(1 / 7)
అధిక స్థాయిలో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ వంటివి శరీరంలో పేరుకుపోయి బరువు పెరిగిపోతారు. అలాగే వాటి వల్ల గుండెపోటు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అధిక కొవ్వు, అధిక చక్కెర ఆహారాలు శరీరంలోని రక్తప్రవాహంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోవడానికి కారణం అవుతుంది. చురుకైన జీవనశైలిని కలిగి ఉండటం వల్ల కొలెస్ట్రాల్ సమస్యలు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతో పాటు, ఫైబర్, పండ్లు, కూరగాయలు, ఆరోగ్యకరమైన కొవ్వులు తినడం ద్వారా కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.
(2 / 7)
కొలెస్ట్రాల్ అనేది శరీరం ఉత్పత్తి చేసే మైనపు పదార్థం. దీనికి అనేక ముఖ్యమైన విధులు ఉన్నాయి. ఇది శరీరంలో అధికంగా పేరుకుపోతే ఎన్నో సమస్యలు వస్తాయి. ముఖ్యంగా అధిక బరువు బారిన పడతారు. ధూమపానం, మద్యపానాన్ని నివారించడం వల్ల కొలెస్ట్రాల్ నిర్వహణకు సహాయపడుతుంది.
(3 / 7)
వంట చేసేటప్పుడు వెల్లుల్లిని ఉపయోగించే వారి సంఖ్య ఎక్కువే. మీరు కూడా వెల్లుల్లి సూప్ తయారు చేసి తాగవచ్చు. వెల్లుల్లి రసాన్ని 12 వారాల పాటు నిద్రవేళలో తీసుకోండి. దీని వల్ల కొలెస్ట్రాల్ తగ్గే అవకాశం ఉంది.
(4 / 7)
బార్లీలో బీటా గ్లూకాన్ అనే ప్రీబయోటిక్ ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. బార్లీ కిచిడీ, బార్లీ గంజి, బార్లీ సూప్, బార్లీ బ్రెడ్ వంటి అనేక రూపాల్లో దీనిని ఆహారంలో చేర్చవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
(5 / 7)
త్రిఫల ఆయుర్వేదంలో ముఖ్యమైనది. ఇది శరీరంలోని మంటను తగ్గిస్తుంది. శరీరంలోని దాదాపు అన్ని అవయవాలకు సహాయపడుతుంది.
(6 / 7)
సంప్రదాయ పద్ధతిలో మజ్జిగను తయారుచేసుకుని అందులో పసుపు, రాతి ఉప్పు, కరివేపాకు, తురిమిన అల్లం వేసి కలుపుకుని తాగాలి. ప్రతిరోజూ ఒకసారి తాగితే 3 నెలల తర్వాత కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గడం గుర్తిస్తారు.
(7 / 7)
కొలెస్ట్రాల్ ను తొలగించే బెస్ట్ హోం రెమెడీస్ లో ఉసిరికాయ ఒకటి. పన్నెండు వారాల పాటు ఉసిరిని తీసుకుంటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. తాజా ఉసిరి కాయలను వాడండి.
ఇతర గ్యాలరీలు