Sleeping Tips : త్వరగా నిద్రపోయేందుకు 8 చిట్కాలు-heres 8 amazing tips for good sleeping to overcome insomnia ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sleeping Tips : త్వరగా నిద్రపోయేందుకు 8 చిట్కాలు

Sleeping Tips : త్వరగా నిద్రపోయేందుకు 8 చిట్కాలు

HT Telugu Desk HT Telugu
Apr 29, 2023 08:20 PM IST

Sleeping Tips : ఎంత ప్రయత్నించినా కొంతమందికి నిద్ర పట్టదు. నిద్రలేమి అనేది మనిషి ఎదుర్కొనే చెత్త సమస్యల్లో ఒకటి. దీనివల్ల ఆయాసం, అలసట.., ఏ పనిలోనైనా ఏకాగ్రత లేకపోవడం వంటి సమస్యలు వస్తాయి. కొన్ని చిట్కాలు పాటిస్తే.. హాయిగా నిద్రపోవచ్చు.

నిద్ర చిట్కాలు
నిద్ర చిట్కాలు

సరిగా నిద్రపోతే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు(health problems) నుంచి బయటపడొచ్చు. చాలా మంది నిద్రలేమితో బాధపడుతున్నారు. దీనిద్వారా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. కొంతమంది మాత్రలు వేసుకుని నిద్రపోయేందుకు ప్రయత్నిస్తారు. కానీ వీటితో చాలా డేంజర్. ఒత్తిడి(Stress)తో కూడిన జీవితం, ఆహారపు అలవాట్లు(Food Habits) నిద్రలేమికి ప్రధాన కారణాలు. కొన్ని సహజ పద్ధతులను అనుసరించడం వల్ల మంచి నిద్ర(Sleeping) పడుతుంది. సమస్యను పరిష్కరించడానికి కింద కొన్ని మార్గాలు ఉన్నాయి.

నిద్ర మాత్రలు వేసుకునే బదులు కంటి మాస్క్(Eye Mask) వాడటం మంచిది. ఇది మీ నిద్రకు భంగం కలిగించే కాంతి నుండి మిమ్మల్ని దూరంగా ఉంచుతుంది.

డిన్నర్(Dinner) త్వరగా ముగించడం మరో చిట్కా. పడుకునే మూడు గంటల ముందు భోజనం ముగించాలి. దీని వల్ల నిద్రవేళలో తిన్న ఆహారం జీర్ణమవుతుంది.

ఉదయం, రాత్రి పడుకునే ముందు 10-15 నిమిషాల పాటు మెడిటేషన్(Meditation) చేయండి. మెడిటేషన్ చేస్తే ఒత్తిడి తగ్గి నిద్ర వేగంగా వస్తుంది

లావెండర్ ఆయిల్(lavender oil) మనస్సును రిలాక్స్ చేస్తుంది. నిద్రను ప్రోత్సహిస్తుంది. రాత్రి పడుకునే ముందు స్నానం చేసే నీటిలో రెండు చుక్కలు వేసి స్నానం చేయాలి. లావెండర్ ఆయిల్ రెండు చుక్కలు దిండుపై వేయండి. వాసనతో నిద్ర త్వరగా వస్తుంది.

పడుకునే ముందు వ్యాయామం చేయడం వల్ల శరీరంలో శక్తి పెరుగుతుంది. పడుకునే ముందు వ్యాయామం చేయకండి. సాయంత్రం 5 గంటలలోపు పూర్తి చేయడం మంచిది. ఇది మీకు బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.

చమోమిలే ఆయిల్.. ఈ నూనెకు మనస్సును రిలాక్స్ చేసి నిద్ర(Sleeping)ను కలిగించే శక్తి ఉంది. రాత్రి తలస్నానం చేసేటపుడు నీళ్లలో వేసి చేయాలి. దీని వల్ల మంచి నిద్ర వస్తుంది.

కంప్యూటర్లు, మొబైల్స్ వంటి గాడ్జెట్లతో సమయం గడపడం కంటే పుస్తకాలు చదవడం, వార్తాపత్రికలు చదవడం అలవాటు చేసుకుంటే నిద్రలేమి(sleeping disorder) తొలగిపోయి చక్కగా నిద్ర పడుతుంది.

పడుకునే ముందు స్పైసీ ఫుడ్(Spicy Food) తినకండి. ఇవి నిద్రను దూరం చేస్తాయి. కాబట్టి పడుకునే ముందు తేలికపాటి, సమతుల్య ఆహారం తీసుకోవడం ఉత్తమం.

నిద్ర అనేది శారీరక ఆరోగ్యం మాత్రమే కాదు, మానసిక ఆరోగ్యం కూడా. అసంపూర్ణమైన నిద్ర(Sleeping) ఆరోగ్యంపై విపరీతమైన ప్రభావాన్ని చూపుతుంది. నిద్రలేమి(Sleeping Disorder) మెదడు శక్తిని తగ్గిస్తుంది. అందువల్ల మన రోజువారీ కార్యకలాపాలు చాలా ప్రభావితమవుతాయి. అధిక రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు, మధుమేహం తొందరగా రావడం తదితర సమస్యలు ఎదురవుతాయి.

WhatsApp channel