palliative care : తీవ్రమైన క్యాన్సర్లకు ఇంటికి సమీపంలోనే పాలియేటివ్‌ కేర్‌…-poliative treatment for cancer patients in andhra pradesh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Palliative Care : తీవ్రమైన క్యాన్సర్లకు ఇంటికి సమీపంలోనే పాలియేటివ్‌ కేర్‌…

palliative care : తీవ్రమైన క్యాన్సర్లకు ఇంటికి సమీపంలోనే పాలియేటివ్‌ కేర్‌…

HT Telugu Desk HT Telugu
Jul 22, 2022 02:32 PM IST

తీవ్రమైన క్యాన్సర్‌తో బాధపడుతున్న పేషెంట్లకు ఇంటి దగ్గరే చికిత్స అందించేలా పాలియేటివ్‌ కేర్‌ ఏర్పాట్లు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బోధనాసుపత్రుల్లో పాలియేటివ్‌ కేర్ అందించేలా సన్నాహాలు చేస్తున్నారు.

క్యాన్సర్‌ రోగులకు ఇంటికి సమీపంలోనే పాలియేటివ్ కేర్ అందించాలని ఏపీ ప్రభుత్వ నిర్ణయం
క్యాన్సర్‌ రోగులకు ఇంటికి సమీపంలోనే పాలియేటివ్ కేర్ అందించాలని ఏపీ ప్రభుత్వ నిర్ణయం (Unsplash)

ఏపీలో క్యాన్సర్‌ పేషెంట్లకు ఇంటి దగ్గరలోనే వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళాక రూపొందిస్తోంది. పాలియేటివ్ క్యాన్సర్‌ కేర్‌ కోసం ముసాయిదా ప్రణాళికను వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూపొందిస్తున్నారు. తీవ్రదశలో ఉన్న క్యాన్సర్‌ వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడే రోగులకు ఇంటి దగ్గరే చికిత్స అందించడం కోసం పాలియేటివ్‌ కేర్‌ ఉపకరిస్తుందని భావిస్తున్నారు.

క్యాన్సర్‌తో పాటు తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న రోగులకు అవసరమైన మౌలిక సదుపాయాలను అన్ని ఆస్పత్రులలో అభివృద్ధి చేస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి నవీకుమార్ చెప్పారు. క్యాన్సర్‌ ముదిరిన దశలో మెజార్టీ పేషెంట్లకు పాలియేటివ్‌ కేర్‌ చికత్స అవసరమవుతుందని, రోగులతో పాటు వారి కుటుంబ సభ్యుల్ని ఆందోళనకు గురి చేయకుండా సాధారణంగా అందించే చికిత్స ప్రక్రియను అందరికి అందుబాటులోకి తీసుకురానున్నారు.

ప్రతి బోధనాసుపత్రిలో 10బెడ్‌లను క్యాన్సర్‌ రోగుల చికిత్స కోసం కేటాయించనున్నారు. జాతీయ ఆరోగ్య మిషన్‌ నిధులతో ఈ పనులు చేపడతారు. ఆంధ్రప్రదేశ్‌లో గత మూడేళ్ల వ్యవధిలో క్యాన్సర్‌ చికిత్సల కోసం ఆరోగ్య శ్రీ పథకంలో దాదాపు వెయ్యి కోట్లను ఖర్చు చేశారు. ప్రజల్లో చైతన్యం కలిగించడంతో పాటు స్క్రీనింగ్ పరీక్షలు విస్తృతంగా నిర్వహించడం, అత్యుత్తమ క్యాన్సర్‌ చికిత్సను రోగులకు అందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. రోగులకు గౌరవప్రదమైన పాలియేటివ్‌ కేర్‌ను అందించే లక్ష్యంతో సమగ్ర చికిత్స విధినాన్ని రూపొందించి అమలు చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో నమోదవుతున్న క్యాన్సర్‌ కేసుల్లో అధికంగా బ్రెస్ట్‌, సర్వైకల్ క్యాన్సర్‌ కేసులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. 2021-22 సంవత్సరాల్లో నమోదైన కేసుల్లో 16శాతం సర్వైకల్, బ్రెస్ట్‌ క్యాన్సర్‌ కేసులున్నాయి. ఆరోగ్య శ్రీ రికార్డుల ప్రకారం సర్వికల్ క్యాన్సర్‌ కేసులున్నాయి. మరో ఆరు శాతం నోటి క్యాన్సర్‌ బాధితులున్నారు. క్యాన్సర్‌ కేసులు పెరుగుతున్న కొద్ది చికిత్సకు అందించే నిధుల భారం ప్రభుత్వంపై పెరుగుతోంది.

2014-15లో క్యాన్సర్‌ కేసుల చికిత్సకు ఆరోగ్యశ్రీలో 100కోట్లను ఖర్చు చేయాల్సి వస్తే 2021-22నాటికి 400కోట్లకు చేరింది. 2021-22లో రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల్లో అత్యధికంగా తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాల్లో నమోదయ్యాయి. రాష్ట్రంలో తిరుపతి శ్రీ వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌తోపాటు విశాఖపట్నం హోమీబాబా క్యాన్సర్‌ ఆస్పత్రులలో మెరుగైన చికిత్స అందుతున్నట్లుు గుర్తించారు. అత్యుత్తమ చికిత్స అందించే 20 ఆస్పత్రుల్లో 4,5 స్థానాల్లో ఈ రెండు ఆస్పత్రులు ఉన్నాయి. మిగిలినవి ఆంధ్రా, తెలంగాణలలో ఉన్న కార్పొరేట్ ఆస్పత్రులుగా గుర్తించారు.

IPL_Entry_Point

టాపిక్