Health Symptoms:ఈ లక్షణాలు కనిపిస్తే తేలికగా తీసుకోకండి, ఇవి గుండెపోటు, క్యాన్సర్ వంటి వ్యాధులకు ముందు కనిపించే సంకేతాలు-do not take it lightly if you see these symptoms they are early signs of diseases like heart attack and cancer ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Health Symptoms:ఈ లక్షణాలు కనిపిస్తే తేలికగా తీసుకోకండి, ఇవి గుండెపోటు, క్యాన్సర్ వంటి వ్యాధులకు ముందు కనిపించే సంకేతాలు

Health Symptoms:ఈ లక్షణాలు కనిపిస్తే తేలికగా తీసుకోకండి, ఇవి గుండెపోటు, క్యాన్సర్ వంటి వ్యాధులకు ముందు కనిపించే సంకేతాలు

Haritha Chappa HT Telugu
Jul 25, 2024 01:00 PM IST

Health Symptoms: క్యాన్సర్, డయాబెటిస్, గుండెపోటు రావడానికి ముందు కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు శరీరం ఎక్కువ కాలంపాటే చూపిస్తాయి. ఈ సంకేతాలు పెద్ద వ్యాధికి సంకేతం కావచ్చు.

ఈ లక్షణాలు పెద్ద వ్యాధులకు సంకేతాలు
ఈ లక్షణాలు పెద్ద వ్యాధులకు సంకేతాలు (shutterstock)

శరీరంలో ఏదైనా అనారోగ్యం బారిన పడడానికి ముందే కొన్ని రకాల మార్పులు జరుగుతాయి. ఆ మార్పులు తాలూకు లక్షణాలు శరీరం బయటపెడుతుంది. ఇవి తేలికపాటివే అయినా విస్మరించకూడనివి. వీటిని తేలికగా తీసుకుంటే భవిష్యత్తులో పెద్ద ఆరోగ్య సమస్య బయటపేడ అవకాశం ఉంది. ముఖ్యంగా క్యాన్సఱ్, డయాబెటిస్, గుండెపోటు వంటివి రావడానికి ముందే కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. ఆ లక్షణాలేంటో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. వాటిని చాలా కాలం నిర్లక్ష్యం చేస్తే క్యాన్సర్, మధుమేహం, గుండెపోటు వంటి ప్రాణాంతక సమస్యల రూపంలోకి మారుతుంది.

చర్మంలో మార్పులు

చర్మ మార్పులు అనేక వ్యాధులను సూచిస్తుంది. డయాబెటిస్ సమస్య శరీరంలో మొదలైనా కూడా చర్మంపై దద్దుర్లు, ఎరుపు, ఊదా రంగు మచ్చలు ఏర్పడతాయి. చర్మంపై గాయాలు త్వరగా నయం కావు. అదేవిధంగా స్కిన్ క్యాన్సర్ రావడానికి ముందు కూడా చర్మంపై పుట్టుమచ్చలు, మొటిమల్లో మార్పు వస్తాయి. ఒక్కోసారి చర్మం రంగు కూడా మారుతుంది. ఇలా లక్షణాలు కనిపిస్తే ఎంతో మంటి తేలికగా తీసుకుంటారు. చర్మానికి సంబంధించిన సమస్య కదా అనుకుంటారు. కానీ ఇది భవిష్యత్తులో స్కిన్ క్యాన్సర్ సమస్యను బయటపెట్టవచ్చు.

నిద్రలేమి

కొంతమంది ప్రతిరోజూ నిద్రలేమితో బాధపడతారు. పడుకున్న వెంటనే నిద్రపట్టదు. ఎంతో కాలం పాటూ ఇలా నిద్రలేమితో బాధపడుతుంటే తేలికగా తీసుకోకండి. ఇది గుండె ఆరోగ్యానికి సంబంధించింది. ఈ సమస్యను ఇలాగే వదిలేస్తే భవిష్యత్తులో గుండె సమస్యలు బయటపడతాయి. కాబట్టి నిద్ర సమస్యలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.

జీర్ణక్రియలో సమస్యలు

పొట్ట ఉబ్బరం, ఎసిడిటీ, పొట్ట సమస్యలు, గుండెల్లో మంట వంటి సమస్యలు చాలా కాలంగా కొంతమందిని వేధిస్తూ ఉంటాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా తగిన చికిత్స తీసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ సమస్యలన్నీ దీర్ఘకాలంలో పెద్దప్రేగు లేదా మూత్రాశయ క్యాన్సర్ లక్షణాలు కావచ్చు.

తీపి తినాలనే కోరిక

ఎప్పుడూ తీపి తినాలనే కోరిక పెరుగుతుంటే దాన్ని తొలగించడానికి ఐరన్, జింక్ వంటి పోషకాలు తీసుకోవడం ప్రారంభించాలి. ఇలా తీపి తినే కోరిక పెరిగితే డయాబెటిస్ వచ్చే అవకాశం పెరుగుతుంది.

గది ఉష్ణోగ్రత నార్మల్ గా ఉన్న తర్వాత కూడా రాత్రి పడుకునేటప్పుడు ఎక్కువగా చెమటలు పట్టడం, బట్టలన్నీ తడిసిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇవి లుకేమియా, లింఫోమా వంటి క్యాన్సర్ల లక్షణాలు కావచ్చు. ముఖ్యంగా జ్వరం వచ్చినప్పుడు చెమటతో పాటు బరువు తగ్గుతారు. ఇలా జరిగినప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే చికిత్స తీసుకోవాలి.

పైన చెప్పినవన్నీ తేలికపాటి లక్షణాలే కావచ్చు, కానీ అలా వదిలేస్తే అవి భవిష్యత్తులో అది పెద్ద ఆరోగ్యసమస్యలకు కారణం అవుతాయి. కాబట్టి పైన చెప్పిన లక్షణాలు మీకు కనిపిస్తే ముందుగా వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం మంచిది.

Whats_app_banner