ఆర్థరైటిస్ ప్రారంభ లక్షణాలు, సంకేతాలను ఎలా గుర్తించాలి?-do you have any of these dangerous signs and symptoms of arthritis ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Do You Have Any Of These Dangerous Signs And Symptoms Of Arthritis

ఆర్థరైటిస్ ప్రారంభ లక్షణాలు, సంకేతాలను ఎలా గుర్తించాలి?

HT Telugu Desk HT Telugu
Oct 12, 2023 01:10 PM IST

ఆర్థరైటిస్ అనేది నొప్పి, వాపు, దృఢత్వాన్ని కలిగించే కీళ్ల రుగ్మత. ఇది శరీరంలోని ఏదైనా జాయింట్‌పై ప్రభావం చూపుతుంది.

చేతులు స్టిఫ్‌గా మారి నొప్పి రావడం కూడా ఆర్థరైటిస్ లక్షణమే
చేతులు స్టిఫ్‌గా మారి నొప్పి రావడం కూడా ఆర్థరైటిస్ లక్షణమే (pixabay)

ఆర్థరైటిస్ చేతులు, మోకాళ్లు, భుజాలు, వెన్నెముకలో సర్వసాధారణం. ఆర్థరైటిస్‌లో అనేక రకాలు ఉన్నాయి. వీటిలో అత్యంత సాధారణమైనది ఆస్టియో ఆర్థరైటిస్.

ట్రెండింగ్ వార్తలు

ఆస్టియో ఆర్థరైటిస్ అనేది కీళ్లలోని మృదులాస్థి కాలక్రమేణా విచ్ఛిన్నమైనప్పుడు ఏర్పడే క్షీణత స్థితి. మృదులాస్థి అనేది మృదు కణజాలం. ఇది కీళ్లలో ఎముకల మధ్య కుషన్‌గా పనిచేస్తుంది. మృదులాస్థి విచ్ఛిన్నమైనప్పుడు, ఎముకలు ఒకదానికొకటి రుద్దుకోవడం వల్ల నొప్పి, వాపు ఏర్పడుతాయి.

ఇతర రకాల ఆర్థరైటిస్‌లలో రుమటాయిడ్ ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, గౌట్ ఉన్నాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఆటో ఇమ్యూన్ వ్యాధి. ఇది రోగనిరోధక వ్యవస్థ కీళ్లపై దాడి చేస్తుంది. సోరియాటిక్ ఆర్థరైటిస్ అనేది ఒక రకమైన ఆర్థరైటిస్. ఇది సోరియాసిస్ అనే చర్మ అనారోగ్యం ఉన్న వ్యక్తులను ప్రభావితం చేస్తుంది. గౌట్ అనేది ఒక రకమైన ఆర్థరైటిస్. ఇది కీళ్లలో యూరిక్ యాసిడ్ స్ఫటికాలు ఏర్పడడం వల్ల వస్తుంది.

ఆర్థరైటిస్ ప్రమాదకరమైన సంకేతాలు

 1. కీళ్లలో తీవ్రమైన నొప్పి, వాపు
 2. జాయింట్ వద్ద ఎరుపుగా మారడం, వేడెక్కడం
 3. కీళ్లు కదలించలేకపోవడం
 4. జ్వరం
 5. రాత్రిపూట చెమటలు పట్టడం
 6. ఆకస్మికంగా బరువు తగ్గడం
 7. అలసట

ఈ సంకేతాలు, లక్షణాలు మీరు రుమటాయిడ్ ఆర్థరైటిస్ లేదా సోరియాటిక్ ఆర్థరైటిస్ వంటి తీవ్రమైన ఆర్థరైటిస్‌ని కలిగి ఉన్నారని సూచిస్తాయి. ఈ సమస్యలను నివారించడానికి ముందస్తు రోగ నిర్ధారణ, చికిత్స అవసరం.

ఆర్థరైటిస్ ప్రారంభ సంకేతాలు

ఆర్థరైటిస్ ప్రారంభ సంకేతాలు, లక్షణాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ సంకేతాలు, లక్షణాలు మొదట సూక్ష్మంగా ఉండవచ్చు. కానీ అవి కాలక్రమేణా మరింత తీవ్రమవుతాయి.

 1. కీళ్ల నొప్పులు ఉదయం లేదా ఖాళీగా ఉన్నసమయం తర్వాత అధ్వాన్నంగా ఉంటాయి.
 2. కీళ్లు స్టిఫ్‌గా తయారై కొన్ని నిమిషాలు నొప్పిగా ఉంటాయి.
 3. జాయింట్ల వద్ద వాపు ఏర్పడుతుంది
 4. జాయింట్లు కదలించలేని స్థితి ఏర్పడుతుంది.
 5. జాయింట్‌లో గ్రౌండింగ్ శబ్దాలు
 6. జాయింట్ల వద్ద బలహీనత లేదా కండరాల క్షీణత

ఆర్థరైటిస్ ప్రారంభ రోగనిర్ధారణ, చికిత్స వ్యాధి పురోగతిని మందగించడానికి, కీళ్ల నష్టాన్ని నివారించడానికి సహాయపడుతుంది. మీరు ఆర్థరైటిస్ ప్రారంభ సంకేతాలను ఎదుర్కొంటుంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.

మీకు ఆర్థరైటిస్ ఉందని భావిస్తున్నారా? ఇలా చేయండి

మీకు ఆర్థరైటిస్ ఉందని మీరు అనుకుంటే, రోగనిర్ధారణ కోసం వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. మీ వైద్యుడు శారీరక పరీక్షను నిర్వహిస్తారు.ఎక్స్ రే, రక్త పరీక్షలు లేదా ఎంఆర్ఐ స్కాన్‌ల వంటి పరీక్షలను సిఫారసు చేస్తారు. డాక్టర్ ఆర్థరైటిస్‌ని నిర్ధారించిన తర్వాత, వారు మీకు చికిత్సను సూచిస్తారు.

ఆర్థరైటిస్‌కు చికిత్స లేదు. కానీ నొప్పి, లక్షణాలను తగ్గించేందుకు సహాయపడే చికిత్సలు ఉన్నాయి. కొన్ని టాబ్లెట్లు, యాంటీ రుమాటిక్ మందులు రాస్తారు. అలాగే జీవక్రియకు సంబంధించిన మందులు కూడా సూచిస్తారు. వీటితో పాటు జీవనశైలి మార్పులు కూడా సూచిస్తారు.

క్రమం తప్పకుండా వ్యాయామం చేయాల్సి ఉంటుంది. బరువును అదుపులో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, తగినంత నిద్ర పోవడం చాలా అవసరం.

నొప్పి, వాపు నుండి ఉపశమనానికి మీ వైద్యుడు హీట్ లేదా ఐస్ థెరపీని సూచించవచ్చు.

WhatsApp channel