తమలపాకు నీరు మధుమేహ వ్యాధిగ్రస్తుల శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ నీటిని తాగవచ్చు.

Unsplash

By Anand Sai
Mar 23, 2024

Hindustan Times
Telugu

తమలపాకు నీరు ఆహారం జీర్ణం కావడానికి సహాయపడుతుంది. తమలపాకులను నీళ్లలో మరిగించి తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Unsplash

తమలపాకు నీరు జలుబు, దగ్గుకు మంచిది. ఇది కఫా, పిత్త దోషాలను తగ్గిస్తుంది.

Unsplash

3-4 తమలపాకులను కడిగి మూడు గ్లాసుల నీటిలో బాగా మరిగించి, ఒక గ్లాసు మిగిలి ఉన్నప్పుడు, అది చల్లారిన తర్వాత రోజుకు రెండు మూడు సార్లు తాగాలి.

Unsplash

ప్రస్తుతం చాలా మంది మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారు. తమలపాకు నీళ్ళు తాగడం వల్ల మలబద్ధకం నుంచి బయటపడవచ్చు.

Unsplash

వాంతులు, విరేచనాలు, వికారం వంటి సమస్యలు ఉంటే తమలపాకు నీరు కూడా మేలు చేస్తుంది. ఈ నీరు మన జీర్ణ శక్తిని సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది.

Unsplash

తమలపాకులతో చేసిన నీరు నోటి దుర్వాసనను దూరం చేస్తుంది. అంతేకాదు దంతాలను పాలిష్ చేయడంలో సహాయపడుతుంది.

Unsplash

తమలపాకుల నీటిని రోజు తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.

Unsplash

SRH vs DC: సన్‍రైజర్స్ సృష్టించిన నయా రికార్డులు ఇవే

Photo: AFP