప్పులు తగ్గుతాయి.
నల్ల తుమ్మకాయలను ఎండబెట్టి పొడిగా చేయాలి. దీనిలో తగినన్ని నీళ్లు అలాగే కండె చక్కెరను కలిపి పేస్ట్ చేయాలి. ఇది తీసుకోవడం వలన పురుషుల్లో లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. లేత తుమ్మకాయలను తినడం కారణంగా.., పురుషుల్లో వచ్చే స్వప్న స్కలనం, శ్రీఘ్ర స్కలనం వంటి సమస్యలు తగ్గుతాయి.
నల్ల తుమ్మ చెట్టు బెరడుతో కషాయాన్ని చేసుకొని నోట్లో పోసుకుని పుక్కిలించి ఉమ్మి వేయాలి. ఇలా చేస్తే.. నోటిపూత, నోటిలో ఇతర సమస్యలు తగ్గుతాయి. నల్ల తుమ్మ చెట్టు బంకను పొడిగా చేసి పాలల్లో కలుపుకొని తాగితే మంచిది. దీనిద్వారా కీళ్ల నొప్పులు తగ్గుతాయి. విరిగిన ఎముకలు సైతం.. అతుక్కుంటాయి. తుమ్మ చెట్టు బెరడును 5 గ్రాముల మోతాదులో తీసుకుని దానికి రెండు గ్రాముల కాయ చూర్ణం పొడిని కలిపి.. ఈ పొడిని వెన్న పూసతో కలిపి తీసుకుంటే మంచిది.
తుమ్మ ఆకులను వాము , జీలకర్ర కలిపి కషాయంలా చేసుకుని తాగాలి. ఇలా చేస్తే.. డయేరియా సమస్య తగ్గుతుంది. ఈ విధంగా నల్ల తుమ్మ చెట్టు మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. నల్ల తుమ్మ చెట్టు ఆకులను మెత్తగా నూరి.. రోజు రెండు పూటలా పది గ్రాముల మోతాదులో తీసుకోవాలి. రక్త మెులల సమస్య తగ్గుతుంది. ఈ చిట్కాను వాడుతూనే ఉప్పు, కారం వంటి వాటిని తక్కువగా తీసుకుంటూ పత్యం చేయాలి.
గమనిక : మాకు దొరికిన సమాచారం ఆధారంగా ఈ కథనం ఇచ్చాం. ఏదైనా చేసే ముందు దగ్గరలోని వైద్యులు అడగండి.