NewBrew Beer | మూత్రం, మురుగునీరుతో బీర్.. దీని రుచి మధురామృతం అంటూ పుకార్!
గ్లోబల్ మార్కెట్లో ఒక న్యూబ్రూ (NewBrew) అనే బీర్ విడుదలైంది. అది 95 శాతం మురుగునీరు, మూత్రం కలిపిన ఆలే నీవాటర్‌తో తయారు చేశారు. మరి ఈ బీర్ తాగిన వారు ఏమంటున్నారో ఇక్కడ తెలుసుకోండి.
ఎర్రని ఎండలో ఒక చిల్డ్ బీర్ నోటికి తాకితే ఒక తెలియని భావోద్వేగం సర్రుమని నరాలలో పాకుతుంది. మీకూ ఇలా అనిపిస్తే మీరు కరుడుగట్టిన బీర్ ప్రియులు అని అర్థం. బీర్ తాగటంలో మీకు ఎంతో అనుభవం ఉండి ఉంటుంది. ఇప్పటివరకు ఎన్నో రకాల బీర్ రుచులను మీరు ఆస్వాదించి ఉండవచ్చు. అయితే గ్లోబల్ మార్కెట్లోకి కొత్తగా ఒక బీర్ వచ్చింది. ఆ బీర్ ఎలా తయారు చేస్తున్నారో తెలిస్తే, అందులో ఎలాంటి పదార్థాలను వినియోగిస్తున్నారో తెలిస్తే మీరు అవాక్కవుతారు. ఆ బీర్ తాగడం కాదు, ఇంకా ఏ బీర్ అయినా వద్దు అనుకోవచ్చు. ఎందుకంటే ఆ బీర్ ను నగరంలోని మురుగు నీరు, మూత్రంతో తయారు చేస్తున్నారు. అంతేకాదు ఈ విషయాన్ని ఆ బీర్ కంపెనీ వారు ఎంతో గర్వంగా చెప్పుకున్నారు. తమ బీర్ మిగతా అన్ని బీర్ రకాల కంటే ఎంతో రుచికరమైంది, స్వచ్ఛమైనది అని చెప్పుకోవడం ఇక్కడ విశేషం.
సింగపూర్ కు చెందిన 'Brewerkz' అనే బ్రూవరీ సంస్థ స్థానిక వాటర్ ఏజెన్సీతో కలిసి NewBreW అనే సరికొత్త బీర్ ను తయారు చేశారు.
బీర్ తయారీలో పెద్దమొత్తంలో స్వచ్ఛమైన నీరు అవసరం అవుతుంది. అన్ని సందర్భాలలో నీటి లభ్యత ఉండకపోవచ్చు. దీనికి పరిష్కారంగా వారు సింగపూర్ నగరంలో మురుగునీరు, మూత్రంను అత్యంత అధునాతన పద్ధతుల్లో అల్ట్రా-క్లీన్ చేసి "హై-గ్రేడ్ రీసైకిల్ వాటర్" ను తయారు చేశారు. దీనినే వారు NEw వాటర్ అంటున్నారు. ఈ నీటితోనే బీర్ తయారు చేసి మార్కెట్లో విడుదల చేశారు.
ఇక, తమ బీర్ ప్రచారంలో కూడా వారు ఎంతో నిజాయితీగా తాము బీర్ ఎలా తయారు చేశారో చెప్పుకున్నారు. తమ బేర్ తేనేలాంటి రుచికలిగినది, ఎంతో స్వచ్ఛమైనది ఇంకా ఆరోగ్యకరమైనది అని పేర్కొన్నారు.
వారి ప్రకటన వీడియోలో కొంత మంది బీర్ తాగుతూ తమ అభిప్రాయాలను పేర్కొన్నారు. ఒకరు బీర్ చాలా బాగుంది పరిమళభరితంగా ఉంది అనగా, ఇంకొకరు చాలా రుచికరంగా ఉంది. ఎంతతాగినా తాగాలనిపిస్తుంది అని మరొకరు, రిఫ్రెషింగ్ గా ఉందని మరొకరు చెప్పటం గమనార్హం.
Here's the NewBrew Beer video
అయితే ఈ బీర్ గురించి తెలిసిన తర్వాత మీకు ఒక కామెడీ సీన్ గుర్తుకు రావొచ్చు. ఒక సినిమాలో రఘుబాబు బార్ కి వచ్చినపుడు అదే టేబుల్ కింద బ్రహ్మానందం దాగి ఉంటాడు. బయటకు వెళ్లలేక రఘుబాబు ఆర్డర్ చేసిన బీర్ లోనే మూత్ర విసర్జన చేసినట్లుగా ఆ సన్నివేశం ఉంటుంది. ఆ బీర్ తాగుతూ రఘుబాబు అబ్బా ఎంత టేస్టీగా ఉంది ఈ బీర్ అంటూ ఆహా ఒహో అంటాడు. ఇప్పుడు ఆ సీన్ నిజమైంది.
This Comedy Scene
సంబంధిత కథనం