Breakfast Recipe : పోషకాలకు పవర్​హౌస్.. పుచ్చకాయ, స్ట్రాబెర్రీ స్మూతీ..-today breakfast recipe is water melon and strawberry smoothie ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Today Breakfast Recipe Is Water Melon And Strawberry Smoothie

Breakfast Recipe : పోషకాలకు పవర్​హౌస్.. పుచ్చకాయ, స్ట్రాబెర్రీ స్మూతీ..

Geddam Vijaya Madhuri HT Telugu
Sep 01, 2022 07:56 AM IST

Breakfast Recipe : మరి ఇంత ఈజీనా అనిపించేలా తయారు చేసుకోగలిగే ఓ రెసిపీ.. మీ ఆకలిని తీరుస్తుంది.. హెల్త్​కి మంచిది అంటే కచ్చితంగా దానిని తయారు చేసుకుంటారు కదా. అయితే పుచ్చకాయ, స్ట్రాబెర్రీ స్మూతీ కచ్చితంగా అలాంటిదే. పెద్దగా సమయం పట్టదు. హెల్త్​కి మంచిది. పైగా టేస్టీ కూడా.

పుచ్చకాయ, స్ట్రాబెర్రీ స్మూతీ
పుచ్చకాయ, స్ట్రాబెర్రీ స్మూతీ

Breakfast Recipe : ఆరోగ్యానికి పండ్లు మంచివని తెలుసు. అయితే కొన్నిసార్లు డైరక్ట్​గా తినడం కన్నా స్మూతీలు చేసుకుంటే మంచిది. దానిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పుచ్చకాయ, స్ట్రాబెర్రీ స్మూతీ గురించి. దీనిని తయారు చేయడానికి పెద్దగా కష్టపడనవసరం లేదు. పైగా హెల్తీ రెసిపీ కూడా. ఈ స్మూతీ రెసిపీ ఆరోగ్యకరమైన పోషకాలకు పవర్​హౌస్​ అని చెప్పవచ్చు. కాబట్టి మీ వర్క్​ అవుట్ తర్వాత హ్యాపీగా దీనిని తీసుకోవచ్చు. పైగా ఇది రోజంతా మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతుంది. మరి ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా?

కావాల్సిన పదార్థాలు

* స్ట్రాబెర్రీలు - 100 గ్రాములు (తాజావి)

* తేనె - 1 టేబుల్ స్పూన్

* లో ఫ్యాట్ పెరుగు - 150 గ్రాములు

* పుచ్చకాయ - 50 గ్రాములు

టాపింగ్ కోసం

* చియా సీడ్స్ - పావు కప్పు (నానబెట్టినవి)

తయారీ విధానం

పుచ్చకాయ, స్ట్రాబెర్రీ, పెరుగు, తేనే అన్ని కలిపి బ్లెండర్‌లో వేసి బాగా బ్లెండ్ చేయాలి. స్మూతీలా వచ్చే వరకు బ్లెండ్ చేయాలి. దానిని గ్లాస్‌లో పోయాలి. దీనిని చల్లగా తీసుకోవాలంటే ఫ్రిజ్​లో కొంతసేపు ఉంచాలి. లేదంటే డైరక్ట్​గా తినొచ్చు. కానీ తినే ముందు చియా సీడ్స్​తో టాపింగ్ చేసుకోవాలి. అంతే హెల్తీ, టేస్టీ స్మూతీ రెడీ.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్