Chitranna Recipe : చింతపండుతో చిత్రాన్న.. సింపుల్‌గా.. టేస్టీగా
Chitranna Recipe In Telugu : కర్ణాటక స్టైల్ చిత్రాన్న రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. చేయడం కూడా చాలా ఈజీ. త్వరగా అయిపోతుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.
చిత్రాన్న కర్ణాటకలోని అతి ముఖ్యమైన రెసిపీల్లో ఒకటి. చాలా ఇళ్లలో కనీసం వారానికి ఒకసారి చిత్రాన్న ఉంటుంది. ముఖ్యంగా పనికి బయటకు వెళ్లే వారు ఇది వెంటనే చేసుకుని తినేస్తారు. ఈ చిత్రాన్నను అనేక రుచులలో తయారుచేస్తారు. ఇది మనం కొంచెం డిఫరెంట్‌గా చేయెుచ్చు. చింతపండుతో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది.
చిత్రాన్నకు కావాల్సిన పదార్థాలు
1/2 కప్పు తురిమిన కొబ్బరి, 1/2 tsp ఆవాలు, 2 ఎండు మిరపకాయలు, 1/2 tsp పసుపు పొడి, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు, కొన్ని కరివేపాకు, 2 టేబుల్ స్పూన్లు చింతపండు, 1/2 టేబుల్ స్పూన్లు బెల్లం, 1/2 టేబుల్ స్పూన్లు ఉప్పు, బియ్యం (2 కప్పులు వండిన అన్నం)
చిత్రాన్న తయారీ విధానం
ముందుగా కొబ్బరి తురుము, 1/2 చెంచా ఆవాలు, 2 ఎండు మిరపకాయలు, కొంచెం చింతపండు రసం వేసి గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు పాన్ వేడి చేసి 1 టేబుల్ స్పూన్ నూనె వేయాలి.
నూనె వేడి కాగానే అందులో 1 చెంచా ఆవాలు, 1/2 చెంచా మినపప్పు, 1 ఎండు మిర్చి, కొన్ని కరివేపాకు, 2 చెంచాల శనగపప్పు వేయాలి.
తక్కువ మంటలో 2 నిమిషాలు వేయించాలి. ఎక్కువ మంట ఉంటే అది బ్రౌన్ అవుతుంది.
తర్వాత 2 చెంచాల చింతపండు రసం, 1/2 చెంచా బెల్లం, ఉప్పు రుచికి వేసి కలపాలి.
తర్వాత మెత్తగా రుబ్బిన కొబ్బరి మిశ్రమాన్ని వేసి మళ్లీ 2 నిమిషాలు వేయించి, ఆపై అన్నం వేసి కలపాలి. అంతే చిత్రాన్న రెడీగా ఉంది.
రాత్రిపూట కొబ్బరి మసాలా తయారు చేసి, అవసరమైతే ఫ్రిజ్‌లో ఉంచవచ్చు. నిమ్మరసంతో చేసిన చిత్రాన్న కంటే ఈ వంటకం చాలా రుచిగా ఉంటుంది. మామిడి చిత్రాన్న, పుదీనా చిత్రాన్న, అనేక రకాలుగా చేయవచ్చు. ఇది ముఖ్యంగా అల్పాహారంగా, మధ్యాహ్న భోజనంలోకి కూడా తినవచ్చు. రాత్రి అన్నం మిగిలిపోతే కూడా ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు. చట్నీ కాంబినేషన్‌లో కూడా ఎంజాయ్ చేయవచ్చు. శనగపప్పు వేస్తే టేస్ట్ సూపర్ గా ఉంటుంది.