Acidity: గుండెల్లో మంటతో ఎసిడిటీ వచ్చినట్టు అనిపిస్తే వెంటనే ఈ పండును తినండి, ఏ ట్యాబ్లెట్ వేయాల్సిన అవసరం రాదు-if you feel acidity with heartburn eat this fruit immediately no need to take any tablet ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Acidity: గుండెల్లో మంటతో ఎసిడిటీ వచ్చినట్టు అనిపిస్తే వెంటనే ఈ పండును తినండి, ఏ ట్యాబ్లెట్ వేయాల్సిన అవసరం రాదు

Acidity: గుండెల్లో మంటతో ఎసిడిటీ వచ్చినట్టు అనిపిస్తే వెంటనే ఈ పండును తినండి, ఏ ట్యాబ్లెట్ వేయాల్సిన అవసరం రాదు

Haritha Chappa HT Telugu

Acidity: ఆహారం తిన్న తర్వాత గుండెల్లో మంట, ఎసిడిటీ పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ట్యాబ్లెట్లు, గ్యాస్టిక్ సిరప్ వంటివి వాడుతారు. అన్నవాహికలో యాసిడ్ రిఫ్లక్స్ వల్ల ఈ సమస్య వస్తుంది. దీనికి ఎలాంటి మందులు వాడకుండా ఒక అరటి పండు తింటే చాలు. సమస్య తగ్గుతుంది.

ఎసిడిటీ (shutterstock)

గుండెల్లో మంట, ఎసిడిటీ సమస్య చాలా మందిని వేధిస్తుంది. ఆహారం తిన్నాక ఇలాంటి సమస్యలు కొందరిలో బయటపడుతూ ఉంటాయి. ఇలాంటి యాంటాసిడ్ మాత్రలు తింటారు. అలాగే గ్యాస్టిక్ సిరప్‌లు కూడా వాడుతారు. ఇలా నిత్యం మందులు వాడడం మంచిది కాదు. వాటి వల్ల సమస్య తగ్గినా… ఈ యాంటాసిడ్లు మీ పొటలో ఉన్న సహజ ఆమ్లాన్ని తొలగించడం ప్రారంభిస్తాయి. దీనివల్ల ఈ సమస్య రోజురోజుకూ పెరుగుతుంది. కాబట్టి మీకు గ్యాస్టిక్ సమస్యలు ఉన్నా, గుండెల్లో మంటగా అనిపిస్తున్నా, ఎసిడిటీ ఉన్నా వెంటనే ఒక అరటి పండు తినేయండి. సమస్య కొన్ని క్షణాల్లో తగ్గుతుంది. ముఖ్యంగా ఛాతీలో మంటను ఈ పండు సులువుగా తొలగిస్తుంది.

గుండెల్లో మంట లక్షణాలు ఏమిటి?

గుండెల్లో మంట తీవ్రంగా వస్తుంది. దీనికి కారణం అన్నవాహికలో యాసిడ్ రిఫ్లక్స్. అంటే అన్నవాహికలోకి ఆమ్లాలు వెనక్కి ఎగదన్నడం వల్ల వచ్చే సమస్య. గుండెల్లో మంట సమస్య గొంతు, ఛాతీ… రెండింటిలో కూడా సంభవిస్తుంది. ముఖ్యంగా పడుకున్నప్పుడు ఈ సమస్య పెరుగుతుంది. ఆహారం తిన్న తర్వాత లేదా ఆలస్యంగా భోజనం చేసినా, తిన్నాక వెంటనే పడుకునకనా ఈ సమస్య వస్తుంది. అలాగే స్పైసీ ఫుడ్ తింటే పొట్టలో జీర్ణం కాదు. దీని వల్ల ఛాతీలో మంటగా ఉంటుంది.

గుండెల్లో మంట సమస్య మీకు ఉంటే వెంటనే అరటిపండ్లు తినండి. అరటిపండులో నేచురల్ యాంటాసిడ్లు, పొటాషియం ఉంటాయి. ఇది పొట్ట ఆమ్లాన్ని తటస్థం చేయడానికి సహాయపడుతుంది. దీనివల్ల అన్నవాహిక పొర రిలాక్స్ అవుతుంది.

గుండెల్లో మంట ఉన్న ప్రతి ఒక్కరికీ అరటిపండు తినడం వల్ల ఉపశమనం లభిస్తుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీని కోసం, సమతుల్య ఆహారంలో పండిన అరటిపండ్లు తినడం చాలా ముఖ్యం.

అతిగా తినడం లేదా స్పైసీ ఫుడ్ వల్ల ఛాతీలో చికాకుగా అనిపిస్తుంది. ఇలాంటి సమస్య వేధిస్తుంటే నిమ్మకాయ గుండెల్లో మంటను కూడా తొలగిస్తుంది. అందుకోసం నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగితే ఉపశమనం లభిస్తుంది. నిమ్మకాయ గుండెల్లో మంట సమస్యను తగ్గిస్తుంది

అరటి పండు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఇది ఎన్నో పోషకాలను కలిగి ఉంటాయి. కాబట్టి యాసిడ్ రిఫ్లక్స్ వచ్చినా రాకపోయినా కూడా రోజుకో అరటి పండు తినడం అలవాటు చేసుకుంటే మంచిది. అరటి పండు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. విటమిన్ సి, పొటాషియం, విటమిన్ బి6, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి రక్తపోటును తగ్గించి, జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. అరటి పండులో ఉంటే పొటాషియం గుండెను పదిలంగా కాపాడుతుంది. ఇందులో ఉండే కార్బోహైడ్రేట్లు శరీరానికి వెంటనే శక్తినిస్తాయి. అరటి పండు ప్రతి రోజూ ఒకటి తినడం వల్ల కొలెరెక్టల్ క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుంది.