Beer for Kidney Stones | బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు తొలగిపోతాయట.. నిజమేనా?-consumption of beer help passing kidney stones check myths vs facts ,ఫోటో న్యూస్
Telugu News  /  Photo Gallery  /  Consumption Of Beer Help Passing Kidney Stones, Check Myths Vs Facts

Beer for Kidney Stones | బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు తొలగిపోతాయట.. నిజమేనా?

Aug 31, 2022, 09:45 PM IST HT Telugu Desk
Aug 31, 2022, 09:45 PM , IST

  • నీరు, టీ తర్వాత ప్రపంచంలో ఎక్కువ మంది సేవించే పానీయం బీర్. ఇది అత్యంత పురాతనమైన పానీయం కూడా. మద్యపానం ఆరోగ్యానికి హానికరమైనప్పటికీ తక్కువ మోతాదులో అల్కాహాల్ ఉండే బీరు తాగితే పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెప్తారు. అంతేనా..? ఇంకా మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

బీర్ తాగితే విశేష ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కిడ్నీలో రాళ్లు కరిగేలా చేయడంలో ఇది సహాయపడుతుందని ఒక వాదన ఉంది. మరి ఇందులో నిజమెంత? ఇక్కడ తెలుసుకోండి.

(1 / 7)

ఒక నివేదిక ప్రకారం, పరిమిత మోతాదులో బీర్ తాగటం అనగా రోజుకు 350 ml బీర్ తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

(2 / 7)

సరే, మరి బీర్ తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు తొలగిపోతాయా? అంటే నివేదిక ప్రకారం బీర్ అనేది మూత్ర విసర్జక కారకం. బీర్ తాగినపుడు మూత్ర విసర్జన ఎక్కువగా కలిగి, కిడ్నీలలో 5 మిమీ కంటే తక్కువ పరిమాణంలో ఉండే రాళ్లను బయటకు విసర్జించటంలో సహాయపడవచ్చు.

(3 / 7)

ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందేమిటంటే, బీర్ అనేది కిడ్నీలో రాళ్లను తొలగించటం లేదు. కానీ, మూత్ర విసర్జన కలిగించడం ద్వారా ప్రవాహం పెరుగుతుంది. తద్వారా కిడ్నీలలో పేరుకు పోయిన చిన్నచిన్న గుళికలు మూత్రం గుండా బయటకు వెళ్లిపోతాయి.

(4 / 7)

కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు ద్రవాలు ఎక్కువగా త్రాగడం అవసరం. అయితే ఇందుకు బీర్ మాత్రం ఉత్తమ ఎంపిక కాదు. ఎందుకంటే బీర్ మీ శరీరంలో నీటిని తొలగించి మిమ్మల్ని డీహైడ్రేషన్ కు గురిచేయగలదు.

(5 / 7)

డీహైడ్రేషన్ కు గురైతే మరిన్ని సమస్యలు వస్తాయి, నీటి శాతం తగ్గటం కూడా కిడ్నీలో రాళ్లు తొలగిపోవటానికి ప్రతికూలంగా మారుతుంది. కాబట్టి బీర్ మాత్రమే కాదు, ఆల్కాహాల్ కలిగిన ఏ పానీయం ఉత్తమ ఎంపిక అనిపించుకోదు.

(6 / 7)

కిడ్నీలో రాళ్లు ఉన్నట్లయితే ముందుగా వైద్యుడిని సంప్రదించండి, వారి సలహా మేరకు బీర్ తాగండి.

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు