Hair Growth Tips : మర్రి చెట్టు ఊడలతో ఇలా చేస్తే.. వద్దన్నా మీ జట్టు పెరుగుతుంది!-how to make banyan tree roots oil for hair growth details inside ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Hair Growth Tips : మర్రి చెట్టు ఊడలతో ఇలా చేస్తే.. వద్దన్నా మీ జట్టు పెరుగుతుంది!

Hair Growth Tips : మర్రి చెట్టు ఊడలతో ఇలా చేస్తే.. వద్దన్నా మీ జట్టు పెరుగుతుంది!

HT Telugu Desk HT Telugu
Feb 24, 2023 04:00 PM IST

Marri Udalu For Hair Growth : జుట్టును ఆరోగ్యంగా ఉంచుకునేందుకు అనేక రకాల టిప్స్ ఫాలో అవుతుంటారు. అయితే కొన్ని ఫలితం ఇస్తాయి. మరికొన్ని ఇవ్వవు.

హెయిర్ గ్రోత్ టిప్స్
హెయిర్ గ్రోత్ టిప్స్

జట్టును కాపాడుకోవడం ఈ కాలంలో పెద్ద సమస్యగా మారిపోయింది. జుట్టు(Hair) ఊడిపోవడంలాంటి సమస్య ఉంటే.. కొంతమంది ఇంట్లో నుంచి బయటకు రారు. అందంలో కీలక పాత్ర పోషించే.. జుట్టు విషయంలో జాగ్రత్తలు పాటించాలి. జట్టు ఊడిపోయేవరకూ కొంతమంది శ్రద్ధ చూపించరు. ఇక జుట్టు ఊడిపోయే సమయంలో తల పట్టుకుంటారు. ఇంట్లోనే.. ఒక నూనె(Oil)ను తయారు చేసుకుంటే వాటితో జుట్టు రాలడం సమస్య నుంచి బయటపడొచ్చు. దీని కారణంగా జుట్టు నల్లగా, వత్తుగా, ధృడంగా పెరుగుతుంది.

జుట్టు సంబంధిత సమస్యలతో(Hair Problems) చాలా మంది బాధపడుతుంటారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. వాతావరణ కాలుష్యం(Pollution), పోషకాహార లోపం, రసాయనాలు కలిగిన షాంపులు, హెయిర్ డై, కండీషనర్స్.. ఇలా చాలా ఉంటాయి. ఎంత ప్రయత్నించినా.. జట్టు సమస్య కొంతమందికి తగ్గదు. అలాంటి వారు.. ఇంట్లోనే.. నూనెను తయారు చేసుకోవచ్చు.

జుట్ట ఆరోగ్యంగా ఉండేందుకు ఇంట్లోనే నూనె తయారు చేసుకోవాలి. కొబ్బరి నూనె(coconut oil)ను అలాగే మ‌ర్రి చెట్టు ఊడ‌ల‌ను(Banyan Tree Roots) ఉప‌యోగించాలి. మ‌ర్రిచెట్టు ఊడ‌లు జుట్టు రాల‌డాన్ని త‌గ్గించ‌డంలో మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. మర్రి చెట్టు ఊడలను తీసుకుని శుభ్రంగా వాష్ చేయాలి. తర్వాత వాటిని రెండు మూడు రోజులు ఎండబెట్టాలి. మర్రి ఊడలు పూర్తిగా ఎండినాక ముక్కలు చేసి ఓ గిన్నెలోకి తీసుకోవాలి. వాటిని పొడిగా చేయాలి.

ఆ తర్వాత కాస్త కొబ్బరి నూనె తీసుకుని.. వేడి చేయాలి. ఇందులో మిక్సీలో పట్టిన మర్రి ఊడల పొడిని వేసి బాగా కలపాలి. ఆ తర్వాత చిన్న మంటపై పూర్తిగా నల్లగా అయ్యే వరకూ పెట్టాలి. అనంతంర స్టౌవ్ ఆఫ్ చేయాలి. తర్వాత ఈ నూనెను వ‌డ‌క‌ట్టి ఒక గాజు సీసాలో నిల్వ చేయాలి. ఈ నూనెను ఎక్కువ మొత్తంలో త‌యారు చేసుకుని కూడా నిల్వ చేయోచ్చు.

తయారు చేసుకున్న అనంతరం.. నూనె(Oil)ను జట్టు కుదుళ్ల నుంచి చివరి వరకూ అప్లై చేయాలి. కాస్త మర్దన చేయాలి. ఈ నూనెను రోజంతా కూడా మ‌న జుట్టు(Hair) పెట్టుకోవచ్చు. రాత్రి ప‌డుకునే ముందు ఈ నూనెను జుట్టుకు ప‌ట్టించి ఉద‌యాన్నే త‌ల‌స్నానం చేస్తే బాగానే ఉంటుంది. వారానికి రెండు సార్లు చేయండి. జుట్టు రాల‌డం త‌గ్గుతుంది. జుట్టు ఒత్తుగా, నల్లగా పొడవుగా ఉంటుంది.