Spices for Reduce Cholesterol : ఈ మసాలాలతో చెడు కొలెస్ట్రాల్​ను తగ్గించుకోండి..-control cholesterol with these spices at home here is the details ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Spices For Reduce Cholesterol : ఈ మసాలాలతో చెడు కొలెస్ట్రాల్​ను తగ్గించుకోండి..

Spices for Reduce Cholesterol : ఈ మసాలాలతో చెడు కొలెస్ట్రాల్​ను తగ్గించుకోండి..

Geddam Vijaya Madhuri HT Telugu
Nov 18, 2022 02:11 PM IST

Control Cholesterol with Home Remedies : శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగితే.. గుండె జబ్బుల ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే. అయితే దీనిని వీలైనంత త్వరగా తగ్గించుకోవాల్సి ఉంటుంది. జీవనశైలితో పాటు ఆహార అలవాట్లు కూడా మార్చుకోవాలి. అయితే కొన్ని మసాలాలను తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్యను కంట్రోల్ చేయవచ్చు అంటున్నారు నిపుణులు.

కొలెస్ట్రాల్ తగ్గించుకునేందుకు చిట్కాలు
కొలెస్ట్రాల్ తగ్గించుకునేందుకు చిట్కాలు

Spices for Reduce Cholesterol : కొలెస్ట్రాల్ సమస్య ప్రారంభ దశలో అంతగా తెలియదు. కాబట్టి దానిని మనం చులకనగా తీసుకుంటాం. లేదంటే పెద్దగా పట్టించుకోం. అందుకే ఈ సమస్య ఏదో ఒక సమయంలో తీవ్రమవుతుంది. ప్రాణాలమీదకు వచ్చేస్తుంది. అందుకే దీనిని మొదటినుంచే కంట్రోల్ చేయాలి అంటున్నారు నిపుణులు. ఆహారాన్ని సక్రమంగా తీసుకోకపోవడం వల్ల కూడా చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయని చెప్తున్నారు. అయితే దీనిని కంట్రోల్ చేయడానికి ముందు వైద్యుని సంప్రదించాలి. వారు ఇచ్చే సూచనలు ఫాలో అవ్వాలి.

అంతేకాకుండా జీవనశైలి, ఆహారంలో పలు మార్పు చేయాలి. వ్యాయామం కచ్చితంగా చేస్తూ ఉండాలి. దీనివల్ల సమస్య అదుపులోకి వస్తుంది. వీటితో పాటు మీ ఆహారంలో కొన్ని మసాలాలను కలిపి తీసుకోవాలి అంటున్నారు నిపుణులు. ఇవి శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయని చెప్తున్నారు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడే అనేక సుగంధ ద్రవ్యాలు మన వంటగదిలో ఉన్నాయి. కొన్ని మసాలా దినుసులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఈ సమస్యను కొంత వరకు నియంత్రించవచ్చని చెప్తున్నారు. అవేంటో మీరు తెలుసుకుని.. సమస్య ఉన్నా.. మీ కావాల్సిన వారు ఈ సమస్యతో బాధపడుతున్నా.. వీటిని ఫాలో అవ్వమని చెప్పండి. మీరు కూడా ఫాలో అవ్వండి.

పసుపు

పసుపు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. దీనిలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి వివిధ రకాల సమస్యలను నివారించడంలో మీకు సహాయపడతాయి. అంతేకాకుండా కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో కూడా పసుపు సహాయపడుతుంది. కాబట్టి మీరు దీనిని క్రమం తప్పకుండా తీసుకుని.. దాని ప్రయోజనాలను పొందవచ్చు. మరీ ఎక్కువగా తీసుకుంటే వేడి చేస్తుందని గుర్తించుకోండి.

దాల్చిన చెక్క

దాల్చిన చెక్క మంచి రక్త ప్రసరణను అందించడంలో సహాయం చేస్తుంది. ఈ మసాలాను మీ ఆహారంలో తీసుకోవడం వల్ల రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయి కొంత వరకు అదుపులో ఉంటుంది. అంతేకాకుండా ఇది శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.

మిరియాలు

ఇవి యాంటీ-ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో నిండి ఉంటుంది. అంతే కాకుండా కొవ్వు కణాలను కరిగించడంలో కూడా ఇది హెల్ప్ చేస్తుంది. ఫలితంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ స్థాయి తగ్గుతుంది. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది.

మెంతులు

మధుమేహాన్ని నియంత్రించడంలో మెంతులు చాలా ఉపయోగపడతాయి. ఇది చాలా మందికి తెలుసు. అయితే చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో కూడా మెంతులు ఉపయోగపడతాయని అందరికీ తెలియదు. ఇది చిన్న పేగు, కాలేయంలోని కొలెస్ట్రాల్ శోషణను నిరోధిస్తుంది. ఫలితంగా శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోదు.

వామ్ము

చాలా మంది వంటలో రుచికోసం దీనిని ఉపయోగిస్తారు. అయితే ఇంతకు మించిన చాలా గుణాలున్నాయి దీనిలో ఉన్నాయి. వాటిలో ఒకటి కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడం. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి.

WhatsApp channel

సంబంధిత కథనం