Egg Tadka Masala: ఎగ్ తడ్కా మసాలా, కోడిగుడ్డు పప్పులతో చేసే ఈ వేపుడు టేస్టీగా ఉంటుంది-egg tadka masala recipe in telugu know how to make this curry ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Egg Tadka Masala: ఎగ్ తడ్కా మసాలా, కోడిగుడ్డు పప్పులతో చేసే ఈ వేపుడు టేస్టీగా ఉంటుంది

Egg Tadka Masala: ఎగ్ తడ్కా మసాలా, కోడిగుడ్డు పప్పులతో చేసే ఈ వేపుడు టేస్టీగా ఉంటుంది

Haritha Chappa HT Telugu
Jul 03, 2024 11:47 AM IST

Egg Tadka Masala: కోడిగుడ్డు, పెసరపప్పు, శనగపప్పు కలిపి చేసే టేస్టీ వంటకం ఎగ్ తడ్కా మసాలా. దీన్ని చూస్తేనే నోరూరిపోతుంది. అన్నంలో కలుపుకుని తింటే రుచిగా ఉంటుంది. రెసిపీ చాలా సులువు.

ఎగ్  తడ్కా రెసిపీ
ఎగ్ తడ్కా రెసిపీ

Egg Tadka Masala: కోడిగుడ్డుతో చేసిన వంటకాలు టేస్టీగా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ఇక్కడ మేము ఈ ఎగ్ తడ్కా మసాలా రెసిపీ ఇచ్చాము. దీనిలో కోడిగుడ్డుతో పాటు పెసరపప్పు, శనగపప్పు వేసి వండుతారు. ఇది రుచిగా ఉండటమే కాదు ఆరోగ్యాన్నిఅందిస్తుంది. ఇది చపాతీలోకి, రోటీలోకి, అన్నంలోకి బాగుంటుంది. దీన్ని చేయడం చాలా సులువు. ఒకసారి చేసుకున్నారంటే ఈ రెసిపీని తరచూ తినాలనిపించే ఎలా ఉంటుంది.

ఎగ్ తడ్కా రెసిపీకి కావాల్సిన పదార్థాలు

కోడిగుడ్లు - రెండు

సెనగపప్పు - పావు కప్పు

పెసర పప్పు - అరకప్పు

పసుపు - అర స్పూను

జీలకర్ర పొడి - అర స్పూను

ధనియాల పొడి - ఒక స్పూను

గరం మసాలా - అర స్పూను

అల్లం తరుగు - ఒక స్పూను

పచ్చిమిర్చి - రెండు

బటర్ - రెండు స్పూన్లు

బిర్యానీ ఆకు - ఒకటి

ఉల్లిపాయ - ఒకటి

వెల్లుల్లి తరుగు - ఒక స్పూను

నూనె - సరిపడినంత

ఉప్పు - రుచికి సరిపడా

కారం - ఒక స్పూను

ఎగ్ తడ్కా రెసిపీ

1. పెసరపప్పు, శనగపప్పుని మూడు గంటల ముందే నానబెట్టుకోవాలి.

2. తర్వాత కుక్కర్లో వేసి రెండు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి.

3. ఇందులో పెసరపప్పు మెత్తగా ఉడికేస్తుంది. శనగపప్పు మాత్రం ఎనభై శాతం ఉడికితే చాలు.

4. ఇప్పుడు ఒక గిన్నెలో గుడ్లను కొట్టి ఉప్పు వేసి బాగా గిలక్కొట్టాలి.

5. స్టవ్ మీద పెనం పెట్టి నూనె వేయాలి. ఈ గుడ్లను ఆమ్లెట్ మాదిరి వేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి.

6. ఆ ఆమ్లెట్లో చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి.

7. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె, బటర్ వేయాలి.

8. అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు వేసి వేయించుకోవాలి.

9. ఆ తర్వాత పచ్చిమిర్చి తరుగును కూడా వేసుకోవాలి.

10. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, టమాటో తరుగు, జీలకర్ర పొడి, ధనియాలపొడి, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి.

11. ఈ మిశ్రమం టమాటా మెత్తగా అవుతుంది.

12. అప్పుడు పప్పులను వేసుకొని కలుపుకోవాలి.

13. ఆ తర్వాత ముందుగా ముక్కలు కోసి పెట్టుకున్నా ఆమ్లెట్లను కూడా వేసి కలుపుకోవాలి.

14. కసూరి మేతిని వేసి అది దగ్గరగా పొడిపొడిగా అయ్యేవరకు చిన్న మంట మీద ఉడికించాలి. అంతే టేస్టీ ఎగ్ తడ్కా మసాలా రెడీ అయినట్టే.

పిల్లలకు, పెద్దలకు ఇది బాగా నచ్చే రెసిపీ. కోడుగుడ్డు, పెసరపప్పు, శనగపప్పు ఈ మూడు కూడా ఆరోగ్యానికి మేలు చేసేవే. దీనిలో పొటాషియం, జింక్, విటమిన్ ఈ, ఐరన్ అధికంగా ఉంటాయి. ఇది ప్రోటీన్లు, క్యాలరీలను పుష్కలంగా అందిస్తుంది. కాబట్టి వారానికి ఒక్కసారైనా ఈ రెసిపీని పెద్దలు, పిల్లలు తినడం చాలా అవసరం. దీన్ని చేయడం చాలా సులువు. ఇది అన్నంలో తిన్నా చపాతీ, రోటీల్లో తిన్నా రుచిగానే ఉంటుంది. కాస్త ఉప్పు తక్కువగా వేసుకొని కేవలం ఈ కూరనే తినేసినా కూడా మంచిదే.

Whats_app_banner