Weightloss Tips: రోజుకో స్పూను దేశీ నెయ్యితో ఇలా వేగంగా బరువు తగ్గవచ్చు, ఇలా చేయండి
Weightloss Tips: దేశీ నెయ్యి పేరు వింటేనే బరువు పెరిగిపోతామన్న భయం మొదలైపోతుంది. బరువు తగ్గే సమయంలో దీనిని ఉపయోగించరు కూడా. నిజానికి దేశీ నెయ్యి సహాయంతో బరువు తగ్గడం సులువవుతుంది.
దేశీ నెయ్యి పేరు చెబితేే చాలు ఎంతో మందికి నోరూరిపోతుంది. వేడివేడి అన్నంలో పప్పు, ఈ నెయ్యి కలుపుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. దేశీ నెయ్యిని పప్పులో కలిపితే దాని సువాసన వంటగదితో పాటు ఇల్లంతా వ్యాపిస్తుంది. దేశీ నెయ్యి చాలా రుచికరమైనది, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే ఇందులో కొవ్వు ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో కొవ్వు పెరుగుతుందన్న భయం ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా, ఎంతో మంది ఆహారంలో నెయ్యి నూనె వాడకాన్ని తగ్గించారు. అయితే దేశీ నెయ్యిలో కొవ్వు ఎక్కువగా ఉన్నప్పటికీ దాని సహాయంతో బరువును తగ్గించుకోవచ్చు. దీన్ని తినే పద్ధతిలో తింటే ఎంతో ఉపయోగం ఉంటుంది.
కొవ్వును కరిగిస్తుంది
నెయ్యిలో ఉండే కాంజుగేటెడ్ లినోలెయిక్ యాసిడ్ (సీఎల్ఏ) ప్రధానంగా కొవ్వును కరిగించే విధంగా పనిచేస్తుంది. ఈ విషయం అనేక అధ్యయనాల్లో కూడా రుజువైంది. రోజూ నెయ్యి తినడం వల్ల శరీరంలోని మొండి కొవ్వు విచ్ఛిన్నమై కొత్త కొవ్వు కణాలు ఏర్పడటం ఆగిపోతుంది. ఈ విధంగా రోజువారీ ఆహారంలో నెయ్యిని చేర్చుకోవడం ద్వారా బరువును అదుపులో ఉంచుకోవచ్చు. నెయ్యిని తక్కువగా తీసుకోవడం ద్వారా బరువును తగ్గించుకోవచ్చు, ఎక్కువగా తీసుకోవడం వల్ల మాత్రం కొవ్వు పెరిగిపోతుంది.
స్వచ్ఛమైన ఇంట్లో తయారుచేసిన నెయ్యిలో లినోలెయిక్ ఆమ్లం, సంతృప్త కొవ్వు పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరం జీవక్రియను వేగవంతం చేయడం ద్వారా మొండి కొవ్వును తగ్గించడానికి పనిచేస్తుంది. పప్పు, రోటీతో పాటు కొంత మొత్తంలో నెయ్యిని క్రమం తప్పకుండా తింటే శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. నెయ్యి తినడం వల్ల మలబద్దకం సమస్య తొలగిపోతుంది. హానికరమైన పదార్థాలు శరీరం నుండి బయటకు వస్తాయి. బరువును కూడా తగ్గిస్తాయి
నెయ్యి తినడం వల్ల పొట్ట ఎక్కువ సేపు నిండుగా ఉన్నట్టు ఉంటుంది. ఇతర ఆహారాలేవీ తినాలనిపించదు. నెయ్యిలో పుష్కలంగా పోషకాలు లభిస్తాయి. ఆహారంలో నెయ్యి చేర్చడం వల్ల కడుపు ఎక్కువసేపు నిండుగా ఉండి తరచూ ఆకలి అనిపించదు. నెయ్యిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వు శరీరానికి శక్తిని అందిస్తూనే ఉంటుంది. నిరంతర శక్తి అందుతూనే ఉంటుంది… కాబట్టి అనవసరమైన స్నాక్స్ తినాలన్న కోరిక కలగదు. అలాగే ఎక్కువసేపు ఆకలి లేకపోవడం వల్ల మధ్యలో ఏమీ తినకుండా ఉంటారు. దీనివల్ల ఆరోగ్యంగా బరువు తగ్గుతారు.
ఇలా తినండి
మీరు బరువు తగ్గడానికి దేశీ నెయ్యిని ఉపయోగించాలని ఆలోచిస్తుంటే, మీరు దీనిని అనేక విధాలుగా మీ ఆహారంలో భాగం చేసుకోవచ్చు. ప్రతిరోజూ ఉదయం లేచి గోరువెచ్చని నీటిలో ఒక టీస్పూన్ నెయ్యి కలుపుకుని తాగడం వల్ల ఊబకాయం తగ్గుతుంది. దీనితో పాటు, మీరు మీ రోజువారీ వంటలో నెయ్యిని కూడా ఉపయోగించవచ్చు. మీకు టీ లేదా కాఫీ తాగడం ఇష్టమైతే అందులో ఒక చెంచా నెయ్యి మిక్స్ చేసి తాగొచ్చు. కానీ మేము ఇంతకు ముందు చెప్పినట్లుగా, ఇది అతిగా తినకూడదని గుర్తుంచుకోండి.
టాపిక్