Yoga Hotspots in World | యోగాకు ప్రణమిల్లిన ప్రపంచం.. ప్రశాంతతకు ఇదే ఏకైక మార్గం!-from rishikesh to bali top yoga practicing hotspots in world for a rejuvenating experience ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  From Rishikesh To Bali Top Yoga Practicing Hotspots In World For A Rejuvenating Experience

Yoga Hotspots in World | యోగాకు ప్రణమిల్లిన ప్రపంచం.. ప్రశాంతతకు ఇదే ఏకైక మార్గం!

HT Telugu Desk HT Telugu
Feb 01, 2023 04:17 PM IST

Yoga Hotspots in World: భారత్ కాకుండా ప్రపంచంలోని అనేక దేశాలు యోగాను తమ జీవనశైలిలో భాగంగా చేసుకున్నాయి. అగ్రశ్రేణి యోగా కేంద్రాలుగా విరాజిల్లుతున్న కొన్ని దేశాల జాబితా ఇక్కడ ఉంది.

Yoga Hotspots in World
Yoga Hotspots in World (Unsplash)

యోగా అనేది శారీరక, మానసిక శ్రేయస్సును పెంచే ఒక గొప్ప వ్యాయామం. వ్యక్తుల్లో ఆధ్యాత్మిక భావనను పెంపొందించే ఒక అద్భుత సాధనం. ప్రాచీన భారతదేశంలో ఉద్భవించిన యోగా, నేడు ప్రపంచానికి శ్రేయస్సును పంచే తారకమంత్రంగా నిలుస్తుంది. వివిధ రూపాలలో రూపాంతరం చెందుతూ వారి జీవనశైలిలో ఒక భాగంగా మారుతోంది.

భారతదేశంలో ఎన్నో యోగా కేంద్రాలు, యోగాశ్రమాలు ఉన్నట్లే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో యోగా అభ్యాస కేంద్రాలు వెలుస్తున్నాయి. ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా యోగా చేయవచ్చు. మీరు యోగాలో నిష్ణాతులైనా లేదా ప్రారంభీకులైనా వయోభేదం లేకుండా ఆనందంగా యోగాను అభ్యసించవచ్చు, ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు.

Yoga Hotspots in World- ప్రపంచంలోని అగ్రశ్రేణి యోగా కేంద్రాలు

భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా యోగాభ్యాసానికి ప్రసిద్ధి చెందిన మరికొన్ని దేశాల జాబితాను ఇక్కడ చూడండి.

రిషికేశ్, భారతదేశం

ప్రఖ్యాత హిమాలయ పర్వతాలు, పవిత్ర గంగా నదీ పరివాహకంలో వెలసిన భారతదేశంలోని రిషికేశ్ ప్రపంచ యోగా రాజధానిగా ప్రసిద్ధి. ఈ పవిత్ర నగరం అనేక యోగా ఆశ్రమాలు, యోగా పాఠశాలలు, ఆధ్యాత్మిక కేంద్రాలకు నిలయంగా ఉంది. ఈ ప్రాంతాన్ని సందర్శించే వారు యోగా, ధ్యానాన్ని అభ్యసించి తమ మనస్సును శాంతపరుచుకోవచ్చు, శారీరక దృఢత్వాన్ని పొందవచ్చు, హిందూ తత్వశాస్త్రాన్ని లోతుగా అధ్యయనం చేయవచ్చు, ఘనమైన ప్రాచీన భారతీయ సంస్కృతిని అర్థం చేసుకోవచ్చు.

బాలి, ఇండోనేషియా

ఈ ఉష్ణమండల దేశం దాని అద్భుతమైన ప్రకృతి రమణీయతతతో పర్యాటకుల స్వర్గంగా పేరుగాంచింది. బాలి నగరం ఆధ్యాత్మికత ప్రశాంతతకు మారు పేరు. యోగా ప్రియులకు ప్రసిద్ధ గమ్యస్థానంగా ఉంది. ఇక్కడ అన్ని స్థాయిల యోగులకు తరగతులు, వర్క్‌షాప్‌లు, ఉపాధ్యాయ శిక్షణా కార్యక్రమాలను అందించే అనేక యోగా ఆశ్రమాలు, స్టూడియోలు ఉన్నాయి.

ఇబిజా, స్పెయిన్

ఈ స్పానిష్ ద్వీపం నైట్ లైఫ్, బీచ్‌లు, బోహేమియన్ వైబ్‌లకు ప్రసిద్ధి చెందింది. ఈ ద్వీపంలో సందర్శకులు అద్భుతమైన ప్రకృతి సౌందర్యంతో, శాంతియుత వాతావరణంను ఆస్వాదించవచ్చు. యోగా సాధన ద్వారా తమని తాము, ప్రకృతితో కనెక్ట్ అవ్వాలని చూస్తున్న వారికి ఇది సరైన ప్రదేశం.

థాయిలాండ్

థాయ్‌లాండ్‌లో కో స్యామ్యూయ్, ఫుకెట్, చియాంగ్ మాయి, కో ఫంగన్ వంటి పట్టణాలు యోగా కోసం ప్రసిద్ధ గమ్యస్థానాలుగా ఉన్నాయి. దట్టమైన ఉష్ణమండల అడవులు, సహజమైన బీచ్‌లు, శక్తివంతమైన సంస్కృతితో, థాయిలాండ్ యోగాభ్యాసానికి అనువైన వాతావరణం కల్పిస్తుంది.

మౌయి, హవాయి, USA

ఈ హవాయి ద్వీపం దాని అద్భుతమైన దృశ్యాలు, సహజమైన బీచ్‌లు , వెచ్చని వాతావరణానికి ప్రసిద్ధి చెందింది. ఇది యోగా కోసం ఒక ప్రసిద్ధ గమ్యస్థానంగా ఉంది. ఇక్కడ వెలసిన అనేక యోగాశ్రమాలు, స్టూడియోలు సందర్శకులకు యోగా తరగతులు, వర్క్‌షాప్‌లను అందిస్తాయి.

శ్రీలంక

భారతదేశానికి అత్యంత చేరువలో ఉన్న శ్రీలంక దేశం భారతీయ సంస్కృతిని తమ భాగంగా చేసుకుంది. ప్రశాంతత, శ్రేయస్సు పొందాలనుకునే వారి కోసం శ్రీలంక నిజమైన స్వర్గధామం. శ్రీలంక తీరం వెంబడి, ఉత్కంఠభరితమైన విస్టాలు, రోజువారీ యోగా తరగతులు అందించే అనేక యోగా ఆశ్రమాలు ఉన్నాయి. కొలంబో, ఉనావతునా, కాండీ తదితర పట్టణాలు శ్రీలంకలో యోగాకు ప్రసిద్ధి చెందిన ప్రదేశాలు.

WhatsApp channel

సంబంధిత కథనం