Lotus Tea: బీపీని తగ్గించుకోవాలా? ప్రతిరోజూ ఉదయం లోటస్ టీ తాగండి-how to lower bp drink lotus tea every morning ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Lotus Tea: బీపీని తగ్గించుకోవాలా? ప్రతిరోజూ ఉదయం లోటస్ టీ తాగండి

Lotus Tea: బీపీని తగ్గించుకోవాలా? ప్రతిరోజూ ఉదయం లోటస్ టీ తాగండి

Haritha Chappa HT Telugu
Aug 03, 2024 07:00 AM IST

Lotus Tea: ఆయుర్వేదం ప్రకారం, తామర పువ్వు టీ ఉత్తమ ఔషధంగా చెప్పుకుంటారు. తామర పువ్వులతో చేసిన టీ తాగడం వల్ల జ్వరం, తలనొప్పి, చికాకు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

లోటస్ ఫ్లవర్ టీ రెసిపీ
లోటస్ ఫ్లవర్ టీ రెసిపీ (shutterstock)

మనదేశంలో ఎంతో మంది ఉదయానే లేచిన వెంటనే తాగే పానీయం ‘టీ’. ఇది ఉదయాన్నే ఉత్సాహాన్ని ఇచ్చేందుకు, అలసటను తొలగించడానికి తేనీరు పనిచేస్తుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా, గ్రీన్ టీ, బ్లాక్ టీ వంటి టీలు వాడుకలోని వచ్చాయి. ఇప్పుడు మరొక టీ కూడా ట్రెండింగ్ లో ఉంది. అదే లోటస్ ఫ్లవర్ టీ. ఆయుర్వేదం ప్రకారం, తామర పువ్వులలో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఇనుము, భాస్వరం, క్లోరిన్ వంటి అనేక రకాల ఖనిజాలతో పాటు యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. అంతే కాదు, తామర పువ్వులు కార్బోహైడ్రేట్లు, ఫైబర్ నిండి ఉంటాయి.

తామర పువ్వులను ఆయుర్వేదంలో ఉత్తమ ఔషధంగా వినియోగిస్తారు. తామర పువ్వులతో చేసిన టీ తాగడం వల్ల జ్వరం, తలనొప్పి, చికాకు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. తామర పువ్వులతో తయారు చేసిన టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు, దాని తయారీకి సరైన మార్గం ఏమిటో ఆయుర్వేద నిపుణురాలు దీక్షా భావ్సర్ చెబుతున్నారు. లోటస్ ఫ్లవర్ టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకోండి.

గుండె ఆరోగ్యం

తామర పువ్వులో ఉండే విటమిన్ బి, సి, ఐరన్ వంటి పోషకాలు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. కార్డియాక్ అరెస్ట్ వంటి గుండె సంబంధిత సమస్యలలో లోటస్ టీ టానిక్ గా పనిచేస్తుందని డాక్టర్ దీక్షా భావ్సర్ తెలిపారు.

తామర పువ్వుతో తయారు చేసిన టీ రక్తపోటును నియంత్రించడంలో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ టీని క్రమం తప్పకుండా తాగడం ద్వారా హైబీపీ సమస్యను నియంత్రించవచ్చు. అయితే లో బీపీతో ఇబ్బంది పడుతుంటే నిపుణుల సలహా మేరకే తీసుకోవాలి.

తామర పువ్వులో ఉండే అపోమోర్ఫిన్ , న్యూసిఫెరిన్ అనే పోషకాలు ఒత్తిడి, నిరాశ, ఆందోళనను ఎదుర్కోవడంలో సహాయపడతాయి. తామర పువ్వుతో చేసిన టీని క్రమం తప్పకుండా తాగడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

దాహాన్ని నియంత్రిస్తుంది

అధిక దాహంతో బాధపడేవారికి లోటస్ టీ కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. లోటస్ టీలో ఉండే పోషకాలు దాహం తీర్చడంలో సహాయపడతాయి. లోటస్ ఫ్లవర్ టీ శరీర ఉష్ణోగ్రతను చల్లగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది.

పీరియడ్స్ నొప్పికి

పీరియడ్స్ సమయంలో చాలా నొప్పి, తిమ్మిరి ఉన్న మహిళలకు తామర పువ్వులతో తయారు చేసిన టీ ప్రయోజనకరంగా ఉంటుంది. పీరియడ్స్ సమయంలో రోజూ 2 కప్పుల ఈ టీ తాగితే ఉపశమనం లభిస్తుంది.

లోటస్ టీ రెసిపీ

తామర పువ్వులతో టీ తయారు చేయడానికి, ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాసు నీటిని మరిగించండి. ఇప్పుడు ఈ మరుగుతున్న నీటిలో తామర పువ్వులు వేసి కాసేపు ఉడికించాలి. ఇలా చేసేటప్పుడు నీరు, తామర పువ్వుల నిష్పత్తిని 4:1గా ఉంచాలి. దీని తరువాత, ఈ టీని 2 గంటలు చల్లబరచడానికి పక్కన ఉంచండి. ఈ నీటి మిశ్రమం చల్లారిన తర్వాత వడగట్టి అందులో కొద్దిగా గులాబీ సారాన్ని కలపాలి. రుచికరమైన లోటస్ టీ రెడీ అయినట్టే. కావాలనుకుంటే ఈ టీలో తేనె కలుపుకుని తాగితే రుచిగా ఉంటుంది.

టాపిక్