Home Remedies for Vomiting| వాంతుల నుంచి వేగంగా ఉపశమనం పొందాలంటే ఇవిగో చిట్కాలు!
వాంతులు రావటానికి కారణాలు అనేకం. ప్రయాణాలు చేసేటపుడు వాంతులు కలిగితే అసౌకర్యంగా అనిపిస్తుంది. నివారణ మార్గాలను తెలుసుకోండి.
అనారోగ్యంగా ఉన్నప్పుడు కొన్నిసార్లు వాంతులు, విరేచనాలు రావటం అనేది సాధారణం. ఏది తిన్నా కూడా వెంటనే బయటకు వచ్చేస్తుంది. నిజానికి వాంతి అనేది జీవ రక్షణ విధానం. ఇది రిఫ్లెక్స్ యాక్టివిటీ, కడుపులోని పదార్థాలను బలవంతంగా నోటి ద్వారా బహిష్కరించే చర్య. వాంతి చేసే అసలు పని శరీరంలోని విషపూరితమైన లేదా హానికరమైన పదార్థాలను బయటకు తొలగించటం.
అయితే ఈ వాంతులు రావటానికి వివిధ రకాల కారణాలు ఉండవచ్చు. గర్భధారణ సమయంలో అజీర్ణం, వికారం కారణంగా వాంతులు వస్తాయి. తమకు పడని ఆహారం పడనపుడు వాంతులు అవుతాయి. కొందరికి ప్రయాణాలు చేసేటపుడు వాంతులు జరుగుతాయి.
మీరు ప్రయాణాలు చేసేటపుడు లేదా ముఖ్యమైన కార్యక్రమంలో పాల్గొనాల్సి వచ్చినపుడు వాంతులు జరుగుతుంటే అసౌకర్యంగా అనిపిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో వాంతులు ఆపటానికి ఏం చేయాలి? ఇప్పుడు ఫార్మసీలో మందులు లభించినప్పటికీ కూడా అప్పటికప్పుడు ఉపశమనం పొందటానికి ఎన్నో ఇంటి చిట్కాలు ఉన్నాయి.
సహజంగా వాంతులను నిరోధించటానికి, అలాగే తక్షణ ఉపశమనం పొందటానికి ఈ ఇంటి నివారణలు (Home Remedies for Vomiting) ప్రయత్నించి చూడండి.
పుదీనా టీ
వాంతులు నుండి ఉపశమనం పొందడానికి పుదీనా టీని తాగిచూడండి. వేడి నీటిలో పుదీనా ఆకులను వేసి కాచండి. అనంతరం ఆకులను వడకట్టి ఈ టీని తాగండి. వాంతులు ఎక్కువ ఉంటే పుదీనా రసం, నిమ్మరసం, తేనె సమపాళ్లలో కలపండి. ఈ పానీయాన్ని రోజుకు రెండు, మూడు సార్లు తీసుకోవాలి.
అల్లం టీ
వాంతులను నయం చేసే మరో పదార్థం అల్లం. ఇది మీ జీర్ణవ్యవస్థకు మంచిది, కడుపు లోపల వాంతికి కారణమయ్యే అనవసరమైన స్రావాన్ని నిరోధించడంలో సహాయపడుతుంది. కాబట్టి వాంతి వస్తున్నట్లుగా అనిపిస్తే అల్లం టీని తీసుకోండి.
లవంగాలు
లవంగాలలో యాంటిసెప్టిక్, మత్తు కలిగించే గుణాలు ఉంటాయి. ఇవి జీర్ణక్రియకు సహాయపడతాయి. మీకు వాంతులు అవుతున్నట్లు అనిపిస్తే 2-3 లవంగాలు నమలండి. లేదా లవంగాల పొండి, తేనేతో కలుపుకొని తీసుకోండి. ఇదీకాకపోతే రెండు నుంచి నాలుగు ఎండుమిర్చి గింజలు తీసుకుని చప్పరించండి.
హెర్బల్ జ్యూస్
పచ్చి కొత్తిమీరతో జ్యూస్ చేసి, గ్లాసు నీటిలో కొద్దిగా రాతి ఉప్పు, నిమ్మరసం అన్నీ కలుపుకుని తాగాలి. రెండు చెంచాల గిలోయ్ జ్యూస్‌లో కొద్దిగా పంచదార మిక్స్ చేసి తాగండి. ఇది రోజుకు మూడు సార్లు ఉపయోగించవచ్చు. దీంతో వాంతులు ఆగుతాయి.
గంజి నీరు
గంజి నీరు వాంతిని తగ్గించడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా పొట్టలో పుండ్లు ఏర్పడినప్పుడు ఇది ఎంతో ప్రభావవంతంగా ఉంటుంది. ఒక కప్పు బియ్యంలో 2 కప్పుల నీరు పోసి బియ్యం ఉడకబెట్టండి. అనంతరం బియ్యం వడకట్టి ఆ నీటిని త్రాగాలి.
వాము
వాములోని ఔషధ గుణాలు వాంతులను నయం చేస్తాయి. వాంతుల నుంచి త్వరిత ఉపశమనం కోసం వామును నమలవచ్చు. మీరు క్యారెట్ లేదా గుమ్మడికాయ వంటి తేలికపాటి కూరగాయలపై కాల్చిన వామును చల్లుకొని తింటే కూడా ఫలితం ఉంటుంది.
సంబంధిత కథనం
టాపిక్