Yoga Poses for Knee Pain : మోకాళ్ల నొప్పులను పూర్తిగా దూరం చేసే యోగాసనాలు ఇవే..
Strengthen Your Knees with Yoga : మోకాళ్ల నొప్పులనేవి ఈరోజుల్లో కామన్ అయిపోయాయి. ఒకప్పుడు పెద్దలు మాత్రమే ఈ సమస్యతో బాధపడేవారు. ఇప్పుడు జీవనశైలిలో మార్పులు కారణంగా చిన్న వయసువారు కూడా ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అయితే యోగాతో దీనికి చెక్ పెట్టవచ్చు అంటున్నారు నిపుణులు. అదేలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
Strengthen Your Knees with Yoga : మీ మోకాళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే.. మీ డైలీ రోటీన్లో యోగాను చేర్చుకోవాల్సిందే అంటున్నారు యోగా నిపుణులు. పలు ఆసనాలతో మీరు నిజంగా 'మోకాలి నొప్పు'లను దూరం చేసుకోవచ్చు అంటున్నారు. వయస్సుతో వచ్చే నొప్పులైనా.. గాయంతో వచ్చే వాటికైనా.. లేక ఇతర కారణాల వల్ల వచ్చే మోకాళ్ల నొప్పులను మీరు యోగాలోని పలు ఆసనాలతో దూరం చేసుకోవచ్చని తెలుపుతున్నారు.
ట్రెండింగ్ వార్తలు
సాధారణంగా మోకాళ్ల నొప్పులు దీర్ఘకాలిక సమస్యలకు దారితీస్తాయి. అవి సరిగ్గా కూర్చొనివ్వలేవు.. నడవనివ్వలేవు. ఎన్ని మాత్రలు తీసుకున్నా.. వీటివల్ల పెద్ద ప్రయోజనం ఉండకపోవచ్చు. అయితే యోగా చేస్తే.. ఈ సమస్యను శాశ్వతంగా దూరం చేసుకోవచ్చు అంటున్నారు. యోగా పురాతన అభ్యాసమే అయినా.. అనేక ఫిట్‌నెస్, ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. వాటిలో మోకాలి బలాన్ని ప్రోత్సహించడం కూడా ఒకటి. అయితే మీ మోకాళ్లను బలోపేతం చేయడంలో మీకు సహాయపడే ఆసనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
త్రికోణాసనం
త్రికోణాసనం మీ మోకాళ్లను స్ట్రాంగ్‌గా చేయడంలో కచ్చితంగా సహాయం చేస్తుంది. దీనిని చేయడం కోసం ముందుగా మీ పాదాలను వెడల్పుగా ఉంచి నిలబడండి. మీ ఎడమ పాదం 45 డిగ్రీల కోణంలో లోపలికి ఎదురుగా ఉన్నప్పుడు మీ కుడి పాదాన్ని బయటికి తిప్పండి.
మీ వీపును కుడి వైపునకు వంచి.. మీ కుడి చేతిని నేలపైకి తీసుకురండి. కుడి చేతికి సమాంతరంగా.. ఎడమ చేతిని పైకప్పు వైపునకు చాచండి. పైకప్పు వైపు చూస్తూ ఒక నిమిషం పాటు ఆ భంగిమలో ఉండండి. ఎదురుగా రిపీట్ చేయండి.
ఉత్కటాసనం
ఈ ఆసనం చేయడం కోసం మీ పాదాలను కలిపి.. మీ వైపు చేతులు ఉంచి నిల్చోండి. మీ తలపైకి మీ చేతులను ఎత్తి.. వాటిని మీ చెవులకు దగ్గరగా ఉంచండి. మీ వేళ్లు ఆకాశం వైపు చూడాలి. ఇప్పుడు మీ మోకాళ్లను కొద్దిగా వంచి.. మీ తుంటిని వెనుకకు వంచండి. దీని ద్వారా పాక్షిక స్క్వాట్ పొజిషన్‌ను పొందవచ్చు.
ఇది మీ అవయవాల కండరాలను బలోపేతం చేయడంతో పాటు.. డయాఫ్రాగమ్, గుండెకు కూడా మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది.
వీరభద్రాసనం
మీ మోకాళ్లను బలోపేతం చేయడంతో పాటు.. వీరాభద్రాసనం మీ కాళ్లు, చేతులు, వీపు, తుంటిని విశ్రాంతి తీసుకోవడానికి కూడా సహాయపడుతుంది.
మీ కాళ్లను వెడల్పుగా ఉంచి.. మీ శరీరాన్ని ఎడమ వైపునకు తిప్పండి. మీ ఎడమ మోకాలిని వంచి.. 90-డిగ్రీల కోణాన్ని తయారు చేసి.. కుడి కాలును చాచండి. మీ చేతులను గాలిలో ఉంచి.. మీ వీపును 10 సెకన్ల పాటు సాగదీయండి. అనంతరం ఇతర కాలుతో పునరావృతం చేయండి.
తడసానా
తడసనా అనేది మీ మోకాళ్లను బలోపేతం చేయడానికి మీరు సాధన చేయగల సరళమైన యోగా ఆసనం. మీ పాదాలను కొద్దిగా దూరంగా ఉంచి నిలబడండి. మీ వేళ్లను ఇంటర్‌లాక్ చేసి.. మణికట్టును బయటికి తిప్పండి.
ఊపిరి పీల్చుకోండి. మీ తలపై మీ చేతులను పైకి లేపండి. మీ మడమలను ఎత్తండి. మీ వీపును చాచండి. 10 సెకన్లపాటు పట్టుకోండి. మీ మడమలను దించి.. ఇంటర్‌లాకింగ్ వేళ్లను విడుదల చేయండి. విశ్రాంతి తీసుకోండి.
సేతు బంధాసనం
మీ వెనుకభాగంలో పడుకోండి. మీ మోకాళ్లను వంచి.. మీ మడమలు శరీరం వైపునకు లాగండి. మీ చేతులను పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మీ తొడలు, తుంటిని నేలకి సమాంతరంగా ఉంచి.. పైకి ఎత్తండి. మీ చీలమండలను మీ చేతులతో పట్టుకోండి. ఈ భంగిమలో ఒక నిమిషం పాటు ఉండి.. ఆపై అసలు స్థానానికి తిరిగి రండి.
ఈ యోగసనాలు చేయడం చాలా సులభం. ఒక్కరోజూ వేసేసి అయ్యో నొప్పులు తగ్గలేదు అని అనుకోకూడదు. వీటిని రోజూ ట్రే చేస్తూ ఉంటే.. మీరు మీ మోకాళ్ల నొప్పులకు కచ్చితంగా చరమగీతం పాడవచ్చు.
సంబంధిత కథనం
Knee pain in winter: మోకాలి నొప్పులకు చికిత్స ఇదే
January 13 2023
knee arthritis: మోకాలి ఆర్థరైటిస్ నుంచి ఉపశమనం పొందండిలా
November 21 2022