Garuda Puranam : ఆ సమయంలో మృతదేహాన్ని కాల్చొద్దు.. ఒంటరిగా ఉంచొద్దు.. ఎందుకు?-garuda purana why do not leave the dead body alone know garuda purana dead body rituals ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Garuda Puranam : ఆ సమయంలో మృతదేహాన్ని కాల్చొద్దు.. ఒంటరిగా ఉంచొద్దు.. ఎందుకు?

Garuda Puranam : ఆ సమయంలో మృతదేహాన్ని కాల్చొద్దు.. ఒంటరిగా ఉంచొద్దు.. ఎందుకు?

HT Telugu Desk HT Telugu
Apr 29, 2023 01:23 PM IST

Garuda Puranam : అమరత్వం లేని వ్యక్తి భూమిపై లేడు. పుట్టిన వ్యక్తి ఏదో ఒక రోజు చనిపోవాలి. చనిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికీ వారి మతం ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తారు. హిందువులలో కొందరికి దహన సంస్కారాలు ఉన్నాయి. ఒక్కో కులంలో ఒక్కో విధంగా అంత్యక్రియలు నిర్వహిస్తారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

మనిషి జీవితమే అంతుపట్టనిది. ఏదో ఓ కారణంతో భూమిపైకి వస్తాడు. సమయం అయిపోయాక.. చనిపోతాడు. సంప్రదాయల ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తారు. కానీ మనకు నచ్చినప్పుడల్లా మృతదేహాన్ని కాల్చకూడదు. మృతదేహాన్ని ఒంటరిగా ఉంచకూడదు. గరుడ పురాణం ప్రకారం ఇలాంటి తప్పులు చేయరాదని ప్రస్తావన ఉంది. మరణానంతర విధి గురించి గరుడ పురాణం ఏం చెబుతుందో తెలుసుకుందాం..

ఒక వ్యక్తి సూర్యాస్తమయం తర్వాత మరణిస్తే, మరుసటి రోజు ఉదయం అతని దహన సంస్కారాలు చేయాలి. రాత్రిపూట మృతదేహాం చుట్టూ కచ్చితంగా ఎవరొ ఒకరు ఉండాలి. శరీరం పక్కనే ఎవరైనా కూర్చోవాలి.

గరుడ పురాణం ప్రకారం, ఒక వ్యక్తికి సూర్యాస్తమయం తర్వాత అంత్యక్రియలు చేయోద్దు. అతనికి మోక్షం లభించదు. అదేవిధంగా, ఆ వ్యక్తి యొక్క ఆత్మ దుష్ట శక్తి అవుతుందని నమ్ముతారు. చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలు సకాలంలో చేయాలి. ఒక వ్యక్తి పంచక సమయంలో (సూర్యాస్తమయం లేదా రాత్రి తర్వాత) మరణిస్తే, రాత్రిపూట శరీరానికి కాపలాగా ఎవరైనా ఉండాలి. మరుసటి రోజు దహన సంస్కారాలు జరగాలి. పంచకానికి ముందు దహన సంస్కారాలు నిర్వహిస్తే అదే కుటుంబానికి చెందిన మరో ఐదుగురు చనిపోతారని అంటారు. లేకుంటే దీనికి పరిష్కారం ఉంది.., 5 గింజలు లేదా గడ్డి కండను మృతదేహాన్ని కాల్చేటప్పుడు ఉంచాలి, అప్పుడు కర్మ పూర్తవుతుంది.

గరుడ పురాణంలో రాత్రంతా మృతదేహంతో ఎందుకు ఉండాలనే ప్రస్తావన ఉంది. శరీరాన్ని ఒంటరిగా వదిలేసి వెళ్తే.. అందులో దుష్టశక్తులు ప్రవేశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంతో కుటుంబంలోనూ సమస్యలు వస్తాయి. మనిషి బతికినప్పుడే కాదు.. చనిపోయాక.. శరీరాన్ని శుభ్రంగా ఉంచాలి. బతికి ఉన్నా.. చనిపోయినా.. మనిషికి గౌరవం ఇవ్వాలి.

హిందూ మతంలో చనిపోయిన వ్యక్తి కొడుకు లేదా కుమార్తె అంత్యక్రియలు చేస్తారు. చనిపోయిన వ్యక్తి బంధువులు దూరపు పట్టణంలో నివసిస్తుంటే, వారు వచ్చే వరకు వేచి ఉండటం మంచిది. చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరుతుంది కాబట్టి చనిపోయిన వారి పిల్లలు అంత్యక్రియలు చేయాలి. లేకపోతే, ఆ ఆత్మ మోక్షం లేకుండా భూలోకంలో సంచరిస్తుంది. పుట్టుక నుండి మరణం వరకు, ప్రతి ఒక్కరికి స్వంత బాధ్యతలు ఉంటాయి. ఈ ఆచారాలు కేవలం వినోదం కోసం చేయలేదు.. కాబట్టి దీన్ని అతిక్రమించడం మంచిది కాదు.

WhatsApp channel

టాపిక్