Cracked Foot : పాదాల పగుళ్లను పోగొట్టే సింపుల్ చిట్కాలు
Cracked Foot Tips : చాలామంది పాదాల పగుళ్లతో ఇబ్బంది పడుతారు. అయితే వాటిని లైట్ తీసుకుంటే.. మరింత నొప్పిని కలిగిస్తాయి. పాదాల పగుళ్లను తగ్గించుకునేందుకు కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు.
పాదాల పగుళ్లతో అనేక మంది సమస్యలు ఎదుర్కొంటారు. కొంతమందికైతే.. నడుస్తుంటే.. కూడా నొప్పి ఉంటుంది. రాత్రి పడుకునేముందు బెడ్ షిట్స్ కప్పుకొంటున్నా.. కాళ్లకు తగులుతాయి. దీంతో నొప్పి ఉంటుంది. ఇలా పగుళ్లు ఏర్పడటానికి అనేక కారణాలు ఉంటాయి. ఊబకాయం, పాదాలను సరిగ్గా క్లీన్ చేయకపోవడం, పొడిచర్మం, శరీరంలో వేడి ఎక్కువలాంటి కారణాలతో ఇలా జరుగుతుంది.
అయితే పాదాల పగుళ్లు అనేవి పెద్ద సమస్య కాకపోయినా.. చూసేందుకు మాత్రం బాగుండదు. కొంచెం నొప్పి కూడా ఉంటుంది. కొన్ని రకాల ఇంటి చిట్కాలు(Tips) పాటిస్తే.. చాలు.. ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.
మెుదట ఒక గిన్నెలో బంగాళాదుంప ముక్కలను కట్ చేసుకోవాలి. ఆ తర్వాత వాటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. వస్త్రంతో లేదా స్ట్రేయినర్ సాయంతో బంగాళదుంప మిశ్రమాన్ని వడకట్టాలి. దాని రసం వస్తుంది. ఈ రసాన్ని పాదాల పగుళ్లపై రాయాలి. ఇలా చేస్తే.. పాదాలు తెల్లగా అవ్వడమే కాదు.. పగుళ్లు కూడా తగ్గుతాయి. అయితే ఈ బంగాళాదుంప రసంలో ఒక టీ స్పూన్ టూత్ పేస్ట్(Tooth Paste), కాస్తంత నిమ్మరసాన్ని(Lemon) వేసి కలపాలి. దీనిని పక్కనపెట్టాలి.
బకెట్ లో కాస్త గోరు వెచ్చని నీటిని తీసుకోవాలి. ఆ తర్వాత అందులో రాళ్ల ఉప్పును వేసి పది నిమిషాలు పాదాలను అందులో పెట్టాలి. తర్వాత నిమ్మ చెక్కతో పాదాలను మర్దన చేయాలి. తర్వాత ముందుగా తయారు చేసిన బంగాళాదుంప మిశ్రమాన్ని పాదాలకు అట్టించి.. కాసేపు ఉంచాలి. ఆ తర్వాత శుభ్రం చేసుకోవాలి.
ఇలా చేస్తే.. పాదాలపై పేరుకుపోయిన మురికి, మృతకణాలు తొలగిపోతాయి. పాదాల పగుళ్లు కూడా తగ్గుతాయి. ఇలా వారానికి రెండుసార్లు చేయండి. ఫలితం ఉంటుంది. ఉదయం పూట గడ్డిలో చెప్పులు లేకుండా నడిస్తే మంచిది. అలాగే బస్త్రిక లాంటి కొన్ని యోగాసనాలు వేయాలి. ఇలా చేస్తే.. పాదాలకు రక్తప్రసరణ సరిగా జరుగుతుంది. శరీరంలో వేడి తగ్గితే.. పాదాల పగుళ్లు కూడా తగ్గుతుంది. అందుకే నీటిని ఎక్కువగా తాగాలి.