తెలుగు న్యూస్ / ఫోటో /
Warm Drinks for Winter । చలికాలంలో వీటిని తాగితే.. వెచ్చగా, హాయిగా ఉంటుంది!
- Warm Drinks for Winter: చలికాలంలో వేడివేడిగా ఏదైనా తాగితే వెచ్చగా అనిపిస్తుంది. మీకు ఇష్టమైన వెచ్చని పానీయంతో శీతాకాలపు సాయంత్రం గడపడం కంటే హాయి ఇంకా ఏమీ ఉంటుంది. ఈ సమయంలో తాగాల్సిన హెల్తీ హాట్ డ్రింక్స్ ఏంటో చూద్దాం.. ఆల్కాహాల్ మాత్రం కాదు!

(1 / 6)
పసుపు పాలు: గ్లాసు పాలలో చిటికెడు పసుపు వేసుకొని గోరువెచ్చగా ఈ చలికాలంలో తాగండి. అది మిమ్మల్ని లోపలి నుంచి వెచ్చగా ఉంచుతుంది. ఆరోగ్యాన్ని పెంచుతుంది.
(2 / 6)
బాదం పాలు: చలికాలంలో తీసుకోవాల్సిన మరొక ఆరోగ్యకరమైన పానీయం బాదం పాలు. పొట్టు తీసిన బాదంపప్పును పాలలో వేసి కొన్ని నిమిషాలు ఉడకబెట్టడం ద్వారా దీనిని తయారుచేస్తారు. ఇది మరింత రుచికరంగా ఉండటానికి, కుంకుమపువ్వును కూడా పాలలో కలుపుకోవచ్చు.
(3 / 6)
అల్లం టీ: అల్లంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చలికాలంలో వచ్చే అలర్జీలను నయం చేస్తుంది. కాబట్టి, ఈ శీతాకాలంలో అల్లం టీ తాగడం మర్చిపోవద్దు. అంతేకాకుండా, అల్లం శరీరం యొక్క నిర్విషీకరణలో సహాయపడుతుంది.
(4 / 6)
కహ్వా: చలికాలంలో కహ్వా (Kahwah) కూడా మిమ్మల్ని వెచ్చగా ఉంటుంది. దీనిని కాశ్మీరీ కహ్వా అని కూడా అంటారు. శీతల ప్రదేశం అయిన కాశ్మీర్‌లో ఎక్కువగా తాగుతారు. ఇది గ్రీన్ టీ, కుంకుమపువ్వు, దాల్చినచెక్క, ఏలకులతో తయారు చేసే ఒక రకమైన టీ.
(5 / 6)
హాట్ చాక్లెట్: మీరు చాక్లెట్ ప్రియులైతే శీతాకాలంలో కచ్చితంగా వేడి కోకో లేదా వేడి చాక్లెట్‌ను తింటూ ఆనందించవచ్చు.
ఇతర గ్యాలరీలు