Healthy Lifestyle : ఉదయాన్నే పండ్లు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..
Fruits Benefits : పండ్లు ఆరోగ్యానికి ఎప్పుడూ మంచే చేస్తాయి. అవి తీపి, పులుపు వంటి వివిధ రుచులతో.. శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. అనేక దీర్ఘకాలిక వ్యాధులను నయం చేయడానికి, రాకుండా అదుపులో ఉంచడానికి ఇవి సహాయపడతాయి. అందుకే వీటిని ఉదయం తీసుకుంటే మంచిది అంటున్నారు ఆరోగ్యనిపుణులు.
Fruits Benefits : ఉదయపు ఆహారంలో పండ్లను చేర్చుకోవడం వల్ల అనేక వ్యాధులను, వాటి ప్రమాదాలను తగ్గించి.. ఆరోగ్యాన్ని సులభంగా మెరుగుపరచుకోవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కొన్ని పండ్లను తొక్కతో సహా తినడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు అంటున్నారు. ఇది ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహించడంలో సహాయపడుతుందని.. మలబద్ధకాన్ని నియంత్రిస్తుందని పేర్కొన్నారు. అయితే ఉదయాన్నే పండ్లను తింటే కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
పండ్లు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి
నేరేడు పండు, ఆపిల్, అరటిపండు, పుచ్చకాయ, బెర్రీలు, నారింజ వంటి పండ్లు గుండె సంరక్షణకు మంచివి. ఫ్లేవనాయిడ్లు, పొటాషియం, మెగ్నీషియం కలిగి ఉంటాయి. అంతేకాకుండా విటమిన్ ఎ, విటమిన్ బి6, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కెను కలిగి ఉన్నాయి. ఇవన్నీ కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంతో పాటు.. హార్ట్ స్ట్రోక్, అథెరోస్క్లెరోసిస్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల నుంచి గుండెను రక్షించడంలో సహాయపడతాయి.
డయాబెటిస్‌తో పోరాడటానికి ..
మధుమేహం ముఖ్యంగా టైప్ 2 అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా మంది వ్యక్తులను కలవరపెడుతున్న వ్యాధి. పండ్లు ప్రతి వ్యక్తికి మంచివి అయితే.. వాటిలో ఎక్కువ పిండి పదార్థాలు ఉన్న పండ్లు మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచివి కాదు. ఆపిల్, అవకాడో, చెర్రీ, నారింజ, పీచు, ప్లం వంటివి 55 ఏళ్లలోపు వారికి తక్కువ గ్లైసెమిక్ కలిగి ఉంటాయి. అవి గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. ఎందుకంటే అవి సహజమైన తీపిని కలిగి ఉండవు. గరిష్ట ప్రయోజనాలను పొందేందుకు తాజా పండ్లను తినండి.
క్యాన్సర్ చికిత్సకు
విటమిన్లు పుష్కలంగా ఉండే పండ్లు కాలేయ కణితి, రొమ్ము క్యాన్సర్ వంటి అనేక రకాల క్యాన్సర్ల చికిత్సకు, ఆపడానికి మంచివి. నారింజ, టాన్జేరిన్ వంటి పండ్లలో సిట్రస్ ఉంటుంది. వాటిలోని హెపాటోప్రొటెక్టివ్ లక్షణాల వల్ల క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడతాయి.
రక్తపోటు నియంత్రణకు
పొటాషియం అధికంగా ఉండే పండ్లు.. అరటిపండ్లు, పుచ్చకాయలు, పియర్, మామిడి అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి. పొటాషియం వాసోడైలేషన్ లక్షణం కారణంగా రక్తపోటును నియంత్రించడంలో సంబంధం కలిగి ఉంది.
కిడ్నీ స్టోన్స్ నివారించడంలో
పండ్లలో విటమిన్ సి ఉంటుంది. ఇది మూత్రపిండాల్లోని రాళ్లను నివారించడంలో సహాయపడుతుంది. సిట్రస్ పండ్లు కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశాలను తగ్గించేందుకు అనువైనవి. అదేవిధంగా పండ్లలో సోడియం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది కిడ్నీలోరాళ్ల వల్ల కలిగే బాధకు ఉపశమనమిస్తుంది.
ఎముకల ఆరోగ్యం
కాల్షియం, విటమిన్ k సమృద్ధిగా ఉన్న పండ్లు.. మీ ఎముకలను బలంగా ఉంచడంలో సహాయపడతాయి. ఎముక ఖనిజ సాంద్రతను పెంచడంలో మరింత సహాయపడుతుంది.
పండ్లను నిరంతరం తినడం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇవి. మిమ్మల్ని ఆరోగ్యంగా, దృఢంగా ఉంచే సూపర్ ఫుడ్స్ అని కూడా వీటిని పేర్కొనవచ్చు. అవి మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న పోషకాలు, ఫైబర్, విటమిన్ల కంటెంట్‌ను కలిగి ఉంటాయి. కాబట్టి మీ రోజును పండ్లతో ప్రారంభించేందుకు ఎటువంటి వెనకడుగు వేయకండి.
భోజనంతో మాత్రం తీసుకోకండి
పండ్లు ఆమ్ల లక్షణాలను కలిగి ఉన్నందున ఇది తీవ్రమైన ఆమ్లత్వం, కడుపు సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. ప్రతిరోజూ భోజనానికి ముందు లేదా మీ రాత్రి భోజనం తర్వాత పండ్లు తినండి. ఒక గంట లేదా రెండు గంటలు గ్యాప్ తీసుకోండి.
సంబంధిత కథనం