Mouth Ulcers | నోటిలో పుండ్లను నయం చేసేందుకు సహజమైన నివారణ మార్గాలు ఇవిగో!-natural remedies to cure mouth ulcers ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Mouth Ulcers | నోటిలో పుండ్లను నయం చేసేందుకు సహజమైన నివారణ మార్గాలు ఇవిగో!

Mouth Ulcers | నోటిలో పుండ్లను నయం చేసేందుకు సహజమైన నివారణ మార్గాలు ఇవిగో!

Aug 24, 2022, 07:41 PM IST HT Telugu Desk
Aug 24, 2022, 07:41 PM , IST

  • నోటి పూతలు రావటానికి రెండు ప్రధాన కారణాలు.. ఒకటి నోటిలో ఏదైనా గాయం కావటం. పళ్ల క్లిప్పు పెట్టుకున్నపుడు పదునైన అంచు గీరటం లేదా అఫ్థస్ స్టోమాటిటిస్ అని పిలిచే పుండ్లు ఏర్పడటం. అయితే నోటి అల్సర్స్ ను సహజంగా నయం చేసుకోవచ్చు. ఆ మార్గాలేమిటో ఇప్పుడు చూడండి.

నోటి కుహరంలోని శ్లేష్మ పొరలో సంభవించే బాధాకరమైన క్యాంకర్ పుండ్లను నోటి పూతలు (మౌత్ అల్సర్స్) అని పిలుస్తారు. ఈ పుండ్లు మీ చిగుళ్ళు, నాలుక, లోపలి బుగ్గలు, పెదవులు లేదా అంగిలిపై మృదువైన కణజాలపు లైనింగ్‌లో అభివృద్ధి చెందుతాయి. వీటితో ఎలాంటి హాని లేనప్పటికీ.. నొప్పి, అసౌకర్యాలను కలిగిస్తాయి.

(1 / 7)

నోటి కుహరంలోని శ్లేష్మ పొరలో సంభవించే బాధాకరమైన క్యాంకర్ పుండ్లను నోటి పూతలు (మౌత్ అల్సర్స్) అని పిలుస్తారు. ఈ పుండ్లు మీ చిగుళ్ళు, నాలుక, లోపలి బుగ్గలు, పెదవులు లేదా అంగిలిపై మృదువైన కణజాలపు లైనింగ్‌లో అభివృద్ధి చెందుతాయి. వీటితో ఎలాంటి హాని లేనప్పటికీ.. నొప్పి, అసౌకర్యాలను కలిగిస్తాయి.(Shutterstock)

ఉప్పునీరు: గోరువెచ్చని నీటిలో ఒక టేబుల్‌స్పూను ఉప్పు వేసి బాగా పుక్కిలించాలి. ఆ తర్వాత మీ నోటి నుండి ఉప్పు రుచిని వదిలించుకోవడానికి సాధారణ నీటితో పుక్కిలించాలి. ఇలా చేస్తే మౌత్ అల్సర్స్ వలన కలిగే నొప్పి, అసౌకర్యం తగ్గుతుంది.

(2 / 7)

ఉప్పునీరు: గోరువెచ్చని నీటిలో ఒక టేబుల్‌స్పూను ఉప్పు వేసి బాగా పుక్కిలించాలి. ఆ తర్వాత మీ నోటి నుండి ఉప్పు రుచిని వదిలించుకోవడానికి సాధారణ నీటితో పుక్కిలించాలి. ఇలా చేస్తే మౌత్ అల్సర్స్ వలన కలిగే నొప్పి, అసౌకర్యం తగ్గుతుంది.(Instagram)

లవంగం నూనె: లవంగంలో యూజీనాల్, యాంటీమైక్రోబయల్ గుణాలు ఉండటం చేత దీనిని నోటి పరిశుభ్రత ఉత్పత్తులలో ఉపయోగిస్తారు. అయితే లవంగం నూనెను నేరుగా అల్సర్‌లపై రాస్తే ఉపశమనం లభిస్తుంది. అప్లికేషన్ తర్వాత గోరువెచ్చని నీటితో మీ నోటిని శుభ్రం చేసుకోండి.

(3 / 7)

లవంగం నూనె: లవంగంలో యూజీనాల్, యాంటీమైక్రోబయల్ గుణాలు ఉండటం చేత దీనిని నోటి పరిశుభ్రత ఉత్పత్తులలో ఉపయోగిస్తారు. అయితే లవంగం నూనెను నేరుగా అల్సర్‌లపై రాస్తే ఉపశమనం లభిస్తుంది. అప్లికేషన్ తర్వాత గోరువెచ్చని నీటితో మీ నోటిని శుభ్రం చేసుకోండి.(Unsplash)

ఆరెంజ్ జ్యూస్: మీకు తెలుసా? విటమిన్ సి లోపం నోటిపూతలకు దారితీస్తుందని అనేక అధ్యయనాలు పేర్కొన్నాయి. సిట్రిక్ ఫుడ్‌ నారింజలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది నోటి అల్సర్‌లను నయం చేయడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ రెండు గ్లాసుల తాజాగా పిండిన నారింజ రసం తాగండి.

(4 / 7)

ఆరెంజ్ జ్యూస్: మీకు తెలుసా? విటమిన్ సి లోపం నోటిపూతలకు దారితీస్తుందని అనేక అధ్యయనాలు పేర్కొన్నాయి. సిట్రిక్ ఫుడ్‌ నారింజలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది నోటి అల్సర్‌లను నయం చేయడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ రెండు గ్లాసుల తాజాగా పిండిన నారింజ రసం తాగండి.(Unsplash)

తేనె: తేనెను నేరుగా అల్సర్‌లపై అప్లై చేయండి. మంచి ఫలితాల కోసం ప్రతి కొన్ని గంటలకొకసారి మళ్లీ అప్లై చేస్తూ ఉండండి. తేనెలో ఉండే యాంటీమైక్రోబయల్ గుణాలు ఏదైనా గాయాన్ని త్వరగా రిపేర్ చేయడంలో సహాయపడతాయి.

(5 / 7)

తేనె: తేనెను నేరుగా అల్సర్‌లపై అప్లై చేయండి. మంచి ఫలితాల కోసం ప్రతి కొన్ని గంటలకొకసారి మళ్లీ అప్లై చేస్తూ ఉండండి. తేనెలో ఉండే యాంటీమైక్రోబయల్ గుణాలు ఏదైనా గాయాన్ని త్వరగా రిపేర్ చేయడంలో సహాయపడతాయి.(Unsplash)

కొబ్బరి నూనె: పడుకునే ముందు కొబ్బరినూనెను నేరుగా అల్సర్‌లపై రాయండి. కొబ్బరి నూనెలో యాంటీమైక్రోబయల్ గుణాలు ఉంటాయి, ఇవి అల్సర్‌లను సహజంగా తగ్గించడంలో సహాయపడతాయి.

(6 / 7)

కొబ్బరి నూనె: పడుకునే ముందు కొబ్బరినూనెను నేరుగా అల్సర్‌లపై రాయండి. కొబ్బరి నూనెలో యాంటీమైక్రోబయల్ గుణాలు ఉంటాయి, ఇవి అల్సర్‌లను సహజంగా తగ్గించడంలో సహాయపడతాయి.(Unsplash)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు