Home Remedies for Foot Cracks : చలికాలంలో మీ పాదలకు పగుళ్లు రాకుండా ఇలా రక్షించుకోండి..-amazing tip to get rid of cracked heels with home remedies ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Home Remedies For Foot Cracks : చలికాలంలో మీ పాదలకు పగుళ్లు రాకుండా ఇలా రక్షించుకోండి..

Home Remedies for Foot Cracks : చలికాలంలో మీ పాదలకు పగుళ్లు రాకుండా ఇలా రక్షించుకోండి..

Geddam Vijaya Madhuri HT Telugu
Nov 11, 2022 04:05 PM IST

Home Remedies for Foot Cracks : చలికాలంలో చర్మంతో పాటు పాదాలు కూడా డ్రై అయిపోతాయి. దాని కారణంగా పగుళ్లు వస్తాయి. దాని ప్రభావం మరింత ఎక్కువైపోతుంది. నొప్పి ఎక్కువై.. ఒక్కోసారి రక్తం కూడా వచ్చేస్తుంది. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే.. మీరు ముందే దీనిని అరికట్టేయండి. ఇంట్లోనే తయారు చేసుకునే ఫుట్ క్రీములతో చెక్ పెట్టండి.

పగిలిన పాదాల కోసం ఇంటి చిట్కాలు
పగిలిన పాదాల కోసం ఇంటి చిట్కాలు

Home Remedies for Foot Cracks : మృదువైన పాదాలంటే ఎవరికీ ఇష్టముండదు చెప్పండి. చలికాలం అంటే పొడి చర్మం, పగిలిన కాళ్లు.. దురదలతో సహా పొడి చర్మ సమస్యలను కలిగిస్తుంది. ఈ సమయంలో పాదాలను కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఇంట్లోనే తయారు చేసుకోగలిగే ఫుట్ క్రీమ్​లతో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. మరి వాటిని ఎలా తయారు చేయాలి.. కావాల్సిన పదార్థాలు ఏమిటో.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

లావెండర్ ఫుట్ క్రీమ్

లావెండర్‌లో శాంతపరిచే గుణాలు మీకు విశ్రాంతిని అందిస్తాయి. దాని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, అనాల్జేసిక్ గుణాలు పాదాల నొప్పి నుంచి ఉపశమనం ఇస్తాయి. షియా బటర్, కొబ్బరి నూనెతో కలిపి వేడిచేయండి. దానిలో లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ వేసి బాగా కలపాలి. మిశ్రమాన్ని చల్లార్చండి. పడుకునే ముందు ఈ క్రీమ్‌తో మీ పాదాలకు మసాజ్ చేయండి. సాక్స్‌లు ధరించండి. ఇలా రోజూ చేస్తుంటే.. మృదువైన పాదాలు మీ సొంతమవుతాయి.

అల్లం, నిమ్మ నూనె ఫుట్ క్రీమ్

అల్లం మీ చర్మంపై ఇన్ఫెక్షన్ కలిగించే శిలీంధ్రాలు, బ్యాక్టీరియాను చంపడానికి సహాయపడుతుంది. అయితే నిమ్మకాయలోని ఆమ్లత్వం మీ పాదాల నుంచి చనిపోయిన చర్మ కణాలను తొలగించి వాటిని ప్రకాశవంతంగా చేస్తుంది.

బీస్వాక్స్, కోకో బటర్, కొబ్బరి నూనె, బాదం నూనె వేసి కరిగించండి. అల్లం ఎసెన్షియల్ ఆయిల్, లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ వేసి బాగా కలపండి. నిద్రపోయే ముందు ఈ మిశ్రమంతో మీ పాదాలను మసాజ్ చేయండి.

పాలు, తేనె ఫుట్ క్రీమ్

పాలు, తేనె ఫుట్ క్రీమ్ పగిలిన చర్మాన్ని నయం చేస్తుంది. మీ పాదాలను లోతుగా పోషించి, చర్మం గ్లో, ఆకృతిని పునరుద్ధరిస్తుంది. ఒక గిన్నెలో వెచ్చని చల్లని పాలు, తేనె, నిమ్మరసం, బాదం నూనె వేసి బాగా కలపండి. దానిని చల్లారనిచ్చి.. దానిలో వెనీలా ఎసెన్స్ వేసి మళ్లీ కలపండి. ప్రతిరోజూ పడుకునే ముందు దీనితో మీ పాదాలను మసాజ్ చేయండి.

పిప్పరమింట్ ఫుట్ క్రీమ్

పిప్పరమెంటు మీ పాదాలకు చాలా రిఫ్రెష్, నొప్పితో కూడిన, అలసిపోయిన పాదాలను తక్షణమే ఉపశమనం ఇస్తుంది. గిన్నెలో కొబ్బరి నూనె, షియా బటర్, ఆలివ్ నూనె వేసి వేడి చేయండి. దానిలో పెప్పర్‌మింట్‌ ఆయిల్‌ వేసి బాగా కలపండి. దానిని ఓ డబ్బాలో నిల్వ చేసి.. ఈ క్రీమ్‌ను రాత్రి మీ మడమలకు రాయండి. ఇది మీకు ఆరోగ్యకరమైన, తేమతో కూడిన పాదాలను ఇస్తుంది.

టీ ట్రీ ఫుట్ క్రీమ్

క్రిమినాశక లక్షణాలతో నిండిన, టీ ట్రీ ఆయిల్ పాదాల చర్మం నుంచి బ్యాక్టీరియా, శిలీంధ్రాలను తొలగిస్తుంది. దురద, పొలుసులు, వాపు, మంటలను దూరంగా ఉంచుతుంది. ఇది అలసిపోయిన పాదల నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. ఒక గిన్నెలో కోకో బటర్, బీస్వాక్స్, ఆలివ్ ఆయిల్ కలిపి వేడి చేయండి. టీ ట్రీ ఆయిల్ వేసి బాగా కలపాలి. నిద్రపోయే ముందు ఈ క్రీమ్‌తో మీ పాదాలను మసాజ్ చేయండి.

WhatsApp channel

సంబంధిత కథనం