Leafy vegetables: ఈ ఆకుకూరలు తినడమే తగ్గించేశాం.. పోషకాలు తెలిస్తే పక్కాగా మొదలు పెడతారు-must include these leafy vegetables in your diet for health ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Leafy Vegetables: ఈ ఆకుకూరలు తినడమే తగ్గించేశాం.. పోషకాలు తెలిస్తే పక్కాగా మొదలు పెడతారు

Leafy vegetables: ఈ ఆకుకూరలు తినడమే తగ్గించేశాం.. పోషకాలు తెలిస్తే పక్కాగా మొదలు పెడతారు

Koutik Pranaya Sree HT Telugu
Sep 15, 2024 04:30 PM IST

Leafy vegetables: ఎప్పుడూ తినే ఆకుకూరలే కాకుండా అధిక పోషకాలున్నవి కొన్ని ఉన్నాయి. చామకూర, తమలపాకు, మునగాకు, ఎర్ర తోటకూర తక్కువగా తింటారు. వాటి పోషకాలు తెల్సుకోండి.

పోషకాల ఆకుకూరలు
పోషకాల ఆకుకూరలు (Shutterstock)

ఆకుకూరలతో చేసే వంటకాలు రుచిగా ఉండటంతో పాటే ఖనిజాలు, ఇనుము, రోగనిరోధక శక్తిని పెంచే పోషకాలను అందిస్తాయి. బచ్చలికూర, పాలకూర, గోంగూర, మెంతికూర, కొత్తిమీర లాంటి ఆకుకూరలతో పాటే చాలా మందికి తెలీని పోషకాలు మెండుగా ఉండే ఆకులు కొన్ని ఉన్నాయి. వీటిలో కొన్నింటిని పచ్చిగా తినవచ్చు, మరికొన్నింటిని బ్లాంచ్ లేదా ఉడకబెట్టాల్సి ఉంటుంది.

మునగాకు:

మనగాకు
మనగాకు (Shutterstock)

అత్యంత శక్తివంతమైన, సంపూర్ణ ఆరోగ్యాన్నిచ్చే ఆకులలో మునగాకు ఒకటి. విటమిన్ ఎ, సి, ఇ.. లతో పాటూ, కాల్షియం, పొటాషియం, ప్రోటీన్, ఇనుము దీంట్లో ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచడానికి, మెదడు, కాలేయ ఆరోగ్యానికి మద్దతు ఇవ్వడానికి, శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి ఇవి పెట్టినవి పేరు. ఇవి పెరిగిన ఆక్సలేట్ స్థాయిలను తగ్గించడం ద్వారా మూత్రపిండాల్లో రాళ్లను నియంత్రించడానికి ప్రయోజనకరంగా ఉంటాయి. ఎడెమా చికిత్సకు, ఉబ్బసం తగ్గించడానికి, రక్తహీనత వంటి రక్త సంబంధిత వ్యాధులను నివారించడానికి సహాయపడుతుంది. అయితే ఇవి డయాబెటిస్ రకాలు, థైరాయిడ్, రక్తపోటు కోసం వాడే మందులకు ఆటంకం కలిగిస్తాయి" అని పోషకాహార నిపుణులు విదుర దేశాయ్ చెప్పారు.

చామకూర:

చామకూర
చామకూర (Shutterstock)

చామకూరలో ఫైబర్, విటమిన్లు ఎ, సి, ఇనుము, మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇవి జీర్ణక్రియకు సాయపడతాయి. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు ఆక్సిడేటివ్ స్ట్రెస్‌తో పోరాడటానికి సహాయపడతాయి. కానీ వీటిలో ఆక్సలేట్ ఉంటుంది. ఇది కొందరికి దురదకు కారణమవుతుంది. కాబట్టి వీటిలో ఉండే ఈ హానికర పదార్థాలు తటస్థం చేయడానికి సరిగ్గా ఉడికించడం తప్పనిసరి.

ఎర్ర తోటకూర:

శరీరం డిటాక్స్ చేసే తోటకూర
శరీరం డిటాక్స్ చేసే తోటకూర (Shutterstock)

ఎర్ర తోటకూరనే చౌలీ సాగ్ అని అంటారు. దీంట్లో లూసానిస్ అనే ప్రొటీన్ ఉంటుంది. ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దీనికి ప్రొ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉంటాయి. ఇనుము, కాల్షియం, పొటాషియం, విటమిన్లు ఎ, సి , కె అధికంగా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వీటిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి కణాలను డిటాక్స్ చేయడానికి, దెబ్బతినకుండా రక్షించడానికి సహాయపడతాయి.

ముల్లంగి ఆకుకూర:

ముల్లంగి ఆకు కూర
ముల్లంగి ఆకు కూర (Shutterstock)

ముల్లంగి తింటాం కానీ దాని ఆకులు తింటారని కూడా చాలా మందికి తెలీదు. ఈసారి ముల్లంగితో పాటూ వచ్చే ఆకుల్ని పడేయకుండా తెచ్చేసుకోండి. దాంట్లో అధిక పోషకాలుంటాయి. విటమిన్ సి, కాల్షియం, ఇనుము, భాస్వరం లాంటి మినరళ్లకు అద్భుతమైన ఆహారం ఇది. జీర్ణక్రియ మెరుగుపర్చడంలో, శరీరం డిటాక్స్ చేయడంలో ఇవి సాయపడతాయి. అధికంగా యాంటీఆక్సిడెంట్లు ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి.

తమలపాకులు:

 

తమలపాకులు
తమలపాకులు (Shutterstock)

సున్నం పోకలు వేసుకుని పచ్చిగా నమిలేసే తమలపాకులు తెలుసు కదా. ఆహారం తర్వాత వీటిని తింటే జీర్ణశక్తి పెరుగుతుంది. యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు సి, ఎ, కాల్షియం, థయామిన్లతో నిండిన ఈ ఆకులు నోటి ఆరోగ్యాన్ని కాపాడతాయి. శ్వాస తాజాగా చేయడానికి ఉపయోగపడతాయి. అయితే వీటిని ఎక్కువగా తింటే నోటి పొర దెబ్బతింటుందని మర్చిపోకండి.

Whats_app_banner