Coconut Chutney: మూడు పప్పులు కలిపి ఇలా కొబ్బరి పచ్చడి చేస్తే అన్నంలో అదిరిపోతుంది-coconut chutney with dals recipe in telugu know how to make this pachadi ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Coconut Chutney: మూడు పప్పులు కలిపి ఇలా కొబ్బరి పచ్చడి చేస్తే అన్నంలో అదిరిపోతుంది

Coconut Chutney: మూడు పప్పులు కలిపి ఇలా కొబ్బరి పచ్చడి చేస్తే అన్నంలో అదిరిపోతుంది

Haritha Chappa HT Telugu
May 08, 2024 05:30 PM IST

Coconut Chutney: కొబ్బరి పచ్చడి ఎప్పుడూ ఒకేలా చేస్తే టేస్టీగా ఉండదు. పప్పులను కూడా జత చేసి రుబ్బితే రుచి అదిరిపోతుంది. మూడు పప్పుల కొబ్బరి పచ్చడి ఎలా చేయాలో తెలుసుకోండి.

కొబ్బరి చట్నీ రెసిపీ
కొబ్బరి చట్నీ రెసిపీ

Coconut Chutney: కొబ్బరి పచ్చడి పేరు వింటేనే నోరూరిపోతుంది. వేడివేడి అన్నంలో ఈ కొబ్బరి పచ్చడి వేసుకొని తింటే ఆ రుచే వేరు. కొబ్బరి పచ్చడి ఎప్పుడూ ఒకేలా చేసే కన్నా... కొత్తగా పప్పులను కలిపి చేసి చూడండి. ఇది కొత్త రుచిని అందిస్తుంది. అలాగే పోషకాలు అధికంగా ఉంటాయి. దోశలోకి, ఇడ్లీలోకి, అన్నంలోకి కూడా ఈ పచ్చడి పనికొస్తుంది. దీన్ని చేయడం చాలా సులువు. ఎలా చేయాలో ఇక్కడ మేము చెప్పాము. ఫాలో అయిపోండి.

కొబ్బరి పచ్చడి రెసిపీకి కావలసిన పదార్థాలు

పచ్చి కొబ్బరి - ముప్పావు కప్పు

పెసరపప్పు - పావు కప్పు

శెనగపప్పు - పావు కప్పు

మినప్పప్పు - పావు కప్పు

వెల్లుల్లి రెబ్బలు - 10

పచ్చిమిర్చి - ఐదు

ఎండుమిర్చి - నాలుగు

నూనె - నాలుగు స్పూన్లు

ధనియాలు - అర స్పూను

జీలకర్ర - పావు స్పూను

చింతపండు - నిమ్మకాయ సైజులో

నీరు - తగినంత

ఉప్పు - రుచికి సరిపడా

కరివేపాకులు - గుప్పెడు

ఇంగువ - చిటికెడు

కొబ్బరి పచ్చడి రెసిపీ

1. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

2. ఆ నూనెలో ఎండుమిర్చి, పచ్చి మిర్చి రెండింటినీ వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.

3. ఇప్పుడు అదే నూనెలో శెనగపప్పు, మినప్పప్పు, పెసరపప్పు వేసి వేయించాలి.

4. ఈ మూడు బాగా వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి.

5. ఇప్పుడు అదే కళాయిలో ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకోవాలి.

6. అందులోనే పచ్చికొబ్బరిని ముక్కలుగా కోసి వేయించాలి.

7. జీలకర్రను కూడా వేసి వేయించుకోవాలి.

8. ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా ఎండుమిర్చి, చింతపండు వేసి ఒకసారి రుబ్బుకోండి.

9. ఆ మిశ్రమంలోనే ముందుగా వేయించి పెట్టుకున్న పప్పులు, కొబ్బరి ముక్కలు వేసి రుబ్బుకోండి.

10. అవసరమైనంత మేరకు నీటిని వేసుకోండి.

11. వీటన్నింటినీ మెత్తగా రుబ్బుకుంటే పచ్చడి సిద్ధమవుతుంది.

12. ఆ మొత్తం మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసి వేసుకోండి.

13. ఆ పచ్చడికి తాళింపు పెట్టేందుకు స్టవ్ మీద కళాయి పెట్టాలి.

14. నూనె వేసి అందులో ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర, ఇంగువ, కరివేపాకులు, చిటికెడు పసుపు కూడా వేసి వేయించుకోండి.

15. ఈ మొత్తం మిశ్రమాన్ని పచ్చడి పైన వేయండి. అంతే టేస్టీ కొబ్బరి పచ్చడి రెడీ అయిపోతుంది.

16. సాధారణ కొబ్బరి పచ్చడితో పోలిస్తే ఈ కొబ్బరి పచ్చడి టేస్ట్ రుచిగా ఉంటుంది. దీనిలో మనం మూడు రకాల పప్పులను వేసాము. కాబట్టి వాటిలోని పోషకాలు, రుచి కూడా ఈ పచ్చడిలో కనిపిస్తాయి.

మూడు పప్పులతో చేసిన కొబ్బరి పచ్చడి అన్నంలో, దోశలో, ఇడ్లీలో తినవచ్చు. ఒకసారి చేసుకుంటే రెండు రోజులు పాటు ఇది తాజాగా ఉంటుంది. వేడివేడి అన్నంలో ఈ స్పైసి కొబ్బరి పచ్చడి వేసుకొని తింటే ఆ రుచే వేరు. వేరుశనగపప్పు, మినప్పప్పు, పెసరపప్పుల్లోని పోషకాలు అన్నీ ఈ పచ్చడిలోనూ చేరుతాయి. ఒక్కసారి మీరు దీన్ని చేసుకొని తిని చూడండి. ఇంటిల్లిపాదికి చాలా నచ్చేస్తుంది.

WhatsApp channel

టాపిక్