Back Pain Relief | దాల్చిన చెక్క తింటే.. వెన్నునొప్పి మాయం.. ఎలా అంటారా?-back pain relief and weight loss with cinnamon tips are here ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Back Pain Relief And Weight Loss With Cinnamon Tips Are Here

Back Pain Relief | దాల్చిన చెక్క తింటే.. వెన్నునొప్పి మాయం.. ఎలా అంటారా?

HT Telugu Desk HT Telugu
May 13, 2022 12:31 PM IST

మీరు వెన్ను నొప్పి కారణంగా నిద్రపోలేకపోతున్నారా? లేదా మీరు కూర్చున్నప్పుడు నొప్పి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందా? అయితే మీ రోజువారీ ఆహారంలో దాల్చినచెక్కను చేర్చుకోండి. దీనిని తీసుకోవడం వల్ల మీకు చాలా ప్రయోజనాలు ఉంటాయి తెలుసా? ఆ ప్రయోజనాలు ఏంటో? ఎలా దానిని తీసుకోవాలో ఇప్పుడు చుద్దాం.

దాల్చిన చెక్కతో ఎన్నో ప్రయోజనాలు
దాల్చిన చెక్కతో ఎన్నో ప్రయోజనాలు

Back Pain Relief with Cinnamon | మీరు ప్రతిరోజూ చాలా సేపు మీ మెడను కిందకి పని చేస్తున్నారా? వంటగదిలో కూరగాయలు కోసినా, ఆఫీసు డెస్క్‌లో పని చేసినా.. రోజంతా మీ మెడను కిందకి దించి పనిచేస్తున్నప్పుడు అది మీ శరీరంపై విభిన్న ప్రభావాలను చూపిస్తుంది. దీని కారణంగా మీకు వెన్నునొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది.

ఒక్కోసారి మీరు తీవ్రమైన వెన్నునొప్పిని ఎదుర్కోవాల్సి వస్తుంది. పడుకున్నప్పుడు వెన్నునొప్పి వల్ల నిద్ర రాకపోతే లేదా కూర్చున్నప్పుడు నొప్పి మిమ్మల్ని బాధపెడితే.. మీరు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే మీ రోజువారీ ఆహారంలో ఓ మసాలాను చేర్చుకోవడం చాలా ముఖ్యం. అదే దాల్చిన చెక్క.

ఎన్నో ప్రయోజనాలు..

ప్రతి రోజు దాల్చిన చెక్క తినమంటున్నారు ఆహార నిపుణులు. ఇది మీకు శరీర బరువును తగ్గించడంలో కూడా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందని వెల్లడించారు. శరీర నొప్పులు నుంచి ఉపశమనం పొందడంలో కూడా ఇది ప్రభావవంతంగా ఉంటుందని స్పష్టం చేశారు. దాల్చినచెక్కలో చాలా ప్రయోజనకరమైన పోషకాలు ఉన్నాయి. ఇందులో ఫైబర్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్ ఉంటాయి. సిన్నమిక్ యాసిడ్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో దెబ్బతిన్న కణాలను రిపేర్ చేస్తాయి. అంతేకాకుండా కీళ్లనొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

వెన్నునొప్పికి దాల్చిన చెక్క చాలా ఉపయోగపడుతుంది. అలాంటప్పుడు ఒక టీస్పూన్ తేనె తీసుకోండి. దాల్చిన చెక్క పొడిని అందులో వేయండి. రాత్రి పడుకునే దీనిని తీసుకోండి. ఉదయం పరగడుపునే కలిపి తినండి. దీనివల్ల మీరు చాలా త్వరగా ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. గిన్నెలో నీటిని వేడి చేసి.. దానిలో దాల్చిన చెక్కను వేసి మరిగించాలి. అనంతరం దానిని ఒడకట్టి.. గోరువెచ్చగా ఉన్నప్పుడు సేవించాలి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్