iron absorption:ఆహారంలోని ఇనుము శరీరం గ్రహించాలంటే..-tips to increase iron absorption of the body from food ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Iron Absorption:ఆహారంలోని ఇనుము శరీరం గ్రహించాలంటే..

iron absorption:ఆహారంలోని ఇనుము శరీరం గ్రహించాలంటే..

Apr 27, 2023, 05:10 PM IST Koutik Pranaya Sree
Apr 27, 2023, 05:10 PM , IST

Iron absorption:  శరీర ఎదుగుదలకు ముఖ్యమైన పోషకాలలో ఐరన్ ఒకటి. మన శరీరం ఐరన్‌ను ఎక్కువగా గ్రహించాలంటే ఈ విషయాలు గుర్తుంచుకోండి.  

మన శరీర పనితీరు సక్రమంగా ఉండాలంటే ఇనుము కూడా ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఐరన్ లోపం ఉన్న ఆహారం తినడం వల్ల నీరసంగా ఉండటం, తలనొప్పి, తల తిరగటం, రక్తహీనత వంటి సమస్యలొస్తాయని పోషకాహార నిపుణులు లొవ్‌నీత్ బాత్రా తెలిపారు. 

(1 / 7)

మన శరీర పనితీరు సక్రమంగా ఉండాలంటే ఇనుము కూడా ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఐరన్ లోపం ఉన్న ఆహారం తినడం వల్ల నీరసంగా ఉండటం, తలనొప్పి, తల తిరగటం, రక్తహీనత వంటి సమస్యలొస్తాయని పోషకాహార నిపుణులు లొవ్‌నీత్ బాత్రా తెలిపారు. (Pixabay)

ఇనుము ఉన్న పదార్థాలతో పాటూ సి- విటమిన్ ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల మన శరీరం 300% దాకా ఎక్కువ ఐరన్ గ్రహిస్తుంది. 

(2 / 7)

ఇనుము ఉన్న పదార్థాలతో పాటూ సి- విటమిన్ ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల మన శరీరం 300% దాకా ఎక్కువ ఐరన్ గ్రహిస్తుంది. (pexels)

శాకాహారం తినేవారు కొన్ని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఐరన్ లోపం రాకుండా చూసుకోవచ్చు. ఐరన్ ఎక్కువగా ఉండే పదార్థాలు, వాటిలో ఎంత ఐరన్ ఉంటుందో చూద్దాం.. రాగులు (20g) = 1.2 mg, ఎండుద్రాక్ష(10g) = 0.7 mg, పప్పులు (30g) = 6.6 mg,, సోయాబీన్ (30g) = 2.4 mg, కరివేపాకు  (10g) = 0.87 mg 

(3 / 7)

శాకాహారం తినేవారు కొన్ని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఐరన్ లోపం రాకుండా చూసుకోవచ్చు. ఐరన్ ఎక్కువగా ఉండే పదార్థాలు, వాటిలో ఎంత ఐరన్ ఉంటుందో చూద్దాం.. రాగులు (20g) = 1.2 mg, ఎండుద్రాక్ష(10g) = 0.7 mg, పప్పులు (30g) = 6.6 mg,, సోయాబీన్ (30g) = 2.4 mg, కరివేపాకు  (10g) = 0.87 mg (Pixabay)

తిన్న తరువాత టీ, కాఫీల జోలికి పోకూడదు. ఇవి మన శరీరం ఐరన్‌ను గ్రహించుకోకుండా చేస్తాయి. 

(4 / 7)

తిన్న తరువాత టీ, కాఫీల జోలికి పోకూడదు. ఇవి మన శరీరం ఐరన్‌ను గ్రహించుకోకుండా చేస్తాయి. (Getty Images)

గింజలను, ధాన్యాలను నానబెట్టి తినడం, మొలకెత్తినవి లేదా పులిసినవి తినడం ద్వారా వాటిలో ఉండే ఫైటేట్‌లు తగ్గుతాయి. దానివల్ల శరీరం ఎక్కువ ఇనుమును గ్రహించగలుగుతుంది. Soaking, sprouting and fermenting grains and legumes can improve iron absorption by lowering the amount of phytates naturally present in these foods.

(5 / 7)

గింజలను, ధాన్యాలను నానబెట్టి తినడం, మొలకెత్తినవి లేదా పులిసినవి తినడం ద్వారా వాటిలో ఉండే ఫైటేట్‌లు తగ్గుతాయి. దానివల్ల శరీరం ఎక్కువ ఇనుమును గ్రహించగలుగుతుంది. Soaking, sprouting and fermenting grains and legumes can improve iron absorption by lowering the amount of phytates naturally present in these foods.(Pixabay)

వంటలు చేయడానికి క్యాస్ట్ ఐరన్‌తో చేసిన కడాయిలు, పాత్రలు, పెనం వాడటం మంచిది. 

(6 / 7)

వంటలు చేయడానికి క్యాస్ట్ ఐరన్‌తో చేసిన కడాయిలు, పాత్రలు, పెనం వాడటం మంచిది. (Pixabay)

క్వినోవా, చిక్కుళ్లను ఎక్కువగా తీసుకోవాలి. వీటిలో అమైనో యాసిడ్లు, లైసిన్  ఎక్కువగా ఉండటం వల్ల మనం తినే ఆహారంలో ఉండే ఐరన్‌ ను శరీరం ఎక్కువగా గ్రహించగలుగుతుంది.

(7 / 7)

క్వినోవా, చిక్కుళ్లను ఎక్కువగా తీసుకోవాలి. వీటిలో అమైనో యాసిడ్లు, లైసిన్  ఎక్కువగా ఉండటం వల్ల మనం తినే ఆహారంలో ఉండే ఐరన్‌ ను శరీరం ఎక్కువగా గ్రహించగలుగుతుంది.(istockphoto)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు